భారత యువ షట్లర్ సిరిల్ వర్మ మరోసారి టాప్‌లో రాణిస్తా ! | Telugu News
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి కేంద్ర ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది.-కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు స్వర్ణాలతో అదరగొట్టారు.-ఇంటర్ నెట్ లో వైరల్ గా మారిన హైదరాబాద్ క్రీడాకారిణి పివి సింధు ఫోటోషూట్..!!-ఇరు రాష్ట్రాల్లో షాక్..ఏపీ లో కంటే ముందుగా తెలంగాణాలో మొదలెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్!-వికారాబాద్ లో తోపుడు బండిపై భార్య మృతు దేహంతో 60 కి.మీ నడక…!!-ఇప్పుడు రానానే సోలో హీరో అని వార్తలు వస్తున్నాయి.-హీరో శర్వానంద్ సినిమా కి సరికొత్త ప్లాన్ వేస్తున్న దిల్ రాజు కు ఈ సినిమా సెంటిమెంట్ గా మారింది.-ప్రధాన పుణ్యక్షేత్రాల్లో చిరంజీవి కోసం పూజలు చేస్తున్న మెగా అభిమానాలు !-చిరు కోసం క్లైమాక్స్ ఫైట్‌ను డిఫరెంట్‌గా ఉండేలా కనల్ కణ్ణన్‌తో డిజైన్ చేయించారు.-ఇద్దరూ కథానాయికులతో త్రివిక్రమ్,పవన్ కళ్యాణ్ ల కొత్త సినిమా లాంచింగ్ !

భారత యువ షట్లర్ సిరిల్ వర్మ మరోసారి టాప్‌లో రాణిస్తా !

ప్రపంచ జూనియర్ నంబర్‌వన్ సిరిల్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఖేల్ ప్రతినిధి: భారత యువ షట్లర్ సిరిల్ వర్మ మరోసారి సత్తాచాటాడు. ఈ హైదరాబాద్ కుర్రాడు ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో పురుషుల సింగిల్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తాజాగా ప్రకటించిన బీడబ్ల్యూఎఫ్ జూనియర్ ర్యాంకింగ్స్‌లో సిరిల్ ఓస్థానం ఎగబాకి టాప్‌ర్యాంకులో నిలిచాడు. 16,596 పాయింట్లతో సిరిల్ టాప్‌ర్యాంకర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటిదాకా అగ్రస్థానంలోనున్న థాయ్‌లాండ్ షట్లర్ కాంటాఫోన్ వాంగ్‌చారెన్ 16,252 పాయింట్లతో రెండోర్యాంక్‌కు పడిపోయాడు. టాప్‌ర్యాంక్‌ను నిలబెట్టుకునేందుకు మున్ముందు టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తానని సిరిల్ అన్నాడు. జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గినప్పటినుంచి నాపై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్లే ఇటీవల టోర్నీల్లో మెరుగ్గా ఆడుతున్నాను. మళ్లీ టాప్‌ర్యాంకును దక్కించుకున్నందుకు సంతోషంగా ఉంది. టాప్‌స్థానాన్ని నిలబెట్టుకుంటాను అని సిరిల్ చెప్పుకొచ్చాడు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *