బాహుబలితో సరితూగాలనుకుంటున్న ఖైదీ నం150
ఒకప్పుడు నటనలో ఆయనే టాప్ ఆయన డాన్స్ చేస్తే ఆంధ్ర మొత్తం షేక్..
ఆయన ఎవరో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుందిగా.. అభిమానులంతా ఆప్యాయంగా అన్నయ్యా అని పిలుచుకునే పద్మ భూషణ్ మెగా స్టార్ చిరంజీవి.
అన్ని కష్టనష్టాలను ఎదుర్కొని “స్వయం కృషి” తో పైకొచ్చి సినీ సంస్థానంలో రారాజులా వెలిగిన వెండి తెర స్టార్ మన మెగాస్టార్..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆయన 150వ చిత్రం ‘ఖైదీ నం 150’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తరువాత చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ ఫుల్ లెంత్ లో ప్రేక్షకులని అలరించడానికి వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర నిర్మాత రామ్ చరణ్ యత్నాలు ప్రారంభించాడట. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా పూర్తి అయిందని వార్తలు వస్తున్నప్పటికీ, ఒక వార్త మాత్రం టాలీవుడ్ వర్గాలను, సగటు సినీ అభిమానిని సైతం షాక్‌లో ముంచి తేలుస్తోంది.
ఆ వార్త వింటే అందరూ షాక్ అవ్వాల్సిందే… అదేంటంటే….
బాహుబలి సినిమా సృషించిన సంచలనం అందరికీ గుర్తుందిగా.. ఆ సినిమా రికార్డులని టచ్ చెయ్యాలన్నా అగ్ర హీరోలకి, డైరెక్టర్లకి, నిర్మాతలకి చెమటలు పట్టాల్సిందే… అలాంటి విజువల్ వండర్ బాహుబలి రేంజ్లో ఖైదీ నం 150 సినిమా రిలీజ్ బిజినెస్ చేయాలని సినిమా నిర్మాత రామ్ చరణ్ భావించడమేనట. 9 ఏళ్ళ విరామం తర్వాత మళ్ళీ అలరించబోతున్న చిరు రీ ఎంట్రీ సినిమా కావడం, పైగా ఇది అతని కెరీర్లో 150వ సినిమా కావడంతో దీన్ని ఒక మరియు రాయిగా భావించి చెర్రీ కొణిదెల బ్యానర్‌పై థానే స్వయంగా నిర్మిస్తున్నాడు. తన తండ్రి ఇమేజ్ ను ఆయనకున్న మార్కెట్‌ను క్యాష్ చేసుకోవాలనుకుంటున్న చరణ్ ఈ సినిమాను బాహుబలి రేటుకు అమ్మాలనుకుంటున్నాడట. సినిమా డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ ఈ సినిమాకి సంబంధినచిన హక్కుల కోసం నిర్మాతలతో ముచ్చటించగా.. నిర్మాతలు చెప్పిన రేటు చూసి సదరు ఏసియన్ సంస్థ ప్రతినిధుల కళ్లు బైర్లు కమ్మాయట. ఈ సినిమా నిజాం హక్కుల రేటును జక్కన్న చెక్కిన అద్భుత చిత్రం బాహుబలి రేట్లకు ఏమాత్రం తగ్గకుండా దానితో సరితూగే రేట్ చెప్పారట నిర్మాతలు. దీంతో షాక్ తో మూసినా నోరు తెరవలేక మారు మాట్లాడకుండా ఇంటిదారి పట్టారట ఆసియన్ సంస్థ ప్రతినిధులు. ఈ వార్త ఆ నోటా ఈ నోటా టాలీవుడ్ పెద్దల చెవిన పడటంతో వామ్మో ఎంత 150వ సినిమా అయితే మాత్రం మరీ అంతా రేటా అంటూ ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతున్నారట.
వీళ్లంతా అవాక్కవుతున్నారన్న విషయం రాంచరణ్ గ్రహిస్తే ఆ కొండ మీద నుండి కిందకి దిగుతాడో లేక అంతే స్థాయిలో ఉంటాడో చూద్దాం.
Related Posts
- కోహ్లీని దెబ్బతీయాలని అనుకున్న కుక్…..
- ప్రధాన పుణ్యక్షేత్రాల్లో చిరంజీవి కోసం పూజలు చేస్తున్న మెగా అభిమానాలు !
- టెన్నిస్ తో ముస్తాబు అవుతున్న భాగ్యనగరం
- ఒక యువతీ పెళ్లి ఆపేసిన “మోడీ”….
- వైఫై ఫస్ట్….వైఫ్ నెక్స్ట్…
- నేడు సరిహద్దు భద్రతా దళానిది (బీఎస్ఎఫ్) ఆవిర్భావ దినం
- నా రూటే సెపెరేట్ అంటున్న తారక్ ఆ రూట్లోకే మేమొస్తాం అంటున్న డైరెక్టర్లు,నిర్మాతలు
- ఒక్కరోజు ముందే బరిలోకి దూకనున్న బాలయ్య..
- తారక్ బాటలోనే రాంచరణ్ కూడా నడుస్తున్నాడా..
- ఇంట్లొ దెయ్యం నకెం భయం ట్రైలర్ లాంచ్ దగ్గర మౌర్యని హాట్ ఫొటొస్
- ఇలియనా అమెజన్ ఇండియ ఫ్యాషన్ వీక్ : ఫొటొస్
- ఓ రేంజ్ లో దుమ్మురేపుతున్న సింగం 3 టీజర్
- బాబాయ్ సినిమా కోసం అబ్బాయి ఇంతలా వేచి చూస్తున్నాడా??
- కోరమీసంతో కేక పుట్టిస్తున్న తారక్…..
- సూపర్ స్టార్ రోబో2లో నలుగురు స్టార్ హీరోలు ఉన్నారా??
- చిరంజీవి ఖైధీ నెం 150 ఫొటొస్

Leave a Reply