మీ ఫోన్ బాగా వేడెక్కుతోందా అయితే ఇలా చెయ్యండి… | Telugu News
గుడ్డు ఉడకాల్సిన సమయం ఎంత?-రేవంత్ కు పంచ్ ఇచ్చిన బాలయ్య-ఏపీలో రద్దు కానున్న ఎంసెట్-నోబెల్ తో రండి 100 కోట్లు పట్టుకెళ్ళండి: బాబు-ఉద్దానం బాధితులపై పూర్తిస్థాయిలో స్పందించిన ముఖ్యమంత్రి-మనకి ప్రాణభిక్ష పెట్టిన సైనికుడు బిచ్చమెత్తుకుంటున్నాడు-సంక్రాంతికి సాంప్రదాయం లోపిస్తోందా??-ఇలాంటి గవర్నర్ మనకు దొరకడం మన ఖర్మ-ఉద్దానం పాపం ఎవరిది?-మద్యం అమ్మకాలపై గళం విప్పిన హర్మన్ సింగ్ సిద్ధూ

మీ ఫోన్ బాగా వేడెక్కుతోందా అయితే ఇలా చెయ్యండి…

ప్రస్తుతం మార్కెట్‌లోకి లెక్కలేనన్ని స్మార్ట్‌ఫోన్‌లు వచ్చేస్తున్నాయి. పోటీ ఎక్కువగా ఉండటంతో కంపెనీలు తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లతో ఫోన్‌లను అందిస్తున్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అని, అత్యధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీని అమర్చామని ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే ఎంత మంచి ఫోనైనా, ఎన్ని ఫీచర్లున్నా స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఒక సమస్యతో వినియోగదారులు విసుగుపోతున్నారు. అదే హీట్ సమస్య.

ఎక్కువగా చార్జింగ్ పెట్టినా, వీడియోలు చూసినా, గేమ్స్ ఆడినా, అధికంగా యాప్స్‌ను ఉపయోగించిన స్మార్ట్‌ఫోన్ బాగా వేడెక్కుతోంది. అయితే ఈ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని టిప్స్ ఉన్నాయి. వీటిని పాటిస్తే మీ స్మార్ట్‌ఫోన్ వేడెక్కదు. అవేంటో ఇప్పుడు చూద్దాం…
స్మార్ట్‌ఫోన్ కేస్‌ను తీసేయండి
ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌లకు అంతే ఆకర్షనీయమైన కవర్ కేస్‌లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే మొబైల్‌ను పూర్తిగా కప్పేసే ఇలాంటి కేసులను వాడకండి. వీటిని తీసేయడం వల్ల ఫోన్‌లో జనరేట్ అయ్యే కొద్దిపాటి హీట్ ఎప్పటికప్పుడు బయటికి పోతుంది.

చార్జింగ్ పెట్టినపుడు ఇలా చేయండి
చార్జింగ్ పెట్టినపుడు మీ స్మార్ట్‌ఫోన్‌ను బెడ్, సోఫా లాంటి మెత్తని వాటిపై కాకుండా గట్టిగా ఉండే ఉపరితలంపై పెట్టండి. గట్టిగా ఉండే ఉపరితలం మొబైల్ నుంచి వచ్చే వేడిని పీల్చుకుంటుంది.

రాత్రంతా చార్జింగ్ పెడుతున్నారా?
చాలా మంది పడుకునే ముందు స్మార్ట్‌ఫోన్‌‌ను చార్జింగ్ పెట్టి రాత్రంతా అలాగే వదిలేస్తారు. దీని వల్ల బ్యాటరీ వేడెక్కడమే కాక లైఫ్ టైమ్ కూడా తగ్గిపోతుంది. బ్యాటరీని ఓవర్ చార్జింగ్ చేయడం వల్ల పేలియపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్‌ను రాత్రంతా చార్జింగ్ పెట్టి ఉంచకండి.

అలాంటి యాప్స్‌ను తీసేయండి
కొన్ని యాప్స్ విపరీతమైన గ్రాఫిక్స్‌తో ప్రాసెస్ కావడానికి చాలా సమయం తీసుకుంటాయి. ఇవి స్మార్ట్‌ఫోన్‌లో విపరీతమైన హీట్‌ను జనరేట్ చేస్తాయి. అలాంటి యాప్స్‌ను అన్‌‌ఇన్‌స్టాల్ చేసేయండి. ఎందుకంటే ఇలాంటి యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే ప్రాసెసింగ్ వల్ల ఎక్కవగా వేడి ఉత్పన్నమవుతుంది.

సూర్యకాంతికి దూరంగా ఉంచండి
ఖరీదైన స్మార్ట్‌ఫోన్లకు ట్రాన్స్‌పరెంట్ ప్లాస్టిక్ కవర్లు వేస్తుంటాం. అయితే ఇలాంటి ప్లాస్టిక్ బ్యాక్ కవర్లు వాడుతున్నప్పుడు మీ ఫోన్‌ను నేరుగా సూర్యకాంతి తగిలేలా పెట్టకండి. ఎందుకంటే ప్లాస్టిక్ త్వరగా వేడుక్కడమే కాకుండా మీ ఫోన్‌ను కూడా మరింత వేడిగా చేసేస్తుంది.

డమ్మీ బ్యాటరీలు, చార్జర్లు
మీ స్మార్ట్‌ఫోన్ కోసం కొత్త బ్యాటరీ కొనాలనుకుంటే కచ్చితంగా అదే బ్రాండ్ ఒరిజినల్ బ్యాటరీ కొనండి. ఎందుకంటే థర్డ్ పార్టీ బ్యాటరీలు విపరీతంగా వేడెక్కుతాయి. అలాగే మీ స్మార్ట్‌ఫోన్‌తో ఇచ్చిన చార్జర్‌తో మాత్రమే చార్జింగ్ పెట్టండి. మార్కెట్‌లో దొరికే చవక చార్జర్లు మీ స్మార్ట్‌ఫోన్‌ వేడెక్కేలా చేస్తాయి.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts