మనం తినే ఆహారంలో కాల్షియం ఎక్కువైనా ముప్పేనా?? | Telugu News
గుడ్డు ఉడకాల్సిన సమయం ఎంత?-రేవంత్ కు పంచ్ ఇచ్చిన బాలయ్య-ఏపీలో రద్దు కానున్న ఎంసెట్-నోబెల్ తో రండి 100 కోట్లు పట్టుకెళ్ళండి: బాబు-ఉద్దానం బాధితులపై పూర్తిస్థాయిలో స్పందించిన ముఖ్యమంత్రి-మనకి ప్రాణభిక్ష పెట్టిన సైనికుడు బిచ్చమెత్తుకుంటున్నాడు-సంక్రాంతికి సాంప్రదాయం లోపిస్తోందా??-ఇలాంటి గవర్నర్ మనకు దొరకడం మన ఖర్మ-ఉద్దానం పాపం ఎవరిది?-మద్యం అమ్మకాలపై గళం విప్పిన హర్మన్ సింగ్ సిద్ధూ

మనం తినే ఆహారంలో కాల్షియం ఎక్కువైనా ముప్పేనా??

సహజంగా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న ఆరోగ్య సమస్య మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడం. సగటున ప్రతి ఏడాదికి మొత్తం జనాభాలో 10,000 మందిలో 7 నుంచి 21 మంది మూత్ర పిండాలలో రాళ్ళ సమస్య తో బాధ పడుతున్నట్టు వైద్య నిపుణులు చెప్తున్నారు. అందులోను ఎక్కువ మంది పురుషులే ఉండటం గమనించాల్సిన విషయం. స్త్రీలకి ఉండవని కాదు వారికీ మూత్రంలో రాళ్ళు ఉన్నాయి కానీ 80 శాతం కేసులు మాత్రం పురుషులకు సంబంధించినవే ఉంటున్నాయి.
నిజానికి రాళ్ళు మూత్రాశయంలోనో మూత్రనాళంలోనో ఏర్పడవు. మూత్రపిండాల లోపల ఏర్పడతాయి కానీ మూత్రాశయంలో మరియు మూత్ర నాళంలో కనిపిస్తుంటాయి. మానవ శరీరంలో రక్తంలో యూరిక్‌ ఆసిడ్‌ లవణాలు,కాల్షియం పాస్సరస్‌ ఎక్కువ కావటం వల్లే ఈ రాళ్లు ఏర్పడుతుంటాయి.

అవసరాన్ని మించి లోపల అధికంగా నిల్వ ఉన్న లవణాలు మొత్తం స్ఫటిక రూపాన్ని దాల్చి కిడ్నీ లోపలి పొరలపై నిలవ అవుతాయి. మూత్ర వ్యవస్థకి ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా అధికంగా ఉన్న లవణాలు బయటకి రాలేక పోవడం వల్ల కూడా రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి.
ఈ రాళ్ల సైజు ఎలా ఉంటుందో తెలుసా??
ఇసుక రేణువు తో మొదలై బత్తాయి పండు సైజు వరకు ఎంత పరిమాణంలోనైనా ఉండొచ్చు.
కిడ్నీలోగాని బ్లాడర్‌లోగానీ ఉన్న ఈ రాళ్లు కదలకుండా ఉన్నంత వరకు మాత్రం మనకు ఎలాంటి నొప్పిని కలిగించవు. లోపల ఉన్న సరే అసలు లేనట్టుగానే అనిపిస్తాయి.

కాని రాయి ఎంత చిన్న సైజులో ఉన్నా సరే అది కిడ్నీ నుంచి బ్లాడర్‌లోకి జారుతున్నప్పుడు యురెటర్‌ లోపలి సున్నితమైన పొర లైనింగ్‌ దెబ్బ తినడం మొదలవుతుంది. ఈ లేయర్ ఎప్పుడైతే దెబ్బతినడం మొదలవుతుందో అప్పుడు మనకు భరించలేని బాధ కలుగుతుంది.
అసలు కిడ్నీ లో రాళ్ళుంటే ఆ విషయం బయటపడడానికి మన సిస్టం ఏవేం సంకేతాలు పంపుతుంది??
—> వీపుకింద భాగాన తీవ్రంగా నొప్పి మొదలవుతుంది. ఇలా మొదలైన నొప్పి మరింత తీవ్ర రూపం దాల్చి ముందువైపు పొత్తి కడుపు దాకా వ్యాపిస్తుంది. అక్కడ నుంచి కిందకు జారుతూ జననేంద్రియాల వరకూ కూడా వ్యాప్తి చెందుతుంది.
ఒక చిన్న రాయిని ప్రశాంతంగా ఉన్న నీటి తొట్టెలో గానీ చెరువులో గానీ వేస్తే ఎంత అలజడి రేగుతుందో అలాగే ఈ కిడ్నీలో ఉన్న రాయి మూత్రపిండం నుండి మూత్రాశయం వరకు వారధిలా ఉన్న మూత్రనాళంలో కదుల్తున్న కొద్దీ నొప్పి అలలు అలలుగా వస్తూ బాధ పెడుతుంది.
—->అప్పుడప్పుడు కడుపులో తెమల్చడం, బాగా చలితో వణుకు వచ్చే జ్వరం, ఏ ఆహరం తీసుకున్నా వాంతులు అవ్వడం, తీవ్రమైన నడుము నొప్పి మరియు మూత్రం పోస్తున్నప్పుడు పొత్తి కడుపు నుండి కింద వరకు నొప్పి ఉంటుంది. ఒక్కో సారి మూత్రంలో రక్తం కూడా వెలువడుతుంది. వీపు కింద భాగాన్ని గాని, పొత్తి కడుపును గానీ కొంచెం అంటుకున్నా చాలు భయంకరమైన నొప్పి మొదలవుతుంది.
అసలు ఈ రాళ్ళూ ఎందుకు ఏర్పడుతున్నాయో కారణాలు తెలుసుకుందాం.
మన వాడుక భాషలో వివరిచాలంటే మూత్రంలో శుద్ధి కాకుండా ఉన్న రసాయనాలు బాగా చిక్కబడి వాటి సాంద్రత పెరిగి స్పటిక రూపాన్ని దాల్చడం వల్ల ఈ రాళ్లు ఏర్పడతాయి. ఇలా చిక్క బడటానికి కూడా కారణాలు ఉన్నాయి అవేంటో చూద్దాం…
—->రాళ్ళు ఏర్పడడానికి సానుకూలమైన శరీరతత్వం ఉండటం వల్ల,
—>మనం రోజూ తినే ఆహారంలో కాల్షియం మరియు ఇతర ఖనిజ లవణాలు కొన్ని అధికంగా ఉండటం వల్ల ఈ రాళ్లు ఏర్పడతాయి.
—>యూరిక్‌యాసిడ్‌ అధికం కావటం వల్ల మరియు విటమిన్‌ ‘సి’ లేక విటమిన్‌ ‘డి’ అధికంగా ఉండే కొన్ని రకాల మందులు తీసుకోవటం, రోజు శరీరానికి సరిపడా నీరు త్రాగకపోవడం వల్ల కూడా రాళ్లు ఏర్పడుతాయి.

మూత్రనాళం ఇన్‌ఫెక్షన్‌కి గురి కావడం వల్ల, అతిగా చెమట పడుతూ శరీరంలోని నీటిని ఎక్కువగా విసర్జింప చేసి ఉష్ణమండల ప్రదేశాలలో నివసించే వారికి, అనారోగ్య కారణాల వల్ల దీర్ఘకాలం మంచం నుంచి దిగలేని వారికి రాళ్లు ఏర్పడే అవకాశాలున్నాయి.

చికిత్స : కిడ్నీరాయి చిన్నదిగా 5 మి.మీ లోపు ఉంటే దానికి ఎటువంటి ప్రత్యేక చికిత్స అవసరం లేకుండానే మూత్రం నుంచి వెళ్ళిపోతుంది. 5 నుంచి 10 మి.మి దాకా ఉండే రాయి పెద్దగా అవుతున్న కొద్దీ తనకు తానుగా బయటికి పోదు. మందుల ద్వారా కరిగించవచ్చు. 10 మి.మి కి మించిన సైజు ఉండే రాయి అయితే సర్జరీ ద్వారా లేక లిథో ట్రిప్సి ద్వారా తొలగించాల్సి ఉంటుంది.

లిథో ట్రిప్సి : ద్వారా చేసే చికిత్సలో ఎక్స్‌రేల ద్వారా రాయి ఎక్కడ ఉందో పసిగట్టి సరిగ్గా ఆ భాగంపై అధిక శక్తి కలిగిన షాక్‌వేవ్స్‌ను ఫోకస్‌ చేస్తారు. దానివల్ల రాయి చిన్నచిన్న ముక్కలుగా విడిపోయి, ఆ చిన్న చిన్న ముక్కలు మూడు నాలుగు నెలల లోపు మూత్రం ద్వారా ఒక్కొక్కటిగా బయటకు వెళ్లిపోతాయి.

శస్త్రచికిత్స : సర్జరీ చేసినప్పుడు డాక్టరు కిడ్నీని ఓపెన్ చేసి లోపల ఉన్న రాళ్ళను ఏరి బయటికి తీస్తారు. కానీ సర్జరీలో ఉండే అసౌకర్యం ఏమిటంటే కిడ్నీని కోసి తెరచిన ప్రతి సారి కిడ్నీ తన సామర్థ్యంలో 20 శాతాన్ని కోల్పోతుంది. తప్పని సరి పరిస్థితుల్లో మాత్రమే ఆపరేషన్ చేయించుకోవడం ఉత్తమం.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts