నల్లకుబేరుల మెడకు పూర్తిగా ఉచ్చు బిగించిన కేంద్ర ప్రభుత్వం | Telugu News

నల్లకుబేరుల మెడకు పూర్తిగా ఉచ్చు బిగించిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.  నల్లకుబేరులను పూర్తిగా బిగిస్తోంది. స్వచ్ఛంద నగదు వెల్లడికి తాజాగా మరో అవకాశం ఇచ్చింది. నల్లధనాన్ని స్వచ్చంధంగా బయటపడితే అందులో 50 శాతం జరిమానాతో పాటు 25 శాతాన్ని నాలుగేళ్ల వడ్డీలేని డిపాజిట్లు చేయించి, 25 శాతం మాత్రమే వెంటనే చేతికి ఇచ్చే కొత్త పథకానికి సంబంధించిన చట్టాన్నికేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్టీ ప్రవేశపెట్టారు. నగదు డిపాజిట్లను మాత్రమే కొత్త పథకం కింద వెల్లడించాల్సి ఉండగా బంగారం, నగలు, విలువైన వస్తువులను కూడా అక్రమార్కులు స్వచ్చంధంగా సెక్షన్ 115 బీబీఇ కింద వెల్లడించి, 75 శాతం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సవరణలను కూడా జైట్లీ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి చట్టసవరణలో స్పష్టంగా పేర్కొన్నారు. సెక్షన్ 115 బీబీఈలో సవరణలు తీసుకురావడానికి కూడా ప్రత్యేక కారణాలు ఉన్నాయి. 50 శాతం జరిమానాకు సంబంధించిన కొత్త చట్టం బారి నుంచి తప్పించుకునే వీలు లేకుండా అన్ని మార్గాలను మూసేశారు. అందుకే ఐటీ చట్టంలోని సెక్షన్ 115 బీబీఇలో ఉన్న లోసుగులను కూడా సవరించారు. ఈ సెక్షన్ కింద ఇప్పటివరకు ఆదాయం ప్రకటించే వారికి కేంద్రం కేవలం 30 శాతం పన్ను నామమాత్రపు సర్ చార్జీ సెస్ ఉంది. అదీ నేర తీవ్రతను బట్టి మాత్రమే ఈ పన్ను గరిష్టంగా విధించేవారు. నల్లకుబేరులకు ఈ అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు సెక్షన్ 115 బీబీఇను జైట్టీ సవరించారు. ఇందులో సెక్షన్ 69ఏ, 69బి ప్రకారం బంగారం, నగలు, నగదు, ఇతర విలువైన వస్తువులు, ఖాతా పుస్తకాల్లో నమోదు చేయనవి అన్నీ బయటపెట్టాల్సి ఉంటుంది. ఈ కొత్త చట్టం ప్రభావం సామాన్యుల మీద పడదు. నల్లకుబేరులకు మాత్రమే ఇది ఒక అస్త్రంగా పని చేస్తుంది. ఈ కొత్త చట్టంతో నల్లకుబేరులను నాలుగు వైపుల నుంచి ఉచ్చు బిగించారనే చెప్పవచ్చు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts