how-to-increase-immunity | Telugu News
గుడ్డు ఉడకాల్సిన సమయం ఎంత?-రేవంత్ కు పంచ్ ఇచ్చిన బాలయ్య-ఏపీలో రద్దు కానున్న ఎంసెట్-నోబెల్ తో రండి 100 కోట్లు పట్టుకెళ్ళండి: బాబు-ఉద్దానం బాధితులపై పూర్తిస్థాయిలో స్పందించిన ముఖ్యమంత్రి-మనకి ప్రాణభిక్ష పెట్టిన సైనికుడు బిచ్చమెత్తుకుంటున్నాడు-సంక్రాంతికి సాంప్రదాయం లోపిస్తోందా??-ఇలాంటి గవర్నర్ మనకు దొరకడం మన ఖర్మ-ఉద్దానం పాపం ఎవరిది?-మద్యం అమ్మకాలపై గళం విప్పిన హర్మన్ సింగ్ సిద్ధూ

చలికాలంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే..

కాలాలు మారే కొద్దీ శరీరంలో ఆరోగ్య పరంగా కొన్ని మార్పులు జరుగుతాయి . అలాంటి అనారోగ్య సమస్యల భారీ నుండి  ఎప్పటికప్పుడు శరీరం తట్టుకునేలా ఉండటానికి కారణమే  వ్యాధి నిరోధక శక్తి . అప్పుడే మనిషి త్వరగా ఎటువంటి రోగాలు భారిన పడడు. ఇది అసలే చలి కాలం చలి ఉన్నకొద్దీ వ్యాధులను వ్యాపింప చేసే క్రిములు ఎక్కువగా వృద్ధి ఉంటుంది దీని వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఈ కాలంలో జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరం.

చలిగా ఉన్నప్పుడు కాస్తఎక్కువ సమయం నిద్రపోవాలని అనిపిస్తుంది ఇంకా త్వరగా మెలుకువ రాదు . కానీ తప్పనిసరిగా ఓ అరగంటయినా వ్యాయామం చేయాలి. మరి బయటకు వెళ్లలేకపోయినా ఇంట్లోనే కొన్ని వ్యాయామాలు ఆసనాలు చేయొచ్చు, నడవొచ్చు ఏరోబిక్స్‌ కూడా చేయొచ్చు. అప్పుడే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. జీవక్రియలు మందగించకుండా సరిగ్గా పని చేస్తాయి.

* ఈ కాలంలో రకరకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి . వాటిని దూరం చేసుకోవాలంటే శరీరంలో రోగనిరోధకశక్తి పెరగాలి. అందుకోసం యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌ సి, జింక్‌ అందే పదార్థాలు ఎక్కువగా తినాలి. అంటే యాపిల్‌, అల్లం, నిమ్మజాతి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే రోగనిరోధకశక్తి పెరిగి ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.

* రోజు వేడిగా ఉన్న ఆహారానికి తీసుకోవాలి . మసాలా పదార్థాలూ, కొవ్వు, చక్కెర్లు ఎక్కువగా ఉన్నవాటిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది వేడి వేడి సూపులూ, పచ్చికాయగూరలూ, పండ్లు, ఆకుకూరలు, అరటిపండ్లు, చిలగడ దుంపలు బాగా తినాలి.

* చలికాలంలో అసలు నిద్ర ఆగదు కానీ ఎక్కువగ నిద్రపోకూడదు. అసలు పగటి పూట ఎక్కువగా నిద్రపోవడం అంత మంచిది కాదు దాని వల్ల బద్ధకంగా అనిపిస్తుంది, ఏ పని చురుకుగా చేయలేము. సాధారణంగా మనిషికి ఆరేడు గంటల నిద్ర సరిపోతుంది. నిద్రలేచిన వెంటనే అందరు టీ, కాఫీల మీద పడతారు వాటి బదులు నిమ్మరసం, తేనె కలిపిన గోరువెచ్చటి నీళ్లు, లేదంటే గ్రీన్‌, వైట్‌ టీలు తాగటం ఆరోగ్యానికి చాలా మంచిది, వాటివల్ల శరీరానికి యాంటీఆక్సిడెంట్లు అందుతాయి. మెదడు కూడా చాల చురుగ్గా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉంది కదాని నీళ్లు తాగడం చాలామంది మానేస్తుంటారు. కానీ అది సరికాదు ఎప్పుడైనా శరీరానికి తగిన నీరు కావాలి. ఒక వేళ నీరు ఎక్కువగా తాగలేకపోతే హెర్బల్‌ టీలూ, నీటిశాతం లభించే పండ్లు, కాయగూరలు తీసుకోవడం, పండ్ల రసాలు తాగడం వంటివి చేయాలి.

* శరీరానికి రాత్రే కాదు పగలు కూడా చలిగాలి తగలకుండా చూసుకోవాలి. నీళ్లలో పనులు చేసేవారు తప్పనిసరిగా చేతుల్ని తుడుచుకుని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. అప్పుడప్పుడు రెండు చేతుల్ని రుద్దుకుంటూ ఉండటం వల్ల వేడెక్కి…. రక్తప్రసరణ సక్రమంగా అందుతుంది. కీళ్లు పట్టే సమస్య ఉండదు. రాత్రులు బయటకి వెళ్లేప్పుడు స్వేట్టెర్స్ తలకి మప్లర్స్ ధరించాలి దాని వల్ల శరీరాన్ని ఎప్పుడు చలి తగలకుండా వేడిగా ఉంచుతుంది. ఇలా పాటించడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరిగి ఎలాంటి అనారోగ్య సమస్యలు ధరి చేరవు. కాబట్టి చలి కాలం జాగ్రత్తగా ఉండండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *