నుజ్‌హత్ పర్వీన్ కల నిజమాయెగా.. | Telugu News
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి కేంద్ర ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది.-కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు స్వర్ణాలతో అదరగొట్టారు.-ఇంటర్ నెట్ లో వైరల్ గా మారిన హైదరాబాద్ క్రీడాకారిణి పివి సింధు ఫోటోషూట్..!!-ఇరు రాష్ట్రాల్లో షాక్..ఏపీ లో కంటే ముందుగా తెలంగాణాలో మొదలెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్!-వికారాబాద్ లో తోపుడు బండిపై భార్య మృతు దేహంతో 60 కి.మీ నడక…!!-ఇప్పుడు రానానే సోలో హీరో అని వార్తలు వస్తున్నాయి.-హీరో శర్వానంద్ సినిమా కి సరికొత్త ప్లాన్ వేస్తున్న దిల్ రాజు కు ఈ సినిమా సెంటిమెంట్ గా మారింది.-ప్రధాన పుణ్యక్షేత్రాల్లో చిరంజీవి కోసం పూజలు చేస్తున్న మెగా అభిమానాలు !-చిరు కోసం క్లైమాక్స్ ఫైట్‌ను డిఫరెంట్‌గా ఉండేలా కనల్ కణ్ణన్‌తో డిజైన్ చేయించారు.-ఇద్దరూ కథానాయికులతో త్రివిక్రమ్,పవన్ కళ్యాణ్ ల కొత్త సినిమా లాంచింగ్ !

నుజ్‌హత్ పర్వీన్ కల నిజమాయెగా..

సింగ్రౌలి(మధ్యప్రదేశ్): ఐదేండ్ల ముందువరకు తను అనుకోలేదు క్రికెటర్‌గా మారగలనని.. అనుకోకుండా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. ఇప్పుడు 20 ఏండ్ల వయసులో భారత మహిళల టీ20 జట్టులో చోటు దక్కించుకొని తన కల నిజం చేసుకుంది. ఆ అమ్మాయే నుజ్‌హత్ పర్వీన్. అందరికీ కుష్బూగా తెలిసిన నుజ్‌హత్ పట్టుదలకు మారుపేరుగా నిలిచింది. ఈనెల 18నుంచి వెస్టిండీస్‌తో జరుగబోయే రెండుమ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడే భారత జట్టుకు నుజ్‌హత్ ఎంపికైంది. అంతేకాదు ఈనెల 27 నుంచి జరుగనున్న ఆసియాకప్‌లో జాతీయ మహిళా జట్టులోనూ వికెట్‌కీపర్‌గా ఎంపికైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా డివిజన్ నుంచి ఓ మహిళా క్రికెటర్ దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఇదే మొదటిసారి.

కెరీర్‌ను సీరియస్‌గా తీసుకుని శ్రమించడంతోనే ఈ స్థాయికి చేరుకున్నట్లు నుజ్‌హత్ చెప్పింది. ఐదేండ్ల ముందు నేను క్రికెటర్ కావాలని అసలు ఆలోచించలేదు. అనుకోకుండా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాను. డివిజనల్ క్రికెట్ అసోసియేషన్ (డీసీఏ) స్ఫూర్తితో దేశానికి ప్రాతినిథ్యం వహించేలా ఎదిగాను అని నుజ్‌హత్ మీడియాకు వివరించింది. సోదరులు విదేశాల్లో ఉంటుండగా నుజ్‌హత్ తండ్రి నార్తర్న్ కోల్‌ఫీల్డ్ లిమిడెట్‌లో ఉద్యోగి. డీసీఏ అండర్-19 జట్టులో విశేషంగా రాణించడంతోపాటు మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ టీ20 టోర్నీలోను ఆకట్టుకోవడంతో నుజ్‌హత్ భారత జట్టులో చోటు దక్కించుకుంది. నుజ్‌హత్ ప్రస్తుతం భారతీయ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *