గడ్డం బాగా రావాలంటే ఇలా ఫాలో అవ్వాలి మరి.. | Telugu News
గుడ్డు ఉడకాల్సిన సమయం ఎంత?-రేవంత్ కు పంచ్ ఇచ్చిన బాలయ్య-ఏపీలో రద్దు కానున్న ఎంసెట్-నోబెల్ తో రండి 100 కోట్లు పట్టుకెళ్ళండి: బాబు-ఉద్దానం బాధితులపై పూర్తిస్థాయిలో స్పందించిన ముఖ్యమంత్రి-మనకి ప్రాణభిక్ష పెట్టిన సైనికుడు బిచ్చమెత్తుకుంటున్నాడు-సంక్రాంతికి సాంప్రదాయం లోపిస్తోందా??-ఇలాంటి గవర్నర్ మనకు దొరకడం మన ఖర్మ-ఉద్దానం పాపం ఎవరిది?-మద్యం అమ్మకాలపై గళం విప్పిన హర్మన్ సింగ్ సిద్ధూ

గడ్డం బాగా రావాలంటే ఇలా ఫాలో అవ్వాలి మరి..


మగవారి అందాన్ని రెట్టింపు చేసేవి గడ్డం, మీసాలే. నీట్‌గా షేవ్ చేసుకునే రోజులు పోయాయి. చాలామంది జెంట్స్‌కు మంచి మాస్ లుక్‌లో కనిపించాలని ఉన్నా గడ్డం అంత త్వరగా రాదు. అలాంటి వాళ్లు కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. కొబ్బరి నూనెతో మసాజ్ చేయటం వలన రక్త ప్రసరణ మెరుగుపడి గడ్డం పెరిగే అవకాశం ఉంది. రోజ్మేరి నూనె కొబ్బరి నూనెలో కలిసి రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఉసిరి (ఇండియన్ గూస్బెర్రీ) వల్ల గడ్డం పెరుగుతుంది. కొన్ని ఆవాల ఆకులను దంచి పేస్ట్ లా చేసుకోండి. దాన్ని ఉసిరి నూనెలో కలిపి రాసుకోండి. 20 నిమిషాల పాటు ఉంచి చల్లటి నీటితో కడిగి వేయండి. అలాగే రెండు చెంచాల నిమ్మరసానికి, ఒక చెంచా దంచిన దాల్చిన చెక్క పొడిని కలపండి. ఈ మిశ్రమాన్ని పూసుకుని 20 నిమిషాల పాటూ అలానే ఉంచి నీటితో కడిగి వేయండి.

యూకలిప్టస్ నూనెను ఆలివ్ లేదా నువ్వుల నూనెతో కలపండి. ఆ మిశ్రమంతో మసాజ్ చేసుకోండి. ఇలా చేసిన తరువాత కనీసం 20 నిమిషాల పాటూ వదిలేసి, చల్లటి నీటితో కడిగి వేయండి. మీ ముఖాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత ఎక్కువగా గడ్డం పెరడానికి అవకాశం ఉంటుంది. ఇక ప్రోటీన్, సాచురేటేడ్ ఫాట్ గడ్డం పెరగడానికి చాలా అవసరం. ఆరోగ్యకరమైన ప్రోటీన్ లను చేపల నుంచి పొందవచ్చు. సాచురేటేడ్ ఫాట్ గుడ్లు,మాంసం ద్వారా లభిస్తుంది. అలాగే విటమిన్ ఏ,సీ,ఈలను రెగ్యులర్‌గా తీసుకోవాలి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరచి గడ్డం బాగా పెరుగుంది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts