స్నానం చేసే ముందు ఇలా చేస్తే మంచిదా?? | Telugu News
గుడ్డు ఉడకాల్సిన సమయం ఎంత?-రేవంత్ కు పంచ్ ఇచ్చిన బాలయ్య-ఏపీలో రద్దు కానున్న ఎంసెట్-నోబెల్ తో రండి 100 కోట్లు పట్టుకెళ్ళండి: బాబు-ఉద్దానం బాధితులపై పూర్తిస్థాయిలో స్పందించిన ముఖ్యమంత్రి-మనకి ప్రాణభిక్ష పెట్టిన సైనికుడు బిచ్చమెత్తుకుంటున్నాడు-సంక్రాంతికి సాంప్రదాయం లోపిస్తోందా??-ఇలాంటి గవర్నర్ మనకు దొరకడం మన ఖర్మ-ఉద్దానం పాపం ఎవరిది?-మద్యం అమ్మకాలపై గళం విప్పిన హర్మన్ సింగ్ సిద్ధూ

స్నానం చేసే ముందు ఇలా చేస్తే మంచిదా??

వాతావరణం వేడిగా ఉన్నప్పుడు మనం నీళ్లు బాగానే తాగుతుంటాం. అదే క్లైమేట్ చల్లగా ఉంటే మాత్రం పెద్దగా పట్టించుకోం. మనం దాహం వేస్తే గానీ నీళ్ల గురించి ఆలోచించం. నిజానికి దాహం వేయటానికి ముందుగానే మన ఒంట్లో నీటి శాతం చాలా వరకు తగ్గిపోతుంది. పరిస్థితి ఇంతవరకు రాకుండా తరచుగా నీళ్లు తాగటం మంచిదన్నది నిపుణుల సూచన. కానీ మనలో చాలా మంది ఈ విషయం తెలిసి కూడా తాగలేం. మరీ ముఖ్యంగా వృద్ధులు తగినంత నీరు తాగరు. వయసులో ఉన్నప్పుడు అన్నీ గుర్తించగలం కానీ వృద్ధాప్యంలో దాహం వేస్తున్న విషయాన్ని గుర్తించటం తగ్గుతుంది. కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు మూత్రం ఎక్కువగా వస్తుంటుంది. అలా మూత్రం ఎక్కువగా వచ్చేలా చేసే మందుల వల్ల కూడా ఈ దాహం సమస్య మరింత సమస్యాత్మకంగా పరిణమిస్తుంది.
మన ఒంట్లో ప్రతి వ్యవస్థా సక్రమంగా పనిచేయటానికి మనం త్రాగే నీరు ఎంతగానో తోడ్పడుతుంది. ఇది కణాలన్నింటికీ పోషకాలు, ఆక్సిజన్ను చేరవేయటం దగ్గర నుండి మూత్రాశయం నుంచి బ్యాక్టీరియాను బయటకు వెళ్ల గొట్టటం వరకు రక రకాల పనులు చేస్తుంది. మనం తిన్న ఆహారం సరిగా జీర్ణ మయ్యేలా చేస్తుంది మలబద్ధకాన్ని దరి చేర నీయదు. అవయవాలను, కణజాలాలను రక్షిస్తూ.. కీళ్లు ఒరుసుపోకుండా చూస్తుంది. అధిక రక్తపోటును, గుండె వేగాన్ని నియంత్రిస్తుంది. ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ సోడియం వంటి ఎలక్ట్రోలైట్ల సమతుల్యత దెబ్బ తినకుండా చూస్తుంది. ఇంత కీలకమైంది కాబట్టే నీటి శాతం తగ్గితే బలహీనత, రక్తపోటు పడిపోవటం, తికమక, తల తిప్పడం వంటి లక్షణాలు బయట పడతాయి. కాబట్టి రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగేలా చూసుకోవడం మంచిది. ఇది కూడా వ్యక్తులను బట్టి మారుతుంది. కొన్ని రకాల జబ్బులు గలవారు మరింత ఎక్కువగా నీరు తాగాల్సిన అవసరం ఉండొచ్చు. అలాగే ఎక్కువగా వ్యాయామాలు చేసేవారు , శారీరక శ్రమ చేసే రైతులు, కూలీలు చెమట రూపంలో బయటకు వెళ్లే నీటిని ఎప్పటికప్పుడు తిరిగి భర్తీ చేసు కుంటూనే ఉండాలి.
స్నానానికి వెళ్ళే ముందు ఒక గ్లాస్ నీరు త్రాగితే చాలా మంచింది. ఎందుకంటే స్నానం చెయ్యడం వల్ల మన శక్తిలో చాలా భాగం ఖర్చు అయిపోతుంది. ఆ శక్తి పోకుండా ఉండడానికి మనం స్నానం చేసే ముందు త్రాగే ఒక గ్లాస్ నీరు చాలా తోడ్పడుతుంది. నీరు మొత్తం మ్మీద మూత్రం ముదురు రంగులో రాకుండా చూసుకుంటే నిత్యం తగినంత నీరు తాగుతున్నట్టే. కూల్ డ్రింకులు తాగడం కన్నా వీలైనంతగా నీరు తాగటమే ఉత్తమం. నీరు ఎక్కువగా తగలేము అనుకుంటే నీటికి బదులుగా పండ్లు, పండ్ల రసాలు, ఫ్రూట్ సలాడ్ల వంటివి తినొచ్చు. నీటి శాతం ఎక్కువగా ఉండేలా చూసుకుంటే మంచిదని అందరికీ తెలిసిందే కానీ ఎందుకు మరిచిపోతున్నారు.
వీలైనంత ఎక్కువ నీరు త్రాగండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts