సమయం లేదు మిత్రమా ….! | Telugu News
గుడ్డు ఉడకాల్సిన సమయం ఎంత?-రేవంత్ కు పంచ్ ఇచ్చిన బాలయ్య-ఏపీలో రద్దు కానున్న ఎంసెట్-నోబెల్ తో రండి 100 కోట్లు పట్టుకెళ్ళండి: బాబు-ఉద్దానం బాధితులపై పూర్తిస్థాయిలో స్పందించిన ముఖ్యమంత్రి-మనకి ప్రాణభిక్ష పెట్టిన సైనికుడు బిచ్చమెత్తుకుంటున్నాడు-సంక్రాంతికి సాంప్రదాయం లోపిస్తోందా??-ఇలాంటి గవర్నర్ మనకు దొరకడం మన ఖర్మ-ఉద్దానం పాపం ఎవరిది?-మద్యం అమ్మకాలపై గళం విప్పిన హర్మన్ సింగ్ సిద్ధూ

సమయం లేదు మిత్రమా ….!

కొందరు స్వార్థపరులు తమ స్వార్థం కోసం ప్రకృతి మాతకు చేసిన గాయం పెద్దదవుతోంది. సమయం లేదు మిత్రమా ….! కాపాడుకుందామా….!! కాటికి పోదామా……!!!
రతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న అందమైన,అవసరమైన ప్రకృతిని తమ స్వార్థం కోసం,ఆదునికరణ పేరుతొ నాశనం చేసి కృత్రిమ అందాలు,ప్లాస్టిక్ పువ్వులు,జీవంలేని నవ్వులలో జీవిస్తూ యిదే జీవితం అని భ్రమలో వున్నారు.
నిజమైన ఆనందాలు ఏవో తెలీదా…?
మనం అనుభవించిన ఆనందాలని తరువాతి తరానికి ఇవ్వాల్సిన బాధ్యత మనమీద లేదా…?

అందమైన హరివిల్లులు,
అద్భుతమైన చిరుఝల్లులు,
మట్టివాసనల విందులు,
ముసిముసిగా నవ్వుతున్న కొలనులు,
నిశ్చలంగా ఉండలేక పరవళ్లు తొక్కే సెలయేళ్ళు,
చూరులోనుంచి కారే ఎర్రని వాననీళ్లు,
అరుగుక్రింద వణుకుతూ ముడుచుకున్న కోడిపెట్టలు
క్రమం తప్పని కొక్కోరోకోలు,
విరగబూసిన వెన్నెలరాత్రులు,
విరగకాసిన చుక్కల పందిళ్లు,
ఆరుబయట నిద్రలు అందరితో భోజనాలు,
పరవశంతో ఆకులు చేసే సవ్వడిలు,
పచ్చనిగుబురు మధ్య కోకిల కూనిరాగాలు,
రంగురంగుదుస్తుల సీతాకోకచిలుకలు,
బెరుకుచూపులతో గోపురంపైనుండి చూసే పావురాలు,
తేనెటీగల కాటు నుంచి తప్పించుకొని పిండుకొన్న తేనెతుట్టలు,
ముళ్ళచాటునుంచి రమ్మని పిలిచే ఎర్రటి రేగుపళ్ళు

నిన్న యిచ్చిన భరోసాతో నేడు జీవిస్తూ రేపటిగురించి ఆలోచన లేని నిస్వార్ధమైన జీవితాలు.

యివన్నీ నిన్నటి నిజాలు,రేపటి స్వప్నాలుగా చరిత్రలో కనుమరుగైపోకముందే,రేపటితరం ప్రశ్నించకముందే మేలుకుందాం.

రోజురోజుకూ పతనమవుతున్న మనిషిని చూసి అర్థం చేసుకుంటాడేమో అని అప్పుడప్పుడు భూకంపాలు, సునామి లతో హెచ్చరిస్తోంది ప్రకృతి.

స్వార్థంతో వున్న మనిషిని ఏమిచేయలేక భూమి తన సారాన్ని కోల్పోతోంది.స్వేచ్ఛగా గాలి,స్వచ్ఛమైన నీరు ఇవ్వలేకపోతోంది.

మబ్బులు మాయమయ్యాయి,ఉరుముల ఊసేలేదు.

ప్రకృతి పాడె ఎక్కడానికి సిద్ధంగా ఉంది.దానిని కాపాడే వైద్యులం మనమే.

నేను అన్న స్వార్థం నుంచి మనం అన్న నిస్వార్థంలోకి వచ్చినప్పుడే అది సాధ్యమవుతుంది.

యజ్ఞంలా భావించి మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుకోకపోతే,రేపటి మన పాడె కోసం ఈరోజే కట్టెలు దాచుకోవాల్సివస్తుంది.

సమయం లేదు మిత్రమా…..!

Related Posts

 • జపాన్ ప్రజల దేశభక్తి గురించి కొన్ని నగ్న సత్యాలు
 • ఇంటర్నేషనల్ టీ డే గురించిన కొన్ని గుక్కల కబుర్లు
 • నోబెల్ తో రండి 100 కోట్లు పట్టుకెళ్ళండి: బాబు
 • జాతీయ రైతు దినోత్సవం
 • భారత్ పంధాలో ఆస్ట్రేలియా పెద్ద నోటు రద్దు
 • మీ ఫోన్ బాగా వేడెక్కుతోందా అయితే ఇలా చెయ్యండి…
 • చేతుల్లేకపోయినా ప్రపంచానికి చేయూతనిస్తున్న రైతన్న
 • అంబులెన్సుకు దారేది??
 • ఈ రోజు ప్రత్యేకం ఏంటో తెలుసా?
 • త్వరలో ఏపీ పర్స్‌ తీసుకురాబోతున్న ఎపి సీఎం చంద్రబాబు
 • అందరికి అన్నంపెట్టే “అనాధ”
 • వీసా వెళ్ళగలిగే విదేశాలు
 • పక్క దేశాలు సైతం మోడీని ప్రశంశలతో ముంచెత్తుతున్నారు
 • నిరంతరం రగిలే నిప్పుకణిక.. ప్రపంచచరిత్రలో మీ పేజి ఎప్పటికి సజీవం
 • జయహో మోడీ.. ట్రంప్ ను వెనక్కినెట్టి టైమ్స్ ‘పర్సన్ …
 • విప్లవానికి మరో పేరే చెగువేరా…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts

 • జపాన్ ప్రజల దేశభక్తి గురించి కొన్ని నగ్న సత్యాలు
 • ఇంటర్నేషనల్ టీ డే గురించిన కొన్ని గుక్కల కబుర్లు
 • నోబెల్ తో రండి 100 కోట్లు పట్టుకెళ్ళండి: బాబు
 • జాతీయ రైతు దినోత్సవం
 • భారత్ పంధాలో ఆస్ట్రేలియా పెద్ద నోటు రద్దు
 • మీ ఫోన్ బాగా వేడెక్కుతోందా అయితే ఇలా చెయ్యండి…
 • చేతుల్లేకపోయినా ప్రపంచానికి చేయూతనిస్తున్న రైతన్న
 • అంబులెన్సుకు దారేది??
 • ఈ రోజు ప్రత్యేకం ఏంటో తెలుసా?
 • త్వరలో ఏపీ పర్స్‌ తీసుకురాబోతున్న ఎపి సీఎం చంద్రబాబు
 • అందరికి అన్నంపెట్టే “అనాధ”
 • వీసా వెళ్ళగలిగే విదేశాలు
 • పక్క దేశాలు సైతం మోడీని ప్రశంశలతో ముంచెత్తుతున్నారు
 • నిరంతరం రగిలే నిప్పుకణిక.. ప్రపంచచరిత్రలో మీ పేజి ఎప్పటికి సజీవం
 • జయహో మోడీ.. ట్రంప్ ను వెనక్కినెట్టి టైమ్స్ ‘పర్సన్ …
 • విప్లవానికి మరో పేరే చెగువేరా…..