పశ్చిమగోదావరి జిల్లాలో పట్టసాచల క్షేత్రం..
పశ్చిమగోదావరి జిల్లాలో పట్టసాచల క్షేత్రం ఒక ప్రధానమైన క్షేత్రం. భద్రకాళీ సమేత వీరభద్రేశ్వరుడు ఈ అచలముపై వెలసిన ఆరాధ్య దేవతహరుడు. శ్రీభూసమేత భావన్నారాయణస్వామిగా వెలసి భక్తు లచే సేవింపబడుచున్నాడు. అఖండ గౌతమి అంతర్వాహినియైన భోగ వతి జలాలలో పవిత్రమైన స్నానమాచరించినవారి పాపములు పోగొ ట్టునని ఇతిహాసము. ఈ క్షేత్రమును మహాభక్తుడు ప్రహ్లాదుడు దర్శించి తరించినట్లు, శ్రీరా ముడు రావణ వధానంతరం అయోధ్య తిరుగు ప్రయాణంలో ఈ క్షేత్ర మును దర్శించినట్లు పురాణములలోఉన్నది. ముక్కోటి దేవతలు, అష్ట దిక్పాలకులు, త్రిమూర్తులు వీరభద్రేశ్వరుని అర్చించినట్లు తెలుస్తోంది. శివరాత్రి ఇక్కడ స్వామికి అర్చనలు అభిషేకాలు జరుగుతాయి. వేల కొలది భక్తులు ఉషోదయ పూర్వమే సుస్నాతులై స్వామికాభిషేకాది అర్చనలు సల్పి తరిస్తారు. శివరాత్రి సూర్యాస్తమయం నుండి మరు సటి సూర్యోదయం వరకు చతుర్వేద పారాయణ జరుగుతుంది. ఆ వేదఘోష ఈ క్షేత్రంలో ఆ రోజు ప్రత్యేకాకర్షణ, దానికి పండిత పామ రులేకాక, త్రిమూర్తులు, నారదుడు ప్రహ్లాదుడు మొదలగు మహా భక్తులు, సమస్త రుషిపుంగవులు, ముక్కోటి దేవతలు వచ్చేసి తిలకిస్తా రని ప్రతీతి. లింగోద్భవ కాలం అత్యంత వుత్తేజాన్ని కలిగిస్తుంది. హరిహరులకు నివాసమైన ఈ క్షేత్రమునకు శైవులు, వైష్టవులు, శాక్తే యులు అందరూ దర్శిస్తారు.
దేవకూట పర్వతం పాపికొండలలో భాగంగా అఖండ గౌతమీ గర్భంలో పోలవరం, కొవ్వూరు మధ్య ఉన్న ది. కైలాస పర్వతరాజు ఒకానొక కాలములో దేశంలోనున్న పర్వత ముల సమావేశము యేర్పాటు చేయగా దేవకూటుడు కూడా హాజర య్యెను. అక్కడ కైలాస పర్వతము శ్రీదేవకూటునికి ఉచిత స్థానమి వ్వక అవమానించెను. అందులకు కుపితుడై దేవకూటుడు స్వస్థాన మున చేరి అవమానం భరించలేక ప్రాణత్యాగముచేయ సంకల్పించగా నారదుడేతెంచి ఆ ప్రయత్నమును విరింపజేసి కైలాసునకు తన శిఖరముపై ఈశ్వరుడు నివాసమున్నందున గర్వమున్న దని, అందుచే నిన్నవమానించెనని, నీవు కూడా పర్వ మేశ్వరుని అనుగ్రహం పొంది నీపై నివసించునట్లు చేసు కొమ్మని సలహా ఇచ్చెను. అంత దేవకూటుడు పరమేశ్వ రుని గూర్చి ఘోర తపస్సు చేసి, పరమేశ్వరుని దర్శన ము పొంది తన కోరిక తెల్పగా భవిష్యత్తులో అట్లే జరుగు గలదని వరమొసంగెను. దక్షప్రజాపతి ఒక బృహత్ యజ్ఞము చేయతలపెట్టి సమస్త దేవతలను ఆహ్వానించెను. కాని తన అల్లుడైన పరమేశ్వరునాహ్వానించలేదు. సతీదేవి ఆ యజ్ఞమునకు వెళ్లుటకు ఇచ్చగించగా పిలవని పేరంటము వలదని సల హా ఇచ్చిననూ ఆమె తన కోర్కె వీడనందున ప్రమాద గణ ములను సహాయమిచ్చి సతీదేవిని పంపెను. కూతురును చూచినతండ్రి క్రోధించి దూషించి అవమానిం చెను.
ఆ అవమానము భరించలేని సతీదేవి యోగాగ్ని రగి ల్చి ప్రాణత్యాగము చేసినది. ప్రమ ద గణముల ద్వారా వార్త విన్న పర మేశ్వరుడు క్రోదముతో మూడవ కన్ను తెరచి అందుండి మహాశక్తి నుద్భవింపచేసి పట్టసమును ఆయు ధమునిచ్చి దక్షుని సంహరించి, యజనాశము చేయమని శాశించి, తన హంశలను ఆ శక్తికిచ్చి వీర భద్రేశ్వరునిగా నామకరణము చేసి, పని పూర్తి చేసుకురమ్మని దీవించి పంపెను. విశ్రాంతి తీసుకొననెంచి, దేవకూట పర్వతముగని అందుపైకెగిరి అక్కడ శరీరమును ఆయుధమును శుభ్రము చేయనెంచి జలము కొరకు ప్రయత్నించి విఫలుడై ఆయుధముచే భూమిపై కొట్టి పాతాళగంగను రప్పించి తన కార్యము నిర్వర్తించెను. అదే భోగవతి జలకుండము. అక్కడ కొంత విశ్రాంతి అనంతరం కైలాసమునకు ప్రయాణమగు చుండగా అగస్త్య మహర్షి యేతెంచి ఈశ్వరుని వరము వివరించి ఆ అచలముపై నివశించవేడగా వీరభద్రుడంగీకరించి లింగాకారమునొంది అక్కడ నివశించెను. సతీదేవి యడబాటు సహించనివాడై ఈశ్వరుడు యజ్ఞవాటికకు జని సతి మృత శరీరమును భుజముపై నిడుకొని, వున్మత్తుడై ప్రళయ తాండవము చేయుచుండగా లోకాలు భయకంపితమై శ్రీమహావిష్ణు వును వేడుకొనెను. శ్రీహరి గమనించి మృతదేహమున్నంత కాలము హరుని సమీపించుట దుర్లభముగా గ్రహించి దానిని దూరము నుండి బాణములతో ఖండ ఖండములుగా నరికెను. ఆ ఖండములు దేశమెల్ల డలా పడగా ఒక ఖండము దేవకూట శిఖరముపై పడి, భద్రకాళిగా అవతరించి వీరభద్రేశ్వరుని సన్నిధి చేరినది. దేవకూట పర్వతముపై పట్టుసమను ఆయుధమును శుభ్రము చేసి నందున పట్టసాచలమని ప్రసిద్ధి చెంది కాలక్రమంలో పట్టిసీమగా పిలువబడుచున్నది.
భల్లూకరాజు, జాంబవంతుడు ఇహలోక సుఖములకు రోసి శ్రీమహా విష్ణువును గూర్చి తపమాచరించి, దర్శనమైనంత తన కెల్లవేళలా శ్రీహరి పాదాల వద్ద ఉండునట్లు వరముకోరి పొందెను. కరిమ కరులకు మోక్షము కలుగచేసిన శ్రీ మహావిష్ణువు, దేవకూటము జాంబవంతుల కిచ్చిన వరకు ప్రకారం శ్రీభూసమేత భావన్నారా యణునిగా అందువెలసెను. భల్లూకరాజు ఆ దేవదేవుని పాదాల వద్ద నేటికి దర్శనమిస్తాడు. శివకేశవు లిరువురు దేవకూట శిఖరముపై వెలసి పవిత్రతను చేకూర్చారు.
Leave a Reply