బాబాయ్ సినిమా కోసం అబ్బాయి ఇంతలా వేచి చూస్తున్నాడా?? | Telugu News
500, 1000రూ లకు గుడ్ బై చెప్పిన మోడీ ప్రభుత్వం !!!-భారత్‌లో కోటీశ్వరులెందరో తెలుసా?-ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టు 'ఉడాన్'పథకం:గంట విమాన జర్నీకి రూ.2,500-ఆన్‌లైన్‌లో హల్‌చల్ భారత రిజర్వు బ్యాంకు త్వరలో తెలుపు,పింక్ రంగు కలయికగా రూ.2 వేల నోట్లు..-ఫెస్టివల్ బొనాంజ కింద మహిళలకు ఓ శుభవార్త.. తక్కువ వడ్డీతో గృహ రుణాలు..-హైదరబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు కళల బండి వచ్చేస్తోంది…!!-టాలీవుడ్ స్టార్ మహేష్ బ్రాండ్ ప్రమోషన్స్ .. క్రెడిట్ ఆమెకే-"న్యూడ్ గా నటించాలంటే మాత్రం నో చెప్పేస్తా" అని అంటోంది.-ఎస్ఎస్ థమన్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ 'పవన్ కళ్యాణ్' సినిమాలో ఛాన్స్ కొట్టేసినాడు-ఒక్కరోజు ముందే బరిలోకి దూకనున్న బాలయ్య..

బాబాయ్ సినిమా కోసం అబ్బాయి ఇంతలా వేచి చూస్తున్నాడా??

అంజనాపుత్ర క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో బసవ తారక పుత్ర బాలకృష్ణ చేస్తున్న బాలయ్య 100 చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి గురించి అందరికీ తెలిసినదే

చారిత్రక సినిమా కోసం తెలుగు సినీ ప్రేక్షకులంతా ఎంతలా వేచి చూస్తున్నారో మనకి విదితమేప్రేక్షకులే కాదు యావత్ తెలుగు చలనచిత్ర పరిశ్రమ కూడా ఎంత గానో ఎదురు చూస్తున్న శాతకర్ణి గురించి రోజుకో వార్త కొత్తగా మారుమోగుతూనే ఉంది.

ఇటీవల దసరా కానుకగా రిలీజ్ అయిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా టీజర్ బాలయ్య కెరీర్ లోనే ది బెస్ట్ టీజర్ గా నిలిచింది. బాబాయ్ సినిమా టీజర్ అబ్బాయి ఎన్టీఆర్ కూడా చూశాడని బాలయ్య బాబాయ్ తప్ప అంత గొప్ప పాత్రలు ఇంకెవ్వరు చెయ్యలేరని మన బుడ్డోడు చెప్పాడని ఫిలిం వర్గాల నుండి వచ్చిన వార్తలు ఇటు మీడియాలోను అటు సోషల్ మీడియాలోను తెగ చెక్కర్లు కొట్టాయి. న్యూస్ విన్న తరువాత బాలయ్యకి ఎన్టీఆర్ కి కామన్ గా ఉన్న నందమూరి అభిమానులు చాలా సంతోషించారు.బాబాయ్ అబ్బాయి అభిమానుల మధ్య చాలా కాలంగా ఉన్న విబేధాలని వార్త కొట్టి పడేస్తుందేమో అని సినీ అభిమానులు అనుకున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా అందిన సినీ వార్త ఏంటంటే ఎన్టీఆర్ క్రిష్ తో గౌతమీపుత్ర శాతకర్ణి గురించి ఫోన్ లో సరదాగా ముచ్చటించారంట

తనకి టీజర్ బాగా నచ్చిందని బాబాయ్ పాత్ర ఇంకా బాగా నచ్చిందని చెప్తూ ఇలాంటి చారిత్రక సినిమాలు క్రిష్ చెయ్యడం సంతోషాన్ని కలిగిస్తుందని తన ఆనందాన్ని దర్శకుడితో పంచుకోవడమే కాకుండా ఒక కోరిక కూడా కోరాడంట. గౌతమీ పుత్రకి సంబంధించిన వీడియో ఏదైనా చూడాలని ఉందంటూ క్రిష్ తో తన మనసులో మాట చెప్పేశాడంట తారక రాముడు. తారక రాముడి మాటల మంత్రం గురించి మనందరికీ తెలిసిందేగా. ఎంతటి వారినైనా తన మాటలతో కట్టి పడేస్తాడు. బుడ్డోడి మాటలకి సంతోషించిన అంజనా పుత్రుడు ఒక వీడియో మాత్రమే కాదు తన సినిమాకి సంబంధించిన వీడియో అయినా తారక్ కి నచ్చినప్పుడు చూడొచ్చని మాట ఇచ్చాడంట. ఎలాగైతేనేం బాబాయ్ కి అభిమానిని అని చెప్పిన తారక్ ఇప్పుడు సినిమా మీద ఉన్న ఆశక్తితో మరొక్క సారి తన అభిమానాన్ని వ్యక్త పరిచాడు. ఆత్రుతలోనే అర్ధం అవుతుంది తారక్ నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా కోసం ఎంతలా వేచి చూస్తున్నాడో. ఇప్పటి వరకు ఎన్టీఆర్ బాలయ్య అభిమానుల్లో ఉన్న విబేధాలను వార్త కొంత వరకైనా తగ్గించాలని ఆశిద్దాం.

చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా నటసింహం బాలయ్య 100 సినిమా సంక్రాంతి బరిలోకి దిగనున్నాయన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. మెగా సినిమా నందమూరి సినిమా ఏది పై చెయ్యి సాధిస్తుందో అని సినిమా అభిమానులు వేచి చూస్తున్న తరుణంలో ఇప్పుడు తాజాగా అబ్బాయి సపోర్ట్ కూడా బాలయ్య బాబు సినిమాకి ఇవ్వడంతో బాలయ్య సినిమా పై ఉన్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇద్దరు పెద్ద హీరోల విజయం కోసం సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *