జికా వైరస్ సోకకుండా ముందే జాగ్రత్త పడండి | Telugu News
గుడ్డు ఉడకాల్సిన సమయం ఎంత?-రేవంత్ కు పంచ్ ఇచ్చిన బాలయ్య-ఏపీలో రద్దు కానున్న ఎంసెట్-నోబెల్ తో రండి 100 కోట్లు పట్టుకెళ్ళండి: బాబు-ఉద్దానం బాధితులపై పూర్తిస్థాయిలో స్పందించిన ముఖ్యమంత్రి-మనకి ప్రాణభిక్ష పెట్టిన సైనికుడు బిచ్చమెత్తుకుంటున్నాడు-సంక్రాంతికి సాంప్రదాయం లోపిస్తోందా??-ఇలాంటి గవర్నర్ మనకు దొరకడం మన ఖర్మ-ఉద్దానం పాపం ఎవరిది?-మద్యం అమ్మకాలపై గళం విప్పిన హర్మన్ సింగ్ సిద్ధూ

జికా వైరస్ సోకకుండా ముందే జాగ్రత్త పడండి

డెంగీ,చికెన్ గున్యా ల కన్నా ఎక్కువ ప్రమాదాన్ని కలిగించే మహమ్మారి జికా వైరస్ నుండి జాగ్రత్త పడదాం..
మనదేశంలో మురికి కాలువలు అపరి శుభ్రత ఎక్కువగా ఉంటుంది. దానివలన దోమల వ్యాప్తి కూడాఎక్కువగా ఉంటుంది..
ఏడిస్ దోమ జికా వైరస్ ను శరవేగంగా వ్యాపింపచేస్తుంది… 

గర్భవతి అయిన తల్లులకు జికా సోకడం వల్ల పుట్టే శిశువులకు మెదుడు కుంచించుకుపోయి ఎదుగుదల తగ్గిపోతుంది..
ఇంకా ఎన్నో నష్టాలున్నాయి జికా వైరస్ వలన..
ఇప్పటినుండె జాగ్రత్తలు వహిద్దాం చెత్తచెదారం ఉంచకుండా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం..

ఏడాదిన్నర క్రితం ఒక్కసారి వెలుగులోకి వచ్చిన జికా వైరస్ ప్రపంచాన్ని వణికించింది…

ముఖ్యంగా బ్రెజిల్ దేశంలో ఎక్కువగా వ్యాపించింది..అమెరికా, సింగపూర్,ఆఫ్రీకా దేశాల్లో జికా వైరస్ కేసులు నమోదయ్యాయి..

ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజల్ని హెచ్చరిస్తుంది  జికా వ్యాప్తి చెందే అవకాశం ఉందని జాగ్రత్త గా ఉండమని చెబుతుంది..

ఇప్పటి వరకు భారతదేశంలో జికా కేసులు నమోదైనట్లు తెలియడం లేదు..కాని విదేశి పర్యాటకుల వల్ల కాని  వైరస్ దేశానికి చేరితే దాని వ్యాప్తి మనదేశంలో శరవేగంగా ఉంటుంది..
అందుకు తగిన జాగ్రత్తలు ఇప్పటినుండే వహిద్దాం.

కొందరైనా ఆలోచించాలని ఈ చిన్ని ప్రయత్నం…

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts