మళ్ళీ పీఎం మోడీయేనా?? | Telugu News

మళ్ళీ పీఎం మోడీయేనా??

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం పెద్ద నోట్లను రద్దు చేసి ప్రపంచం మొత్తం హాట్ టాపిగ్గా మారాడు. భారత్ ను నల్ల దనం రహిత దేశంగా మార్చాలనే ఉద్దేశంతో, ఎంతో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని, పక్కా ప్లాన్ ప్రకారం నోట్ల రద్దును ప్రకటించారు. దీనిపై అటు సామాన్య ప్రజలు సైతం కష్టాలను ఎదుర్కుంటూ..మోదీని జేజేలు పలుకుతున్నారు. కానీ ఆయన చెప్పిన గడువు తరువాత కూడా పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం వ్యతిరేకత తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.భావితరాల భవిష్యత్తు కోసం పాటు పడుతున్న మోదీకి అటు ప్రతిపక్షాల నంచి వ్యతిరేకత వస్తున్న విషయం తెలిసిందే.

 ఇప్పటికే వాళ్ళంతా కూడా ఇంట్లో ఎలుక ఉందని, ఇల్లు తగులబెట్టడం ఎంత వరకు కరెక్ట్ అని కూడా మోదీని ప్రశ్నిస్తున్నారు. ఎవరో బ్లాక్ బాబుల కోసం కొన్ని కోట్ల ప్రజలను ఇలా ఇబ్బందికి గురి చెయ్యడం సరి కాదని హితవుపలుకుతున్నారు. ఇక ఇలా రిస్క్ చెయ్యడం మోడీకి ఇదేమీ కొత్తేం కాదు. గతంలో ఆయన గుజరాత్ కు ముఖ్యమంత్రిగా పని చేసే సమయంలో అప్పుడు కూడా విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
అందులో భాగంగా కరెంట్ ఛార్జీలు పెంచారు. దీంతో విద్యత్ చౌర్యానికి పాల్పడిన రైతులను పోలీసులు అప్పట్లో అరెస్ట్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున రైతులంతా మోదీని కలసి ఇలా విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల వచ్చే ఎన్నికల్లోభారీ నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు. వారి వాదలనలను మోదీ ఘాటుగానే తిప్పికొట్టారు. అవసరమైతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తాను కానీ, ఈ విద్యుత్ సంస్కరణలపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.

అన్నట్టుగానే ఎవరూ ఊహించిన విధంగా తర్వాత ఎన్నికల్లో మోదీ విజయాన్ని సాధించారు. ఇదంతా ఆయన నిర్ణయం మీద తనకున్న నమ్మకం, శక్తి సామర్ధ్యాలు చూసి సీనియర్ రాజకీయ నాయకులు కూడా నోటిమీద వేలేసుకున్నారు. ఇక మోదీ తీసుకునే కఠినమైన నిర్ణయాలపై ఎలాంటి సమస్యలు వచ్చిన పరిష్కరించగల దమ్ము, ధైర్యం మోడీకి కావలసినంత ఉందనే చెప్పాలి. ఇక అటు సొంత పార్టీలా నుంచి వ్యతిరేకత వస్తున్నా, ప్రతిపక్షాలు కాదన్నా, చివరకి తను అనుకున్న పని సాధించి తీరుతారు మోదీ.అలా దేశంలోని చాలా మంది యువతకు మోదీ ఆదర్శంగా నిలిచారు. తను ఏది చేసినా దేశం కోసం మాత్రమే చేస్తారని చాలా గట్టిగా నమ్ముతున్న దేశ ప్రజలు, ఇప్పుడు నోట్ల రద్దు కూడా అందులో భాగమేనని, వచ్చే ఎన్నికల్లో కూడా నమోకి భారీ మెజార్టీ వస్తుందనడంలో డౌట్ లేదంటున్నారు రాజకీయ పెద్దలు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts