ఓ వ్యాపారి దీపావళి కానుకలు, ఉద్యోగులకి బోనస్ గా ఫ్లాట్లు కార్లు! | Telugu News
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి కేంద్ర ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది.-కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు స్వర్ణాలతో అదరగొట్టారు.-ఇంటర్ నెట్ లో వైరల్ గా మారిన హైదరాబాద్ క్రీడాకారిణి పివి సింధు ఫోటోషూట్..!!-ఇరు రాష్ట్రాల్లో షాక్..ఏపీ లో కంటే ముందుగా తెలంగాణాలో మొదలెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్!-వికారాబాద్ లో తోపుడు బండిపై భార్య మృతు దేహంతో 60 కి.మీ నడక…!!-ఇప్పుడు రానానే సోలో హీరో అని వార్తలు వస్తున్నాయి.-హీరో శర్వానంద్ సినిమా కి సరికొత్త ప్లాన్ వేస్తున్న దిల్ రాజు కు ఈ సినిమా సెంటిమెంట్ గా మారింది.-ప్రధాన పుణ్యక్షేత్రాల్లో చిరంజీవి కోసం పూజలు చేస్తున్న మెగా అభిమానాలు !-చిరు కోసం క్లైమాక్స్ ఫైట్‌ను డిఫరెంట్‌గా ఉండేలా కనల్ కణ్ణన్‌తో డిజైన్ చేయించారు.-ఇద్దరూ కథానాయికులతో త్రివిక్రమ్,పవన్ కళ్యాణ్ ల కొత్త సినిమా లాంచింగ్ !

ఓ వ్యాపారి దీపావళి కానుకలు, ఉద్యోగులకి బోనస్ గా ఫ్లాట్లు కార్లు!

గవర్నమెంట్ ఉద్యోగులకైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులకు అయినా  ప్రైవేట్ ఉద్యోగులకి అయినా పండగ కానుకగా ఒక నెల బోనస్ తో పాటు ఏవైనా పండగ గిఫ్ట్ లు ఇస్తారనే విషయం అందరికీ విదితమే.

ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం చేసే ఏ యజమాని అయినా ఇలా ఇస్తాడా? మహా అయితే పండుగ వచ్చిందంటే ఏ స్వీట్ ప్యాకెట్లో బోనస్ గా ఒక నెల జీతమో లేక దుస్తుల్లో ఇవ్వడం విన్నాం గానీ ఎక్కడైనా ఎవరైనా కార్లు ప్లాట్లు ఇచ్చారని విన్నామా? అసలు ఈ వార్త నిజమేనా? ఇదేగా మీ అందరి మది లోని ప్రశ్న.

ఇలా మన బాస్ కూడా మనకి ఇస్తే ఎంత బాగుండు అనే చిన్న ఆశ కూడా కలుగుతుంది కదా.

నిజమే నండి ఒక ప్రముఖ వ్యాపారవేత్త దీపావళికి బోనస్ గా తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులకి  12,60 కార్లు, 400 ప్లాట్లు ఇచ్చి శభాష్ అనిపించుకున్నాడు.

ఇలా ఇచ్చిన వ్యక్తి ఎవరో ఏం వ్యాపారం చేస్తాడో తెలుసా? ఒక వజ్రాల వ్యాపారి, ఆయన పేరు ఢోలకియ. యజమానులు అందరిలో కెల్లా గొప్ప మనసున్న ఒక మంచి యజమాని.

హరేకృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌ యజమాని ఢోలకియ వ్యక్తిత్వంలో గొప్ప వాడు.

వజ్రాల వ్యాపారం అంటేనే వేల కోట్లల్లో బిజినెస్ జరుగుతుంది కదా ఆయనకి 50 కోట్లు ఒక లెక్కా అనుకోవచ్చు. నిజమే 50 కోట్లు ఆయనకి లెక్క కాకపోవచ్చు కానీ ఆయన కంటే గొప్ప వ్యాపారస్తులు చాలా మందే ఉన్నారు. కానీ ఈయన లా ఉద్యోగుల గురించి ఆలోచించే మనసు అందరికి ఉండదు కదా..

ఎంత ఉన్నా పెట్టడానికి ఏడ్చే ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు చాల అరుదైన వారు. ఉద్యోగుల పట్ల అభిమానం ఆప్యాయత కలిగిన ఈయన క్రిందటి సంవత్సరం 50 కోట్లు ఖర్చు పెట్టి 491 కార్లు 200 ప్లాట్లు ఉద్యోగులకు బహుమతి గా ఇచ్చారు.

ఈ ఏడాది కంపెనీ స్వర్ణోత్సవాల్ని పురస్కరించుకుని బోనస్‌ కోసం రూ.51 కోట్లు వెచ్చిస్తోంది. అయితే ఈ స్పెషల్ బోనస్ అందరికి వర్తించ కుండా ఉత్తమ ఉద్యోగుల్ని ఎంపిక చెయ్యడం గొప్ప విశేషం. ఇలా అయితే బోనస్ కోసమైనా కష్టపడి పని చేస్తారు కొందరు బద్దకస్తులు. నిజాయితీ గా పని చేసే వాడికి ఎప్పుడు తగిన గౌరవం ఎలాగూ దక్కుతుంది.  ఈ సంవత్సరం కంపెనీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగుల జాబితాలో మొత్తం 1,716 మంది ఉన్నారు.

బోనస్‌ వివరాల్ని మంగళవారం ఉద్యోగులతో నిర్వహించిన అనధికార సమావేశంలో ప్రకటించారు హరేకృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌ యజమాని ఢోలకియా.

ఒక బాస్ తన ఉద్యోగుల పట్ల ఏ విధంగా మలసుకోవాలో ఉదాహరణ గా చెప్పుకోడానికి ఈయనే ప్రత్యక్ష నిదర్శనంగా తీసుకొనేలా ఉన్న ఆయన ఆలోచనా విధానం నిజంగా అభినందించ దగ్గదే. ఇలాంటి వాళ్ళు కోటికి ఒక్కరు ఉంటే గగనం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *