సూపర్ స్టార్ రోబో2లో నలుగురు స్టార్ హీరోలు ఉన్నారా?? | Telugu News

సూపర్ స్టార్ రోబో2లో నలుగురు స్టార్ హీరోలు ఉన్నారా??

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళ డైరక్టర్ శంకర్ కాంబినేషన్ అనగానే దానిపై అంచనాలు భారీగా ఉంటాయి. ఎందుకంటే వీరిద్దరి కలయికలో వచ్చిన శివాజీ, రోబో చిత్రాలు అపూర్వ ఘన విజయాన్ని సాధించాయి. అందుకే ఇప్పుడు శంకర్ డైరక్షన్లో రజనీకాంత్ నటిస్తున్న రోబో 2.0 చిత్రం పై అందరి చూపు ఉంది. రోబోని రజనీ ఒంటి చేత్తో నడిపిస్తే 2.0 లో మాత్రం మరో ముగ్గురు స్టార్ హీరోలు కనిపించనున్నారు. వారిలో ఎక్కువ సేపు చిత్రంలో విలనిజంతో ఆకట్టుకోనున్న హీరో అక్షయ్ కుమార్. బాలీవుడ్ యాక్షన్ హీరో అయినప్పటికీ ఇందులో విలన్ గా నటించడానికి ఆసక్తి కనబరిచారు.

మరో రెండు కీలక పాత్రల్లో విశ్వనటుడు కమలహాసన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలరించనున్నారు. వీరిద్దరి పాత్రలను దర్శకుడు శంకర్ ఎంతో సీక్రెట్ గా ఉంచారు. ఇప్పటికే కమల్ సీన్లు పూర్తి చేసినట్లు తమిళ సినీ వర్గాలు వెల్లడించాయి. తారక్ సీన్లను త్వరలోనే తెరకెక్కించున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎన్టీఆర్ చెన్నై కి వెళ్లనున్నట్లు తెలిసింది. క్లైమాక్స్ లో వచ్చే యంగ్ టైగర్ పాత్ర సినిమాకు మరింత హైప్ తీసుకువస్తుందని టాక్. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలను మిక్స్ చేసి శంకర్ రోబో 2.0 కు పెద్ద మల్టీ స్టారర్ మూవీ హోదా తీసుకొచ్చారు. దీంతో సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియాలోనూ ఈ చిత్రంపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.
ఈ వార్త ప్రకారం హేమాహేమీలంతా ఒకే చోట చేరి సందడి చేయనున్నారని తెలిసింది నిజంగా ఈ నలుగురు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అంత కంటే గొప్ప సంతోషం ఇంకేం ఉంటుంది?

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts