గుప్పెడు గుండె కోసం చిటికెడు శ్రద్ధ | Telugu News
500, 1000రూ లకు గుడ్ బై చెప్పిన మోడీ ప్రభుత్వం !!!-భారత్‌లో కోటీశ్వరులెందరో తెలుసా?-ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టు 'ఉడాన్'పథకం:గంట విమాన జర్నీకి రూ.2,500-ఆన్‌లైన్‌లో హల్‌చల్ భారత రిజర్వు బ్యాంకు త్వరలో తెలుపు,పింక్ రంగు కలయికగా రూ.2 వేల నోట్లు..-ఫెస్టివల్ బొనాంజ కింద మహిళలకు ఓ శుభవార్త.. తక్కువ వడ్డీతో గృహ రుణాలు..-హైదరబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు కళల బండి వచ్చేస్తోంది…!!-టాలీవుడ్ స్టార్ మహేష్ బ్రాండ్ ప్రమోషన్స్ .. క్రెడిట్ ఆమెకే-"న్యూడ్ గా నటించాలంటే మాత్రం నో చెప్పేస్తా" అని అంటోంది.-ఎస్ఎస్ థమన్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ 'పవన్ కళ్యాణ్' సినిమాలో ఛాన్స్ కొట్టేసినాడు-ఒక్కరోజు ముందే బరిలోకి దూకనున్న బాలయ్య..

గుప్పెడు గుండె కోసం చిటికెడు శ్రద్ధ

కొన్ని జబ్బులు మొదలయ్యాయంటే దీర్ఘకాలం వేధిస్తూనే ఉంటాయి. గుండెజబ్బు ఇలాంటి వాటిల్లో అతి పెద్ద సమస్య. అందువల్ల వచ్చాక బాధపడే కన్నా దీని బారిన పడకుండా చూసుకోవటమే అన్నింటికన్నా ఉత్తమం అంటున్నారు వైద్యులు. వయసు, కుటుంబ చరిత్ర వంటివి గుండెజబ్బు ముప్పుకి ప్రధాన కారకాలు. గుండె జబ్బు కి మనం కారకులం కాకపోవొచ్చు కానీ ఇతరత్రా ముప్పు కారకాలను నియంత్రించుకోవటం మాత్రం మనకు సాధ్యమే.
ఈ క్రింద చిట్కాలు పాటించడం వల్ల కొంత వరకు గుండె జబ్బుని తగ్గించుకోవచ్చు..

కొవ్వు తక్కువ ఉండే ఆహారం: కొవ్వులు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులు ఎక్కువ పెరిగేలా చేస్తాయి. చెడ్డ కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్) మోతాదులు ఎక్కువైతే గుండెజబ్బు, పక్షవాతం ముప్పు పెరిగే అవకాశాలు ఎక్కువ. మాంసం, చర్మంతో కూడిన చికెన్, వెన్న, ఛీజ్, వెన్నతీయని పాలతో చేసిన పదార్థాల్లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని అపరిమితంగా తీసుకో కూడదు. కొలెస్ట్రాల్ ని తగ్గించు కోవటానికి మరో మంచి మార్గం ఉంది అదేమిటో తెలుసా? పీచుతో కూడిన ఆహార పదార్ధాలైన పండ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, పొట్టు తీయని పదార్థాలు తరచుగా తినటం ద్వారా ఈ కొవ్వుని తగ్గించుకో.గలం. మనం రోజు తినే ఆహారం ద్వారా కనీసం 25 నుండి 35 గ్రాముల పీచు లభించేలా చూసుకోవటం మంచిది, అలాగే ఉప్పు కూడా మితంగా తినాలి. రోజుకు 2 గ్రాములు అంతకన్నా తక్కువ (అర చెంచా) ఉప్పు మించకుండా చూసుకుంటే మంచిది.
అరగంట వ్యాయామం: శారీరకశ్రమ గుండె సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. కాబట్టి గుండె వేగంగా కొట్టుకునేలా చేసే వ్యాయామాలను రోజుకు కనీసం అరగంట సేపు చేయడం ద్వారా గుండెకి యవ్వనాన్ని ఇవ్వొచ్చు.
పొగ మానెయ్యాలి: గుండెకు ఉన్న ప్రధాన శత్రువు పొగ. సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటివి తాగేవారికి మిగతా వారి కంటే గుండెజబ్బు వచ్చే అవకాశం 70% ఎక్కువగా ఉంటుంది. మంచి విషయం ఏంటంటే పొగ తాగటం మానేసినప్పటి నుంచే గుండె మరమ్మతు మొదలవుతుంది. అలాగే ఇతరులు పొగ త్రాగినప్పుడు వారు వదిలిన పొగను పీల్చకుండా చూసుకోవటం కూడా కీలకమే.
రక్తపోటు అదుపు: అధిక రక్త పోటు గుండెజబ్బు ముప్పును మరింత ఎక్కువ చేస్తుంది. కాబట్టి హైబీపీ గలవారు క్రమం తప్పకుండా మందులు వాడాలి. తరచుగా రక్తపోటును పరీక్షించుకుంటూ ఉండాలి నియంత్రణలో ఉందో లేదో చూసుకోవాలి.
ఒత్తిడి పెరగనీయొద్దు: ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడిని నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ఇది గుండెజబ్బుతో పాటు పలు రకాల సమస్యలను తెచ్చి పెడుతుంది. ఒత్తిడి తగ్గటానికి రకరకాల మార్గాలున్నాయి వాటిని అనుసరించడం వల్ల మైండ్ ని రిలాక్స్ చేసుకోవచ్చు. మంచి సంగీతాన్ని వినడం స్నేహితులతో గానీ కుటుంబ సభ్యులతో గానీ కలిసి సరదాగా మాట్లాడుతూ ఉండొచ్చు. నవ్వు కూడా రక్త ప్రసరణ మెరుగయ్యేలా చేసి ఒత్తిడిని చాలా వరకు తగ్గిస్తుంది. కాబట్టి నవ్వు తెప్పించే కామెడీ సినిమాలు,జోక్స్ వినడం, టీవీ కార్యక్రమాలు చూడొచ్చు. అన్నింటికీ మించి ఆఫీసు పనిని ఇంటి వరకు తెచ్చి తలనొప్పి తెప్పించు కోకుండా ఆఫీస్ వరకే పరిమితం చేసుకోవాలని గుర్తించాలి.

Related Posts

  • తాజా సర్వే కేసీఆర్ పాలన అద్భుతం
  • కృష్ణాబోర్డు, జూరాలపైనా సంయుక్త పర్యవేక్షణ
  • AP CM నారా చంద్రబాబునాయుడు దుర్గాఘాట్‌లో కృష్ణా పుష్కర స్నానం
  • కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు స్వర్ణాలతో అదరగొట్టారు.
  • వీరి వీరి గుమ్మడిపండు.. దాగుడుమూతల దండాకోర్.. వీరి పేరు ఏంటో? చెప్పుకోండి చూద్దాం.
  • ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఘోర రోడ్డు ప్రమాదం_డ్రైవర్ అక్కడికి అక్కడే మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *