అనంతపురం తరలి రానున్న జనసేన పవనం
అన్నయ్య లాగా పార్టీ పెట్టి జనం అనే పదాన్ని మరిచి విలువల్ని పక్కన పెట్టి పార్టీని పక్క గూటికి మళ్లించకుండా తనదైన శైలి లో ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసమే పార్టీ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించే పవనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..
పవన్ కళ్యాణ్ అనే పేరు విన్నా జనసేన అనే పదం విన్నా ఆవేశంతో కథం తొక్కుతారు పవర్ స్టార్ అభిమానులు. ఆయన మాటే శాశనం వారికి. ఆయన మద్దతు ఇచ్చారని టీడీపీ కి ఓట్లు కూడా వేశారు పవన్ కళ్యాణ్ అభిమానులు. మద్దతు ఇవ్వడం అంటే రాజ్యం మొత్తం చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టడం కాదని పవన్ కు తెలుసు. అందుకే ఏ విషయం జరిగినా ఏ విపత్తు వచ్చినా స్పందిస్తూనే ఉంటాడు. ప్రజల పక్షాన తాను ఉన్నాడని గుర్తు చేస్తూనే ఉంటాడు.
ఆయన సిద్ధాంతాలు ఎలా ఉన్నా విమర్శకులు ఎదో ఒక రకంగా విమర్శిస్తునే ఉన్నారు. దొంగలు పడ్డ ఆరు నెలలకి పోలీస్ లు వచ్చినట్టు ఏదైనా నష్టం జరిగినప్పుడు సంఘటన జరిగిన తరువాత ఆరు నెలలకో సంవత్సరానికో స్పందిస్తున్నాడని విమర్శలు పవన్ ని మేల్కొపాయి. ఎప్పుడూ కాస్త లేటుగా ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పంధా మార్చుకున్నాడు. ముందు గానే ఒక హేతు బద్దమైన ప్రణాళికను రూపొందించాడు. తన అభిమాని వినోద్ రాయల్ చనిపోయినప్పుడు పరామర్శించడానికి తిరుపతి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చెయ్యడానికి తాను సైతం ఉన్నానని తెలియజేస్తూ ఆగష్టు 27న తిరుమల శ్రీనివాసుడి సాక్షిగా ఒక సభ నిర్వహించి తన ముందు ప్రణాళికను ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం తన పోరాటం ఆపేది లేదని ఆ నాడే చెప్పిన పవన్ మొదటి సభను కాకినాడ లో సెప్టెంబర్ 9న నిర్వహించారు. సర్దార్ ఎఫెక్ట్ తో అభిమానులు ఎర్ర కండువాలు మెడలో ధరించి మరీ తమ నాయకుడికి అండగా ఉంటామని తిరుపతికి తరలి వెళ్ళారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తీరును వేలెత్తి చూపి రెండు పాచి పోయిన లడ్డులు ఇచ్చారని మోడీ ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తూ సీమాంధ్ర ఎంపీ లు చేతులు కట్టుకుని కుర్చున్నారా అని ప్రశ్నించాడు పవన్. ఆయన ఆచరణ ఎలా ఉన్న ఆవేశం మాత్రం నిజమే. అభిమానులకే కాదు ఆ మాటలు జన సందోహానికి కూడా ఆవేశాన్ని తెప్పించాయి. రాజకీయ వర్గాల నేతలకి గుండెల్లో సూటిగా గుచ్చుకున్నాయి.
ఆయన ఆవేశంలో ఉన్న వేడి తన మాటల తూటాల దాడి కేంద్ర ప్రభుత్వానికి ఇంకా గట్టిగా తగలాలి అని రెండో సభను అనంతపురంలో నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్.
అయితే ఈ సభకు సంబంధిన వివరాలను జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య వెల్లడించారు.
ఆ ప్రకటనలో ప్రత్యేక హోదా గురించి చాలా విషయాలు తెలిపారు పవన్ కళ్యాణ్. ప్రత్యేక హోదా వస్తే ప్రతి ఏటా కరువు కాటకాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న అనంతపురం జిల్లాకి చాలా ఉపయోగకరమని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక హోదా పోరాట సభలను నిర్వహిస్తామని పవన్ తెలియచేసారు.
ఈ పవనం దాడి కేద్ర ప్రభుత్వాన్ని గట్టిగా తట్టి లేపాలని ఆశిద్దాం.
Related Posts
- బాబాయ్ సినిమా కోసం అబ్బాయి ఇంతలా వేచి చూస్తున్నాడా??
- ఓ వ్యాపారి దీపావళి కానుకలు, ఉద్యోగులకి బోనస్ గా ఫ్లాట్లు కార్లు!
- ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ !
- ఏమిటి ఈ సర్జికల్ స్ట్రైక్ అంటే ?
- సర్జికల్ స్ట్రైక్స్ ఇలా జరిగింది…
- చనిపొయిన వారిని చంద్రుని పైకి పంపాలని ఉందా?
Leave a Reply