నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారా అయితే ఒక లుక్కేయండి… | Telugu News
గుడ్డు ఉడకాల్సిన సమయం ఎంత?-రేవంత్ కు పంచ్ ఇచ్చిన బాలయ్య-ఏపీలో రద్దు కానున్న ఎంసెట్-నోబెల్ తో రండి 100 కోట్లు పట్టుకెళ్ళండి: బాబు-ఉద్దానం బాధితులపై పూర్తిస్థాయిలో స్పందించిన ముఖ్యమంత్రి-మనకి ప్రాణభిక్ష పెట్టిన సైనికుడు బిచ్చమెత్తుకుంటున్నాడు-సంక్రాంతికి సాంప్రదాయం లోపిస్తోందా??-ఇలాంటి గవర్నర్ మనకు దొరకడం మన ఖర్మ-ఉద్దానం పాపం ఎవరిది?-మద్యం అమ్మకాలపై గళం విప్పిన హర్మన్ సింగ్ సిద్ధూ

నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారా అయితే ఒక లుక్కేయండి…

ఆరోగ్యకరమైన గోళ్లు చేతులకు ఎంతో అందాన్నిస్తాయి. చేతి గోళ్లనుంచీ వేసుకునే దుస్తులదాకా అన్నీ, ప్రతిదీ ప్యాషన్‌మయమే. గోళ్లను శుభ్రంగా ఉంచుకోవటం, పాలిష్ చేసుకోవటం మాత్రమే కాదు.. వీటిని అందంగా తీర్చిదిద్దేందుకు అతివల అవస్థలు పడుతుంటారు. గోళ్లకు రంగులు వేసుకొనే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఆ టిప్స్ ఏంటో చూద్దామా…

  • గోళ్ల రంగు వేసినప్పుడు బబుల్స్ ఏర్పడకుండా ఉండాలంటే బాటిల్ ను ఎక్కువగా ఊపకుండా ఉంటే మంచిది.
  • స్నానం చేసిన వెంటనే గోర్లకు నెయిల్ పాలిష్ పెట్టకూడదు. తడిగా ఉండడం వల్ల పాలిష్ ఆరడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. తడి ఆరాక గోళ్లకు రంగు పెట్టుకోవచ్చు.
  • పాలిష్ చేసుకున్న అనంతరం గోళ్లను ఐస్ క్యూబ్స్ కరిగించిన చల్లని నీళ్లలో ముంచాలి. వేసుకున్న రంగు చిటికెలో ఆరిపోతుంది.
  • నెయిల్ స్టిక్కర్స్ వాడే సమయంలో వాటిని గోరు అంచుల దాక అంటించాలి. దాని మీద పూసే టాప్ కోట్ నెయిల్ పాలిష్ గోరు అంచుల వరకూ వేయాలి.
  • బ్రష్ నిండుగా రంగు తీసి ఒక్కసారిగా వేయకూడదు. రంగును కొంచెంగా తీసుకుంటూ గోరు మధ్య భాగం నుంచి చివరి వరకు వేయాలి. ఈ సమయంలో గోళ్ల చుట్టూ టిష్యూ పేపర్ లేదా దూదిని ఉంచితే అదనపు రంగు దానికి అంటుతుంది.
  • గోళ్లు పుచ్చిపోయినట్లు ఉంటే రంగు వేయడం కంటే గోరింటాకు పెట్టుకుంటే బాగుంటుంది.
  • గోళ్ల రంగు ఆకర్షణీయంగా కన్పించాలంటే రెండు కోటింగ్‌లు వేస్తే బాగుంటుంది. మొదటి కోటింగ్ పూర్తయ్యాకనే మరోసారి వేయాలి. చివరగా పారదర్శక రంగు వేస్తే గోళ్లు చక్కగా మెరుస్తాయి.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts