స్మార్ట్ ఫోన్ల వినియోగంతో ప్ర‌పంచ మార్కెట్‌లో భార‌త్ రెండో స్థానంలో ఉంద‌ని ఆ స‌ర్వేలో తేలింది. | Telugu News
500, 1000రూ లకు గుడ్ బై చెప్పిన మోడీ ప్రభుత్వం !!!-భారత్‌లో కోటీశ్వరులెందరో తెలుసా?-ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టు 'ఉడాన్'పథకం:గంట విమాన జర్నీకి రూ.2,500-ఆన్‌లైన్‌లో హల్‌చల్ భారత రిజర్వు బ్యాంకు త్వరలో తెలుపు,పింక్ రంగు కలయికగా రూ.2 వేల నోట్లు..-ఫెస్టివల్ బొనాంజ కింద మహిళలకు ఓ శుభవార్త.. తక్కువ వడ్డీతో గృహ రుణాలు..-హైదరబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు కళల బండి వచ్చేస్తోంది…!!-టాలీవుడ్ స్టార్ మహేష్ బ్రాండ్ ప్రమోషన్స్ .. క్రెడిట్ ఆమెకే-"న్యూడ్ గా నటించాలంటే మాత్రం నో చెప్పేస్తా" అని అంటోంది.-ఎస్ఎస్ థమన్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ 'పవన్ కళ్యాణ్' సినిమాలో ఛాన్స్ కొట్టేసినాడు-ఒక్కరోజు ముందే బరిలోకి దూకనున్న బాలయ్య..

స్మార్ట్ ఫోన్ల వినియోగంతో ప్ర‌పంచ మార్కెట్‌లో భార‌త్ రెండో స్థానంలో ఉంద‌ని ఆ స‌ర్వేలో తేలింది.

విన‌డానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం. దేశ జ‌నాభా ఇంచుమించు 125 కోట్లు. అందులో మొబైల్ వినియోగ‌దారుల సంఖ్య ప్ర‌స్తుతానికి 62 కోట్లు. ఒక అంత‌ర్జాతీయ అధ్య‌య‌నం ప్ర‌కారం 2016లో భార‌త్‌లో మొబైల్ ఫోన్లు ఉన్న‌వారి సంఖ్య అక్ష‌రాల 61.6 కోట్లు. మ‌రో మూడేళ్ల‌లో అంటే 2020 నాటికి ఆ సంఖ్య వంద కోట్ల‌కు చేరుతుంద‌ట‌. మారుమూల గ్రామాల‌కు కూడా నెట్‌వ‌ర్క్ అందుబాటులోకి వ‌స్తుండ‌డం, రోజు రోజుకూ ధ‌ర‌లు త‌గ్గుతున్న ద‌ర‌ల‌తో మొబైల్ వినియోగ‌దారులు పెరిగిపోతున్నార‌న్న‌ది తాజా అధ్య‌య‌నం. ది మొబైల్ ఎకాన‌మి… ఇండియా 2016 పేరుతో జీఎస్ఎంఏ అనే సంస్థ ఒక అధ్య‌య‌నం నిర్వ‌హించింది. ప్ర‌స్తుతం 27.5 కోట్ల స్మార్ట్ ఫోన్ల వినియోగంతో ప్ర‌పంచ మార్కెట్‌లో భార‌త్ రెండో స్థానంలో ఉంద‌ని ఆ స‌ర్వేలో తేలింది. ఈ విష‌యంలో మాత్రం భార‌త్ అమెరికాను దాటేసింద‌ని ఆ నివేద‌క పేర్కొంది. 2020కి అదనంగా మరో 33 కోట్ల మంది వినియోగదారులు చేరతారని నివేదిక అంచనా వేసింది. అప్ప‌టికి 3జీ, 4జీ బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగించే వారి సంఖ్య 67 కోట్లకు చేరుతుందని తెలిపింది. గ‌త ఏడాది 2015 చివరిలో 3 కోట్ల మందిగా ఉన్న 4జీ వినియోగదారులు 2020 నాటికి 28 కోట్లకు చేరుకుంటారని జీఎస్ఎంఏ త‌న అధ్య‌య‌నం ద్వారా అంచ‌నా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *