జియో యూజ‌ర్‌ల‌కు గుడ్ న్యూస్ జియో హ్యాపీ న్యూఇయర్ ఆఫ‌ర్ | Telugu News

జియో యూజ‌ర్‌ల‌కు గుడ్ న్యూస్ జియో హ్యాపీ న్యూఇయర్ ఆఫ‌ర్

జియో యూజ‌ర్‌ల‌కు గుడ్ న్యూస్ మోసుకొచ్చింది రిల‌య‌న్స్ సంస్థ‌. త్వ‌ర‌లోనే వెల్క‌మ్ ఆఫ‌ర్ ముగియ‌నుంది. ఇలాంటి టైమ్‌లో ఆ సంస్థ త‌న వినియోగ‌దారుల‌ను కాపాడుకునేందుకు, ఇత‌ర టెలికామ్ సంస్థ‌ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించే నిర్ణ‌యానికి రెడీ అయిందని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. త‌న ఫ్రీ వాయిస్, డేటా ఆఫ‌ర్‌ని మ‌రింత పొడిగించే అవ‌కాశం ఉంది.పెద్ద నోట్ల ర‌ద్దుతో ఆశించిన స్థాయిలో స్మార్ట్ ఫోన్ అమ్మ‌కాలు లేవు. బాగా ప‌డిపోయాయి. దీనికితోడు, ప్రారంభం నుంచి ప్ర‌స్తుత ఆప‌రేట‌ర్‌లు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో జియో ఖాతాదారులు వాయిస్ కాల్స్ విష‌యంలో బాగా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇది కూడా జియో వినియోగ‌దారుల‌ను అసంతృప్తికి లోను చేసింది.

దీంతో, ఫ్రీ ఆఫ‌ర్‌ని వ‌చ్చే ఏడాది మార్చి వ‌ర‌కు పొడిగించాల‌ని కంపెనీ ఇప్ప‌టికే నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే, వెల్క‌మ్ ఆఫ‌ర్‌పై ఇప్ప‌టికే ఇత‌ర టెలికామ్ ఆప‌రేట‌ర్‌లు గ‌గ్గోలు పెడుతున్నాయి. త‌మ సంస్థ‌ల ప్ర‌యోజ‌నాలకు ఇది తీవ్ర ముప్పుగా ప‌రిణ‌మిస్తోందని భావిస్తున్నాయి. దీంతో, మ‌రోసారి ఈ ఆఫ‌ర్‌పై టెలికామ్ రెగ్యులేట‌రీ సంస్థ‌కి ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.ఈ వార్ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. రిల‌య‌న్స్ ఎట్టి ప‌రిస్థితుల‌ను త‌న ఫ్రీ ఆఫ‌ర్‌ని మార్చి వ‌ర‌కు పొడిగించేలా క‌స‌ర‌త్తు సిద్ధం చేసిందని స‌మాచారం.

మ‌రోవైపు, ఖాతాదారులను సంపాదించడంలో రిల‌య‌న్స్ జియో కొత్త రికార్డ్‌లు క్రియేట్ చేస్తోంది. మార్కెట్‌లోకి వ‌చ్చిన 83 రోజుల్లోనే ఏకంగా 5 కోట్ల‌మందికి పైగా వినియోగదారుల‌ను సంపాదించింది. నిముషానికి 1000 మంది, రోజుకు 6 ల‌క్ష‌ల మంది చొప్పున వినియోగ‌దారుల‌ను త‌న గూటిలోకి లాగింది. టెలికాం చ‌రిత్ర‌లోనే ఇది ఓ రికార్డ్‌. 5 కోట్ల మంది ఖాతాదారుల‌ను పొంద‌డానికి ఎయిర్‌టెల్‌కి 12ఏళ్లు, వొడాఫోన్, ఐడియాకి 13 ఏళ్ల స‌మ‌యం ప‌ట్టింది. కానీ, రిల‌య‌న్స్ ఈ మైల్ స్టోన్‌ని కేవ‌లం 83 రోజుల్లోనే చేరుకోవ‌డం విశేషం.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts