జామపండు సుందరీమణుల సుకుమారం కోసమా లేక సోగ్గాళ్ళ సౌందర్యం కోసమా? | Telugu News
కృష్ణాబోర్డు, జూరాలపైనా సంయుక్త పర్యవేక్షణ-మరో రెండు రోజుల తరువాత లోధా కమిటీతో భేటీ..-వీరి వీరి గుమ్మడిపండు.. దాగుడుమూతల దండాకోర్.. వీరి పేరు ఏంటో? చెప్పుకోండి చూద్దాం.-రిలియన్స్ జియో లైఫ్ ఫోన్ పేలి ఆ కంపనీకి పెద్ద సవాలునే విసిరింది.-కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కాకుండా ఆయన అల్లుడు హరీష్ రావు సీఎం అవుతారేమో అన్న భయంతోనే ఆయన ఈ నిర్ణయం-‘ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా’ ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌వంబ‌ర్ 18న విడుద‌ల‌:హీరో నిఖిల్-ఎనర్జిటి స్టార్ రామ్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చినాడు.-జీవా హీరోగా గ్లామరస్‌ బ్యూటీ హన్సిక మోత్వాని హీరోయిన్‌గా నవంబర్‌ 12న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతున్న ‘పోకిరిరాజా’-‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ చిత్రం కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ !-ఇండియా, అమెరికా, చైనా, రష్యా నటులతో ‘న్యూక్లియర్’ రూ. 340 కోట్ల భారీ బడ్జెట్ తో రామ్ గోపాల్ వర్మ!

జామపండు సుందరీమణుల సుకుమారం కోసమా లేక సోగ్గాళ్ళ సౌందర్యం కోసమా?

జామపండును చూస్తే మనలో చాలా మందికి నోరు ఊరుతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు కొరికి తిందామా అనిపిస్తుంది. పిల్లల గురించి వేరే చెప్పాల్సిన పనేలేదు. అంత రుచి ఉంటుంది కాబట్టే పక్కింటి గోడ దూకి మరీ జామ కాయలు దొంగిలించి తిన్న వారు చాలా మందే ఉంటారు. ఇంటి పొదరింట్లో పెరట్లో ఉండే పండ్ల చెట్లలో మొదటి ప్రాధాన్యత జామ చెట్టుకే. పెరట్లోనే కాదు ఆరోగ్యంలోనూ జామపండుకుమొట్ట మొదటి ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు నిపుణులు. మార్కెట్లో మిగతా పండ్లతో పోలిస్తే ధర తక్కువ, వాటి కంటే రుచి పోషకాలూ ఎక్కువ.

ఆరోగ్యం అంటే మనకి మనకి ముందు గుర్తొచ్చే పండు ఆపిల్. రోజుకి ఒక ఆపిల్ తింటే డాక్టర్ దగ్గరకే వెళ్లాల్సిన అవసరం రాదు అంటారు కదా… ఇది మనకి తెలిసిన విషయం కానీ మనకి తెలియని విషయం ఏంటంటే ఖరీదైన ఆపిల్ కంటే చౌకగా చేతికి చిక్కే జామ పండులోనే ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. ఆపిల్ పండ్లు రేట్లు చూస్తే ఆకాశాన్ని అంటుతాయి వాటిని పేదవాళ్లు కొనే పరిస్థితి లేకపోవడం వల్ల, దాని కంటే తక్కువ ధరలో ఉండి ఆపిల్ స్థాయి కంటే ఎక్కువ పోషక విలువలు జామలో లభిస్తుండడంతో దీనిని పేదవారి ఆపిల్ గా పిలుస్తున్నారు న్యూట్రిషన్లు.
హైదరాబాదులోని నేషనల్ ఇనస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రతినిధులు చేసిన పరిశోధనల ప్రకారం “సీజన్లో లభించే జామ పండులోని పోషక విలువలు మరే ఇతర పండులోనూ లభించవని” తేల్చారని న్యూట్రీషన్లు, వైద్యులు చెప్తున్నారు. జామ పండులోనే కాదు పచ్చగా అందంగా ఉండే జామ ఆకుల్లో సైతం బోలెడన్ని పోషకాలు నిక్షిప్తమై ఉన్నాయి. చిన్నప్పుడు కొందరు జామ ఆకులలో చింత పండు పెట్టుకుని తినే ఉంటారు. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం. జామ ఆకులతో ఎన్నో రకాల మందులు కూడా తయారవుతాయని స్పష్టం చేస్తున్నారు మన ఆయుర్వేద నిపుణులు. జామ పండు జ్యూస్ కి కూడా ఈ మధ్య బాగానే గిరాకీ పెరుగుతోందని పండ్లు,పండ్ల రసాల వ్యాపారులు చెబుతున్నారు. జామ పండులో లభించే విటమిన్లు, పోషకాలు, వాటిని తినటం వల్ల కలిగే లాభాలు మీకు తెలిసే ఉంటాయి కానీ మన ఆరోగ్యం కోసం మరొక్క సారి ఓ లుకేద్దాం.

జామ పండులో పొదిగి ఉన్న విటమిన్లు
జామపండులో అత్యధికంగా విటమిన్ సి మరియు పోటాషియం ఉంటాయి. వీటిని తినడం ద్వారా మన శరీరానికి కావలసిన యాంటీ ఆక్సిడెంట్లు తగినంత లభిస్తాయి. రోగ నిరోధక శక్తి పెరిగి మనిషి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. విటమిన్ సి లో జామ ఉసిరితో సమానంగా, కమలా కన్నా 5 రెట్లు ఎక్కువగా, నిమ్మ మరియు నారింజ పండ్ల కంటే 10 రెట్లు అధికంగా జామలో లభిస్తుంది. జామ తొక్కను తియ్యకుండా తొక్కతో పాటు తింటే అందులో ఉన్న పీచు పదార్థం జీర్ణ క్రియని మెరుగు పరుస్తూ శరీరానికి మంచి చేస్తుంది.

చర్మ సౌందర్యంలో కూడా ముందే…
చర్మ సౌందర్యంలో కూడా జామపండు గుజ్జు అధిక ప్రాధాన్యం సంతరించుకుంది అంటున్నారు బ్యూటీషియన్లు. మంచి సువాసన కూడా ఉండటం వల్ల బొప్పాయి, టమోటా గుజ్జుతో కంటే జామ గుజ్జుతో ఫేషియల్ చేయించుకునేందుకు ఎక్కువమంది మహిళలు ఆసక్తి చూపుతున్నారట. చర్మ సౌందర్యాన్ని పెంచటంతో పాటు ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలను తొలగించే మంచి పోషకాలు జామ పండులో పుష్కలంగా ఉన్నాయి.

ఆయుర్వేద చరిత్రలో జామ ఆకు పాత్ర…
ఎప్పటి నుండో వివిధ రకాల ఆయుర్వేద మందుల తయారీలో జామ ఆకులను విరివిగా వాడుతున్నారు. ప్రధానంగా జలుబు, తలనొప్పి, గొంతు నొప్పి, పంటినొప్పిని నిర్మూలించే ఆయుర్వేద మందులు ఔషదాలలలో జామ ఆకుల పాత్ర కీలకం.
జామ ఆకులను శుభ్రంగా నీటితో కడిగి బాగా ఎండబెట్టిన తర్వాత పొడి చేసి మజ్జిగలో, తేనెలో కలుపుకుని తినడం వల్ల మైగ్రేన్ (తలనొప్పి),సైనస్ భారీ నుండి విముక్తి పొందొచ్చు.
జామ బెరడుని బాగా శుభ్రం చేసి వేడి నీటిలో మరిగించి తర్వాత వడకట్టుకుని రెండు పుదీన ఆకులను ఆ మరిగిన నీటిలో వేసి రోజూ ఉదయం టీ, కాఫీలకు బదులుగా త్రాగితే శరీరంలోనిఉష్ణోగ్రతను సమతుల్యం చేసి రక్తం శుద్ధి చెయ్యదనాయికి ద్రోహదం చేస్తుంది. పొట్ట వద్ద పేరుకున్న కొవ్వును త్వరగా కరిగించే శక్తి కూడా జామ ఆకులకు ఉంది. పళ్ల సమస్యలతో బాధ పడేవారు ప్రతి రోజూ రెండు లేత జామాకులను నమిలి మింగితే పళ్ళ సమస్యలు దూరం అయ్యి మంచి ఫలితం దక్కుతుంది. ఇవన్నీ చేసే ముందు మాత్రం ఖచ్చితంగా జామ ఆకులు, పండ్లు తినడానికి ముందు నీటితో బాగా శుభ్రం చేసి తినాలి. లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది.
ఆడ మగా తేడా లేదు చిన్నా పెద్దా అని వయసు తో అసలు సంబంధం లేదు నన్ను దరి చేరుకుంటే చాలు ఎవరికైనా ఇంతే మంచి రుచుని ఆరోగ్యం కోసం అందరికీ మంచి పోషక విలువల్ని అందిస్తా అంటుంది జామ పండు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *