అనంతపురం తరలి రానున్న జనసేన పవనం | Telugu News
కృష్ణాబోర్డు, జూరాలపైనా సంయుక్త పర్యవేక్షణ-మరో రెండు రోజుల తరువాత లోధా కమిటీతో భేటీ..-వీరి వీరి గుమ్మడిపండు.. దాగుడుమూతల దండాకోర్.. వీరి పేరు ఏంటో? చెప్పుకోండి చూద్దాం.-రిలియన్స్ జియో లైఫ్ ఫోన్ పేలి ఆ కంపనీకి పెద్ద సవాలునే విసిరింది.-కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కాకుండా ఆయన అల్లుడు హరీష్ రావు సీఎం అవుతారేమో అన్న భయంతోనే ఆయన ఈ నిర్ణయం-‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’ ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌వంబ‌ర్ 18న విడుద‌ల‌:హీరో నిఖిల్-ఎనర్జిటి స్టార్ రామ్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చినాడు.-జీవా హీరోగా గ్లామరస్‌ బ్యూటీ హన్సిక మోత్వాని హీరోయిన్‌గా నవంబర్‌ 12న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతున్న ‘పోకిరిరాజా’-‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ చిత్రం కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ !-ఇండియా, అమెరికా, చైనా, రష్యా నటులతో ‘న్యూక్లియర్’ రూ. 340 కోట్ల భారీ బడ్జెట్ తో రామ్ గోపాల్ వర్మ!

అనంతపురం తరలి రానున్న జనసేన పవనం

అన్నయ్య లాగా పార్టీ పెట్టి జనం అనే పదాన్ని మరిచి విలువల్ని పక్కన పెట్టి పార్టీని పక్క గూటికి మళ్లించకుండా తనదైన శైలి లో ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసమే పార్టీ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పవనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

పవన్ కళ్యాణ్ అనే పేరు విన్నా జనసేన అనే పదం విన్నా ఆవేశంతో కథం తొక్కుతారు పవర్ స్టార్ అభిమానులు. ఆయన మాటే శాశనం వారికి. ఆయన మద్దతు ఇచ్చారని టీడీపీ కి ఓట్లు కూడా వేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు. మద్దతు ఇవ్వడం అంటే రాజ్యం మొత్తం చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టడం కాదని పవన్ కు తెలుసు. అందుకే విషయం జరిగినా విపత్తు వచ్చినా స్పందిస్తూనే ఉంటాడు. ప్రజల పక్షాన తాను ఉన్నాడని గుర్తు చేస్తూనే ఉంటాడు.

ఆయన సిద్ధాంతాలు ఎలా ఉన్నా విమర్శకులు ఎదో ఒక రకంగా విమర్శిస్తునే ఉన్నారు. దొంగలు పడ్డ ఆరు నెలలకి పోలీస్ లు వచ్చినట్టు ఏదైనా నష్టం జరిగినప్పుడు సంఘటన జరిగిన తరువాత ఆరు నెలలకో సంవత్సరానికో స్పందిస్తున్నాడని విమర్శలు పవన్ ని మేల్కొపాయి. ఎప్పుడూ కాస్త లేటుగా ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పంధా మార్చుకున్నాడు. ముందు గానే ఒక హేతు బద్దమైన ప్రణాళికను రూపొందించాడు. తన అభిమాని వినోద్ రాయల్ చనిపోయినప్పుడు పరామర్శించడానికి తిరుపతి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చెయ్యడానికి తాను సైతం ఉన్నానని తెలియజేస్తూ ఆగష్టు 27 తిరుమల శ్రీనివాసుడి సాక్షిగా ఒక సభ నిర్వహించి తన ముందు ప్రణాళికను ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం తన పోరాటం ఆపేది లేదని నాడే చెప్పిన పవన్ మొదటి సభను కాకినాడ లో సెప్టెంబర్ 9 నిర్వహించారు. సర్దార్ ఎఫెక్ట్ తో అభిమానులు ఎర్ర కండువాలు మెడలో ధరించి మరీ తమ నాయకుడికి అండగా ఉంటామని తిరుపతికి తరలి వెళ్ళారు.  ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తీరును వేలెత్తి చూపి రెండు పాచి పోయిన లడ్డులు ఇచ్చారని మోడీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తూ సీమాంధ్ర ఎంపీ లు చేతులు కట్టుకుని కుర్చున్నారా అని ప్రశ్నించాడు పవన్. ఆయన ఆచరణ ఎలా ఉన్న ఆవేశం మాత్రం నిజమే. అభిమానులకే కాదు మాటలు జన సందోహానికి కూడా ఆవేశాన్ని తెప్పించాయి.  రాజకీయ వర్గాల నేతలకి గుండెల్లో సూటిగా గుచ్చుకున్నాయి.

ఆయన ఆవేశంలో ఉన్న వేడి తన మాటల తూటాల దాడి కేంద్ర ప్రభుత్వానికి ఇంకా గట్టిగా తగలాలి అని రెండో సభను  అనంతపురంలో నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్.

అయితే సభకు సంబంధిన వివరాలను జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య వెల్లడించారు.

ప్రకటనలో ప్రత్యేక హోదా గురించి చాలా విషయాలు తెలిపారు పవన్ కళ్యాణ్. ప్రత్యేక హోదా వస్తే ప్రతి ఏటా కరువు కాటకాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న అనంతపురం జిల్లాకి చాలా ఉపయోగకరమని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక హోదా పోరాట సభలను నిర్వహిస్తామని పవన్ తెలియచేసారు.

పవనం దాడి కేద్ర ప్రభుత్వాన్ని గట్టిగా తట్టి లేపాలని ఆశిద్దాం.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *