ఇండియాలో మినీ స్విట్జర్లాండ్‌… | Telugu News

ఇండియాలో మినీ స్విట్జర్లాండ్‌…

హిమాచల్‌ప్రదేశ్‌లో వాయువ్య భాగాన అందమైన పచ్చికమైదానం ఖజ్జర్‌. చుట్టూ హిమాలయాలు, ఎత్తైన చెట్లపై కురిసే మంచు, గల గలపారే చిన్న చిన్న సెలయేర్లు ప్రశాంత వాతావరణం వలన ఈ ప్రాం తాన్ని స్విట్జర్లాండ్‌ ఆఫ్‌ ఇండియాగా పిలుస్తారు. ఇది డల్‌హౌసి, చంబలోయ మధ్యన ఉంది. సముద్ర మట్టానికి 1951 మీటర్ల ఎత్తున ఉన్న ఈప్రాంతం ప్రకృతి రమణీయతతో కాలుష్య రహితంగా ప్రశాం త వర్ణచిత్రంలా కనిపిస్తుంది. ఇక్కడ ఎప్పుడూ చల్లగానే ఉంటుంది. బ్రిటీష్‌కాలంలో ఈ ప్రాంతం వేసవి విడిదిగా ఉండేది. హిమాలయ పర్వత సానువ్ఞల పాదభాగంలో ఉన్న ఈప్రాంతంలోకి చిన్న సెల యేర్లు పాయలుగా ప్రవహించి పచ్చిక మైదానాన్ని మరింత హరితంగా మారుస్తాయి.

చంబలోయ
6వ శతాబ్దంలో స్థానిక రాజపుత్రరాజులు దీనిని రాజధానిగా చేసు కుని పరిపాలించారు. మధ్యకాలంలోమొగల్‌రాజులు, తరువాత సిక్కు రాజులు పాలించారు. అటుపై బ్రిటీష్‌వారు దీనిని స్వాధీనం చేసు కున్నారు. 1948, ఏప్రిల్‌ 15న ఇది హిమాచల్‌ప్రదేశ్‌ లో విలీనమైం ది. రాజావర్మన్‌ కుమార్తె చంపావతి పేరున చంబా పేరు వచ్చింది. హిమపర్వత పంక్తుల మధ్య ఉన్న ఈలోయలోని ఎన్నో పురాతన ఆల యాలు అద్భుత శిల్పకళా నైపుణ్యంతో అలరారుతున్నాయి. ఖజ్జర్ కు ఈలోయ 24కి.మీ. దూరంలో ఉంది. ఇది పవిత్ర యాత్రాస్థలం. స్థానిక ప్రజలు తరచూ ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తారు.

డల్‌హౌసి
ఖజ్జర్‌కు 22కి.మీ.దూరంలో డల్‌హౌసి హిల్‌స్టేషన్‌ ఉంది. హిమాలయ పర్వత పంక్తుల క్రిందిభాగంలో పడమర సరిహద్దు ప్రాంతంలో ఉంది. బ్రిటీష్‌వారు దీనిని వేసవి విడిదిగా ఏర్పాటు చేసుకున్నారు. ఢిల్లీకి 563 కి.మీ. దూరంలోని ఈ హిల్‌స్టేషన్‌ సువిశాల ప్రదేశంలో పురాతన ఆలయాల నడుమ సుందరంగా ఉంటుంది.
ఖజ్జర్‌ సరస్సు
ప్రపంచంలో ఇంత అందమైన సమ్మోహక ప్రదేశం ఉండ దేమో అనిపిస్తుంది ఈ సరస్సు ప్రాంతాన్ని చూస్తే. పచ్చని పచ్చిక, నీలాకాశపు రంగు సరస్సులోకి ప్రతిఫలిస్తూ ఎత్తైన హిమ శిఖరాల నడుమ ఇది స్వప్నజగత్తులా అనిపి స్తుంది. ఇక్కడ ఉన్న ఖజ్జీనాగ్‌ ఆలయం వలన ఈ ప్రాంతానికి ఖజ్జర్‌ అనే పేరు ఏర్పడింది. ఇక్కడి అమ్మవా రు, గ్రామదేవతను 12వ శతాబ్దం నుండి ఆల యంలో పూజిస్తున్నారు. బంగారు ఆలయ శిఖ రంతో ఉండే ఈ అమ్మవారి ఆలయాన్ని బంగా రుదేవి ఆలయం అని కూడా పిలుస్తారు. నాగదేవతగా పూజలందుకునే ఈ ఆలయానికి చంబలోయ వాసులు వస్తుంటారు. చిన్న చిన్న చెక్క వంతెనలపై మంచు కురిసి మెరుస్తూ, స్వచ్ఛమైన ధవళవర్ణపు హిమనీ నదులు చిన్న చిన్న సెలయేరులుగా ప్రవహిస్తూ ఎత్తైన పైన్‌ చెట్లు కలిగి సూర్య కాంతికి మెరిసే ఈ ప్రదేశం కడిగిన ముత్యం లా భాసిస్తుంది. మేకలు, గొర్రెలు ఈ పచ్చికలోని గడ్డిని మేస్తూ కనిపిస్తాయి. శబ్దరహితంగా ప్రశాంతంగా ఉండే ఈ ప్రాం తం సాహసికులకు ఆనందాన్ని కలిగిస్తుంది. చలి ఎక్కువగా ఉన్నా ఈ ప్రాంతం రమణీయత వలన సందర్శకులు ఈ ఖజ్జర్‌ మైదానానికి వస్తారు. గోల్ఫ్‌ ఆటకు ఇక్కడ అనువైన ప్రాంతం ఉంది. ఖజ్జినాగ్‌ ఆలయంలో ఐదుగురు పాండవుల ఎత్తైన చెక్క విగ్రహాలను మనం చూడవచ్చు.

గాంధీచౌక్‌ నుండి తూర్పువైపుగా రోడ్డుపై డల్‌హౌసి నుండి 30 కి.మీ. దూరంలో ఖజ్జర్‌ వన్యప్రాణి అభయారణ్యం ఉంది. ఖజ్జర్‌ మైదాన ప్రాంతాన్ని గుర్రపు స్వారీచేస్తూ చుట్టిరావచ్చు. శిక్షణ పొందిన గుర్రాలపై మైదానం అంతా తిరిగిరావచ్చు. ఇక్కడ స్థానికులు చాలా సౌమ్యులు, ఆప్యాయతతో ఆతిథ్యాన్ని అందిస్తారు. స్థానిక దుస్తులుధరించి మనంఫోటోలను తీయించు కోవచ్చు. దాదాపు 5 కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ పర్యాటక ప్రదేశానికి ఎక్కి వెళ్ళాలంటే కాలాటోప్‌ నుండి బయలుదేరాలి. ట్రెక్కింగ్‌ చేసేవారికి అనువైనది. మార్చి-జూన్‌ మధ్య ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.

ఎలా చేరాలి
కాంగ్రాలోని గగ్గల్‌ ఇక్కడకు 180 కి.మీ. దూరంలోని విమానా శ్రయం. పఠాన్‌కోట్‌ రైలు మార్గం ఇక్కడకు 120 కి.మీ. దూరంలో ఉంది. చంబలోయలోని వివిధ ప్రాంతాలనుండి ఖజ్జర్‌కు బస్సులున్నాయి. చంబ, డల్‌హౌసిల నుండి గంటన్నర సమయంలో ఖజ్జర్‌ను చేర వచ్చు. ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి. జూలై- సెప్టెంబర్‌ నెలల్లో ఖజ్జర్‌ హిల్‌రిసార్ట్‌ ప్రాంతంలో నైరుతీ రుతుపవ నాల ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తుంటాయి. పర్యటనలో విభి న్నతను కోరే వారికి ఖజ్జర్‌ చూడదగిన సందర్శన ప్రదేశం.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts