మూత్రపిండాలు యొక్క ప్రాముఖ్యత… | Telugu News
గుడ్డు ఉడకాల్సిన సమయం ఎంత?-రేవంత్ కు పంచ్ ఇచ్చిన బాలయ్య-ఏపీలో రద్దు కానున్న ఎంసెట్-నోబెల్ తో రండి 100 కోట్లు పట్టుకెళ్ళండి: బాబు-ఉద్దానం బాధితులపై పూర్తిస్థాయిలో స్పందించిన ముఖ్యమంత్రి-మనకి ప్రాణభిక్ష పెట్టిన సైనికుడు బిచ్చమెత్తుకుంటున్నాడు-సంక్రాంతికి సాంప్రదాయం లోపిస్తోందా??-ఇలాంటి గవర్నర్ మనకు దొరకడం మన ఖర్మ-ఉద్దానం పాపం ఎవరిది?-మద్యం అమ్మకాలపై గళం విప్పిన హర్మన్ సింగ్ సిద్ధూ

మూత్రపిండాలు యొక్క ప్రాముఖ్యత…

మానవ శరీరంలో ప్రతి అవయవానికి ఒక ప్రాముఖ్యత ఉంది. అలాగే మూత్ర పిండాలకు కూడా. మూత్రపిండాలు తమ విధులను సక్రమంగా నిర్వహించక పోతే, ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొనాల్సి వస్తుంది. సాధారణంగా ప్రతివారిలోనూ రెండు మూత్రపిండాలు నడుము భాగం లో ఉంటాయి. మూత్రపిండాలు శరీరంలో అధికంగా ఉన్న నీటిని, లవ ణాలను, ఇతర రసాయనాలను మూత్రం రూపంలో వెలుపలికి తీసుకు వెళుతాయి. అలాగే శరీరానికి అవసరమైన నీరు, లవణాలు, ఇతర పదార్థాలు మూత్రం ద్వారా శరీరం కోల్పోకుండా కూడా ఇవి కాపాడుతాయి.

శరీరానికి సంబంధించినంత వరకూ మూత్రపిండాలను మాస్టర్‌ కెమిస్టులని పేర్కొనవచ్చు. మూత్రపిండాలు నిర్వహించే బాధ్య తలు ఈ కింది విధంగా ఉన్నాయి. శరీరంలో ద్రవాలను సరైన స్థాయి లో ఉంచడం, శరీరంలోని రసాయనాల సమతుల్యతను కాపాడటం, వ్యర్థ పదార్థాలను శరీరంనుంచి తొలగించడం, వివిధ రకాలైన హార్మోన్ల ను విడుదల చేయడం. శరీరంలోని ద్రవాలు : శరీరంలోని ద్రవాలను తొలగించడం లేదా నిలు వరించడం మూత్రపిండాలు చేసే విధులలో ప్రధానమైనవి. ఒక వ్యక్తి ఆహారంలో అధిక మొత్తంలో ఉప్పు తీసుకుంటే, ఎక్కువగా దాహం వేసి నీరు ఎక్కువగా తాగుతాడు. అటువంటి సమయాలలో మూత్ర పిండాలు అధికంగా ఉన్న ఉప్పును, నీటిని శరీరంనుంచి మూత్రం రూపంలో తొలగిస్తాయి. ఒకవేళ మూత్రపిండాలు సక్రమంగా పని చేయని పక్షంలో ఉప్పు, నీరు శరీరంలో నిలువ ఉండిపోయి, కాళ్లు, చేతులు, ముఖం ఉబ్బుతాయి.

ఈ విధంగా ఉబ్బటాన్ని వైద్యపరి భాష లో ఎడిమా అని వ్యవహరిస్తారు. శరీరంలో ద్రవ పరిమాణం మరీ అధికమైతే, అది ఊపిరితిత్తులలోకి ప్రాకి, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే గుండెపై కూడా అధిక భారాన్ని మోపుతుంది. రసాయనాల సమతుల్యత : శరీరంలోని రసాయనాల సమతుల్యతను మూత్రపిండాలు కాపాడుతాయి. శరీరానికి అవసరం లేని కొన్ని ప్రత్యేక రసాయనాలను మూత్రపిండాలు తొలగించడమే కాకుండా, శరీరానికి అవసరమైన ఇతర రసాయనాలను అవి నిలువ ఉంచు తాయి. గుండె కండరాలు సక్రమంగా పని చేయడానికి అవసరమైన పొటాషియం ఇటువంటి రసాయనాలలో ఒకటి. ఎవరైనా పొటా షియంతో కూడిన ఆహార పదార్థాలను తీసుకున్న వెంటనే మూత్ర పిండాలు రక్తంలోని పొటాషియంను సాధారణ స్థాయిలో ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటుంది. మూత్రపిండాలు సక్రమంగా పని చేయని పక్షంలో రక్తంలో పొటాషియం స్థాయి విపరీతంగా పెరిగిపోతుంది. ఆ స్థితిలో కండరాలు పని తీరు దెబ్బతింటుంది.

రక్తంలో అధిక మొత్తంలో పొటాషియం నిలువలుంటే, గుండె పని తీరుపై కూడా ప్రభావం పడుతుంది. కొన్ని సందర్భాలలో ప్రాణా పాయం కూడా సంభవించవచ్చు. అనేక రకాల రసాయనిక చర్యల ద్వారా శరీరం ఆమ్ల పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఇటువంటి ఆమ్ల పదార్థాలు ఎక్కువైన కొద్దీ వాటి సమతుల్యత సాధారణ స్థితికి రావ డానికి అవసరమైన బఫర్‌ను మూత్రపిండాలు వాటికి జోడిస్తాయి. మూత్ర పిండాలు సక్రమంగా పని చేయని పక్షంలో ఆమ్ల పదార్థాల సమతుల్యత దెబ్బతిని అసిడోసిస్‌ అనే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ప్రొటీన్లతో సహా పలు పదార్థాల సమతుల్యతను కూడా మూత్ర పిండా లు రక్షిస్తాయి. కొన్ని రకాల మూత్ర పిండాల వ్యాధుల్లో మూత్రం ద్వారా ప్రొటీన్లు బైటికి వెళ్లిపోతాయి.

వ్యర్థ పదార్థాలు :
కండరాల సాధారణ చర్యల వలన, ఆహారం ద్వారా శరీరంలోకి చేరిన ప్రొటీన్ల విచ్ఛిన్నత వలన శరీరంలో వ్యర్థ పదా ర్థాలు ఏర్పడుతాయి. మూత్రపిండాలు సక్రమంగా పని చేయని దశ లో ఈ వ్యర్థ పదార్థాలు శరీరంపై విషపదార్థాలుగా ప్రభావం చూపుతాయి. శరీరంలో వ్యర్థ పదా ర్థాలు పేరుకుపో వడం వలన వాంతివచ్చినట్లు ఉండటం, నీరసం, అలసట, బలహీనత తదితర లక్షణాలు కనిపి స్తాయి. ఈ స్థితిని యురీమియా, యురీమిక్‌ సిండ్రో మ్‌ లేదా యురీ మిక్‌ పాయిజనింగ్‌ అని వ్యవహరిస్తారు. దీనికి కార ణం వ్యర్థ పదా ర్థాలలో ఒకటైన యూరియా అధిక మొత్తంలో పేరుకు పోవ డమే.శరీరంలోని వివిధ గ్రంథులు హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇవి కొన్ని ప్రత్యేకమైన విధులకు ఉపయోగపడుతాయి. ఆరోగ్య వంతమైన మూత్ర పిండాలు అనేక రకాలైన హార్మోన్లలను విడుదల చేస్తాయి. వాటిలో రెనిన్‌, ఎరిథ్రోప్రోటీన్‌, ఉత్తేజితమైన రూపంలో ఉండే విటమిన్‌ డి అనేవి ప్రధానమైనవి.

రెనిన్‌ రక్తపోటును నియంత్రిస్తుంది. మూత్రపిండాలు సక్రమంగా పని చేయని వారిలో నియంత్రించడానికి సాధ్యం కాని రీతిలో రెనిన్‌ విడు దలై, అధిక రక్తపోటును కలుగజేస్తుంది. ఎముకలలోని మూలుగ (బోన్‌ మారో) ఎర్ర రక్తకణాలను తయారు చేయడానికి ఎరిథ్రోప్రోటీన్‌ ఉప యోగపడుతుంది. మూత్రపిండాలు సక్రమంగా పని చేయకపోతే, ఎర్ర రక్తకణాలు కొద్ది మొత్తంలోనే తయారై, రక్తహీనతకు దారి తీస్తుంది. శరీరం ఆహారంలోని కాల్షియంను స్వీకరించేలా చేసి, ఎముకల నిర్మా ణాన్ని సరైన విధంగా ఉంచడంలో ఉత్తేజిత విటమిన్‌ డి ఉపయోగ పడు తుంది. మూత్ర పిండాలు సక్రమంగా పని చేయకపోతే, శరీరం కొది ్దపాటి కాల్షి యంను మాత్రమే స్వీకరించగలుగుతుంది. తద్వారా ఎముక లకు సంబంధించిన వ్యాధులు సంక్ర మిస్తాయి.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts