తారక్ బాటలోనే రాంచరణ్ కూడా నడుస్తున్నాడా.. | Telugu News

తారక్ బాటలోనే రాంచరణ్ కూడా నడుస్తున్నాడా..

ఒక స్టార్ హీరో సినిమా రీలీజ్ అవుతుందంటే చాలు అభిమానుల హంగామా అంతా ఇంతా ఉండదు. రిలీజ్ కి ముందు అర్ధరాత్రి నుండే ప్రీమియ‌ర్లు, ఫ్యాన్స్ షోలు అంటూ హ‌డావుడి మొద‌లై పోతుంది. వాళ్ళకున్న అభిమాన గళం స్టామినా చూపించుకోవ‌డానికి స్టార్ హీరోలు కూడా ఇలాంటి స్పెష‌ల్ షోల‌పై ఎక్కువ మ‌క్కువ చూపిస్తుంటారు. ఈ రోజుల్లో అయితే దాదాపుగా అందరు అగ్ర హీరోల సినిమాలు అన్నిటికీ ఫ్యాన్స్ షోలు,ప్రీమియ‌ర్లు త‌ప్ప‌నిస‌రి అయిపోయాయి.
అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ధ్రువ సినిమా డిసెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు వస్తుందని అందరికీ తెలిసిందే. మిగతా హీరోల సినిమాలకి లాగే రామ్‌చ‌ర‌ణ్ కొత్త సినిమా ధృవ‌కీ కూడా ప్రీమియర్లు, ఫ్యాన్స్ షోలు ఉంటాయ‌నుకొన్నారు మెగా ఫ్యాన్స్‌. అయితే అభిమానులు అందరికీ చ‌ర‌ణ్ గట్టిగా షాక్ ఇచ్చాడు. ధృవ సినిమాకి అందరు అనుకుంటున్నట్టుగా ఫ్యాన్స్ షోలు లేవంట. సగటు ప్రేక్షకుడి లాగే అభిమానులు కూడా నేరుగా ఉద‌యం ఆటే చూడాలంట.
ఇంతకీ ఫ్యాన్స్ షోలు వ‌ద్ద‌న్న‌ది ఎవరో తెలుసా?? ఆ వ్యక్తి ఎవరో కాదు ధ్రువ కథా నాయకుడే. అవును మీరు వింటున్నది నిజమే. ఫాన్స్ షోల రద్దు రామ్ చ‌ర‌ణ్ తీసుకొన్న తాజా నిర్ణ‌య‌మ‌ని సినీ వర్గాలు చెప్తున్నాయి. అసలు రాంచరణ్ ఎందుకు ఫాన్స్ షోలు వద్దన్నాడో చూద్దాం. అన్ని సినిమాలకి మాదిరి గానే బ్రూస్లీ సినిమా విడుద‌ల‌ అయ్యే ముందు రోజు కూడా ఫాన్స్ కోసం స్పెష‌ల్ షో వేశారు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యే స‌రికి ఆ సినిమాపై బ్యాడ్ టాక్ విప‌రీతంగా స్ప్రెడ్ అయిపోయింది. ఇలాంటి షోల వచ్చిన టాక్ కచ్చితంగా టోటల్ సినిమా రిజల్ట్ పై ఎఫెక్ట్ చూపిస్తుంది. బ్రూస్లీ బ్యాడ్ టాక్ ప్ర‌భావం ఉద‌యం ఆట‌ల‌పై కాస్త గట్టిగానే చూపించింది. దాంతో భారీగా కలెక్షన్లు రాబట్టాల్సిన సినిమాకి వ‌సూళ్లు బాగా త‌గ్గాయి. ఈసారి అలాంటి పొర‌పాటు మాత్రం జరగకుండా చూడాలని చ‌ర‌ణ్ భావిస్తున్నాడ‌ట‌. అర్థ‌రాత్రి షోలు వెయ్యడం ఆపేసి, ఫ్యాన్స్ కోసం ఉద‌యం ఆరు గంటలకి షోలు ఏర్పాటు చేయ‌మ‌ని రామ్ చ‌ర‌ణ్ సూచించాడ‌ట‌. ఈమ‌ధ్య మన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాంటి నిర్ణ‌య‌మే తీసుకొన్నాడని అందరం విన్నాం. ‘జ‌న‌తా గ్యారేజ్’ సినిమా బాగున్నా అభిమానులకి నచ్చినట్టు లేకపోయే సరికి అర్థ రాత్రి వేసిన ప్రీమియర్ షోల త‌ర‌వాత‌ అభిమానుల వల్లే నెగిటీవ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. సినిమా ప్రేక్షకులందరిని మెప్పించినా ముందు రోజు మాత్రం డివైడ్ టాక్ వ‌చ్చింది. ఆ ఎఫెక్ట్‌ వల్లే కొన్ని రివ్యూలు నెగిటివ్ గా వ‌చ్చాయి. తను ఎంతగానో నమ్మిన సినిమాకి కూడా ఇలా డివైడ్ టాక్ రావడంతో ఇక మీద‌ట ప్రీమియర్ షోలు వేయ‌కూడ‌ద‌ని తారక్ గ‌ట్టిగా డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు మెగా హీరో చ‌ర‌ణ్ కూడా ఎన్టీఆర్ బాట‌లోనే న‌డుస్తున్నాడ‌ని సినీ జనం నోట మాట. ధృవ సినిమా చూడాలని ఎంత గానో ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ కూడా అంద‌రిలా డిసెంబ‌రు 9 వ‌ర‌కూ వేచి చూడాల్సిందే అన్నమాట.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts