టెన్షన్ పడకండి… | Telugu News
గుడ్డు ఉడకాల్సిన సమయం ఎంత?-రేవంత్ కు పంచ్ ఇచ్చిన బాలయ్య-ఏపీలో రద్దు కానున్న ఎంసెట్-నోబెల్ తో రండి 100 కోట్లు పట్టుకెళ్ళండి: బాబు-ఉద్దానం బాధితులపై పూర్తిస్థాయిలో స్పందించిన ముఖ్యమంత్రి-మనకి ప్రాణభిక్ష పెట్టిన సైనికుడు బిచ్చమెత్తుకుంటున్నాడు-సంక్రాంతికి సాంప్రదాయం లోపిస్తోందా??-ఇలాంటి గవర్నర్ మనకు దొరకడం మన ఖర్మ-ఉద్దానం పాపం ఎవరిది?-మద్యం అమ్మకాలపై గళం విప్పిన హర్మన్ సింగ్ సిద్ధూ

టెన్షన్ పడకండి…

ఏకారణం చేతనైనా మన శరీరం కొంత మార్పుకు లోనవుతుంది. దీనిని ”ఒత్తిడి అంటారు. ఈ మార్పులు శరీరంలోని వివిధ భావావేశాలు అనగా-సంతోషం, విచారం, కోపం, భయం వలన కలుగుతాయి. ఈ మార్పుల వలన వచ్చే పరిణామాలను తట్టుకోవడానికి మన శరీరం ఒత్తిడికి లోనవుతుంటుంది. పెద్దవారిలో ఈ ఒత్తిడి, సాధారణంగా కుటుంబంలోని కలహాలు, సమస్యల వలన కలుగుతుంది. ఈ ఆధునిక సమాజంలో, పెద్దలే కాక పిల్లలు కూడా ఒత్తిడికి గురవుతున్నారు. ఒత్తిడి కలిగించే సంఘటనలు ప్రతివ్యక్తి జీవితంలో సర్వసాధారణంగా మారుతున్నాయి.

టెన్షన్ అనేది వ్యక్తి జీవితంలో ఒక భాగంగా అయిపోయింది. ఒత్తిడి వలన లాభాలు కూడా ఉన్నాయి. ఇవి పిల్లలకు, పెద్దలకు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి, శక్తిమంతులుగా మారడానికి సహాయపడతాయి. కాని అధిక ఒత్తిడి మాత్రం అనేక శారీరక , మానసిక సమస్యలకు దారితీస్తాయి. నేటి పిల్లలు, మనం పెరిగిన వాతావరణం కంటే భిన్నమైన ప్రపంచంలో పెరుగుతున్నారని చెప్పవచ్చు. సాధారణంగా పిల్లలకు, తమ తోటి పిల్లల వలన, పెద్దల ఆంక్షలు, ఆశల వలన అధికంగా ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి వలన, పిల్లలు తమ బాల్యంలో ఉండే సహజమైన ఆనందాన్ని, అమాయకత్వాన్ని అనుభవించలేకపోతున్నారు. ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు ఎదుర్కొనే మరో క్లిష్టమైన సమస్య, పిల్లలకు సరైన సమయం ఇవ్వకపోవడం.

తల్లిదండ్రులు పిల్లలతో సరైన సంబంధం కలిగి ఉండలేకపోతున్నారు. పిల్లలు చెప్పే వాటిని ఓపికగా విని, వారికి తెలియని విషయాలను తెలియపరచి, వారిని సరైన మార్గంలో నడిపించలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం, మారుతున్న జీవనశైలి విధానాలు. వీటి మూలంగా తల్లిదండ్రులు తాము సాధారణంగా నిర్వర్తించే బాధ్యతలో అనేక అంతరాయాలు ఏర్పడుతున్నాయి.

ఇలా నిత్య జీవితంలో అన్ని వయసులు వారు, అన్ని వర్గాల వారు, పిల్లలు పెద్దలు ఒత్తిడికి గురౌతున్నారు. ఒత్తిడికి ముఖ్య కారణాలు స్కూల్ మార్పిడి తోటిపిల్లల వలన వచ్చే సమస్యలు తీవ్రమైన శారీరక , మానసిక గాయాలు అనారోగ్యము, నూతన గృహానికి మారడం, విలువైన వాటిని పోగొట్టుకోవడం, తల్లిదండ్రుల దాంపత్య జీవితంలో సమస్యలు, విడాకులు, విడిపోవటం ఇవన్నీ మనుషులను బాగా ఒత్తిడికి గురిచేస్తాయి.

చాలీచాలని మౌలిక వనరులు అనగా-ఆహారం, బట్టలు, ఆశ్రయం మొదలగునవి.
అలాగే దగ్గరైన వ్యక్తులు మరణించటం అనగా-తల్లిదండ్రులు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, తోటివారు, ప్రేమించేవారు, ఇష్టమైనవారు, ప్రాణ స్నేహితులు చనిపోవటం మొదలైనవి. తరచూ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, పాఠశాల సిబ్బందితో ఘర్షణలు అని చెప్పవచ్చు. ఒత్తిడి లక్షణాలు తరచూ చికాకు కనబర్చడం, స్నేహితులతో కలవకపోవడం

ఆటల నుండి తమను తాము విరమించుకోవడం, కారణం లేకుండా మాటిమాటికి ఒళ్లునొప్పులని చెప్పడం, కుదురుగా ఒకచోట కూర్చోలేకపోవడం,, పనిమీద ధ్యాస లేకపోవడం, ఇంటినుండి పారిపోవడానికి ప్రయత్నించడం, ఆత్మహత్యాప్రయత్నం వంటి ఆలోచనలు కలిగియుండడం, పెద్దపెద్దగా అరవటం, కేకలు వేయడం, ఇష్టమైన పనులపై కూడా ఆసక్తి కనబరచకపోవడం తమలో తాము ఎక్కువగా మాట్లాడుకోవడం నిద్రలేమితనం, మితిగా ప్రవర్తించటంచ గోళ్లు కొరకడం, వ్రేళ్లు చీకడం, ఆహారాన్ని ఇష్టంగా తినకపోవడం, ఊహా ప్రపంచంలో జీవించటం లేదా ఎక్కువ సమయం కలలు కంటుండడం. దొంగతనాలు చేయడం.పైన తెలుపబడిన లక్షణాలను పిల్లలలో గుర్తించినట్లయితే, తల్లిదండ్రులు వెంటనే తమ పిల్లల్లోని ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నించాలి.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts