స్లిమ్ గా మారడానికి కష్టపడక్కర్లేదు ఇలా చేస్తే చాలు | Telugu News
గుడ్డు ఉడకాల్సిన సమయం ఎంత?-రేవంత్ కు పంచ్ ఇచ్చిన బాలయ్య-ఏపీలో రద్దు కానున్న ఎంసెట్-నోబెల్ తో రండి 100 కోట్లు పట్టుకెళ్ళండి: బాబు-ఉద్దానం బాధితులపై పూర్తిస్థాయిలో స్పందించిన ముఖ్యమంత్రి-మనకి ప్రాణభిక్ష పెట్టిన సైనికుడు బిచ్చమెత్తుకుంటున్నాడు-సంక్రాంతికి సాంప్రదాయం లోపిస్తోందా??-ఇలాంటి గవర్నర్ మనకు దొరకడం మన ఖర్మ-ఉద్దానం పాపం ఎవరిది?-మద్యం అమ్మకాలపై గళం విప్పిన హర్మన్ సింగ్ సిద్ధూ

స్లిమ్ గా మారడానికి కష్టపడక్కర్లేదు ఇలా చేస్తే చాలు

స్లిమ్‌గా ఉండే వాళ్లందరూ విపరీతంగా వ్యాయామాలు చేసి సన్నబడ్డ వాళ్లేమీ కాదు. అలాగని ఆహార నియమాలుపెద్దగా పాటిస్తున్న వాళ్లు కూడా కాదు. కాకపోతే కొన్ని సింపుల్ ట్రిక్స్ విధానాల్ని విధిగా పాటిస్తారు. కొన్ని ప్రత్యేక విధానాలు పాటిస్తూ స్లిమ్ గా మారిపోతున్నారు. ప్రత్యేకించి బ్రేక్‌ఫాస్ట్‌ తప్పనిసరిగా తీసుకుంటున్నారు. మనసు చెప్పే మాటల్ని శ్రద్దగా వినడం తప్పనిసరిగా చేస్తారు. పరిశుభ్రత విషయంలో మాత్రం కూడా కాస్త పట్టుదలగానే ఉంటారు. ఒకరకంగా ఇవి వాళ్ళకి రెండవ ప్రకృతిగా మారిపోయి వాళ్ల జీవితాంతం కొనసాగుతుంటాయి.
వాళ్లు అనుసరించే మార్గాలు
బ్రేక్‌ఫాస్ట్‌ను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మానేయకుండా, ప్రతిరోజూ తప్పనిసరిగా తీసుకుంటారు. శరీర ఆరోగ్యానికి, అందానికి నిజంగా ఇది చాలా తప్పనిసరి.
కొంత మంది అయితే బ్రేక్‌ఫాస్ట్‌ చేయకుండా ఏకంగా లంచ్‌ చేసేవాళ్లు అధిక కేలరీలు ఉండే ఆహార పదార్థాల్ని అధిక మోతాదులో తీసుకుంటారు. బ్రేక్‌పాస్ట్‌ తీసుకోని వారి శరీరం తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. అలంటి ఒత్తిడిలో ఉన్నప్పుడు లంచ్‌ చేస్తే ఎవరైనా అతిగా తినేస్తారు. దీని వల్ల శరీరం బరువు చాలా వేగంగా పెరగడానికి, అంతిమంతా స్థూలకాయం రావడానికి కారణమవుతుంది.


స్లిమ్‌గా ఉండే వాళ్ళలో చాలా మంది శరీరానికి శ్రమ కలిగించే పనుల విషయంలో అసలు వెనుకంజ వేయరు. ప్రతి దానికీ బండిని వాడకుండా, వాకింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఈ కాస్త శ్రమ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఒత్తిళ్లు, డిప్రెషన్‌ వంటి మానసిక రుగ్మతల భారిన పడకుండా వారిని కాపాడుతుంది. ముఖ్యంగా మదుమేహం బారిన పడకుండా కాపాడుతుంది. వారానికి కనీసం ఐదు రోజులైనా ఇలా శ్రమించేవారి శారీరక ఆరోగ్యం సహజంగానే బాగుంటుంది. శారీరక ఆరోగ్యం ఉన్న వాళ్ల మనసు తెలియకుండానే మంచి బలవర్ధకమైన మరియు ఆరోగ్యవంతమైన ఆహార పానీయాల వైపే దృష్టి పెడుతుంది. ఈ స్థితిలో వీరిలో ఎండార్ఫిన్‌ హార్మోన్లు విడుదలై మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.
ఈ స్లిమ్‌ పర్సన్స్‌ తరుచూ శరీరం బరువు చూసుకుంటూ ఉంటారు. స్థూలకాయులైతే, వారానికి ఒకసారి కాకుండా రోజుకొక సారి బరువు చూసుకోవడం మంచిది. దీనివల్ల బరువు తగ్గాలని ఆలోచనలు, తగ్గే అవకాశాలు మెండుగా ఉంటాయి. అలాగే నేలమీద గీతలు గీసి వాటి మీదుగా రోజుకి రెండు సార్లు నడవడం వల్ల కూడా బరువు తగ్గే వీలుంది. వీళ్లల్లో ఎక్కువ మంది ఆ పనే చేస్తారు.
స్లిమ్‌ పర్సన్స్‌లో చాలా మందికి గాబరాగా తినే అలవాటు అసలు ఉండదు. భోజనం చేసే సమయంలో వీరు నాలుకకు కాకుండా, మనస్సాక్షికి ఎక్కువ విలువిస్తారు. మనసు కాదన్న మరుక్షణమే అది ఎంత రుచికరమైన పదార్ధమైనా తినడం అంతటితో ఆపేస్తారు. ఆహారంలో తక్కువ కేలరీలు ఉండేందుకు వీరు ముఖ్యంగా ఇంటి భోజనానికే అత్యధిక ప్రాధాన్యతనిస్తారు. అంతకన్నా మిన్నగా వారు ఏం తింటున్నారు అనే విషయంలో బాగా స్పృహలో ఉంటారు. ఆ స్పృహే వారిని ఆరోగ్య సూత్రాల్ని విధిగా పాటించేలా చేసి ఆరోగ్యవంతులుగా చేస్తుంది.
ఈ సూత్రాల్ని మీరూ కూడా యధావిధిగా పాటిస్తే పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేకుండానే నచ్చినట్టుగా మీ శరీర ఆకృతిని మీరు ఆశించిన స్థాయిలో ఉంచుకోవచ్చు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts