టాప్ హీరోల గుండెల్లో గునపం దింపిన కంగనా | Telugu News

టాప్ హీరోల గుండెల్లో గునపం దింపిన కంగనా

ప్ర‌భాస్ హీరోయిన్ బాంబ్ పేల్చింది. నిన్న టాలీవుడ్‌లో ఓ బ‌డా హీరో త‌న‌ను రూమ్‌కి ర‌మ్మ‌న్నాడంటూ షాకింగ్ న్యూస్ చెప్పి సంచ‌ల‌నం క్రియేట్ చేసింది రాధికా ఆప్టే.. తాజాగా ఇదే బాట‌లో విల‌క్ష‌ణ క‌థానాయిక, జాతీయ ఉత్త‌మ న‌టి కంగ‌నా ర‌నౌత్ కూడా ఓ షాకింగ్ కామెంట్ చేసింది. కంగ‌న చేసిన ఓ వ్యాఖ్య దేశ వ్యాప్తంగా అన్ని భాష‌ల‌లోనూ ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.

ఇంత‌కీ ఆ కామెంట్ ఏంటంటే.. టాప్ హీరోలంతా త‌న‌ను అన్ని ర‌కాలుగా వాడుకున్నార‌ని తెలిపింది. తననే కాదు, మిగిలిన టాప్ హీరోయిన్‌లంద‌రూ కూడా ఇదే ప‌ద్ధ‌తి ఫాలో అయ్యార‌ని చెప్పుకొచ్చింద‌ట ఓ ఇంట‌ర్‌వ్యూలో ఈ అమ్మ‌డు. పెద్ద హీరోలు పైకి క‌నిపించేంత మంచోళ్లు కాద‌న‌, వాళ్లంద‌రికీ ప‌రువు, సంతోషాలే ముఖ్య‌మ‌ని కూడా చెప్పింద‌ట‌. ప‌రువు సంతోషాలు అంటే ఏంటో అర్ధం చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది కంగ‌న‌.

కంగ‌న ఇంట‌ర్‌వ్యూతో దేశ వ్యాప్తంగా టాప్ హీరోలంద‌రిలోనూ షేక్ మొద‌ల‌యింది. ఆమెను వాడుకున్న బ‌డా హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌తోపాటు, వేరే హీరోయిన్‌లు, కేర‌క్ట‌ర్ ఆర్టిస్ట్‌ల‌తో లింక్‌లు ఉన్న వాళ్లంతా ఆమెకు ఫోన్‌లు చేసి త‌మ సీక్రెట్స్‌ను రివీల్ చెయ్యొద్ద‌ని బ‌తిమలాడుతున్నార‌ట‌. దీంతో, ఆమె ఫోన్ ఫుల్ ఎంగేజ్ వ‌స్తోంద‌ని స‌మాచారం.

మొత్త‌మ్మీద‌, కంగ‌న వ్యాఖ్య‌లు మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. హీరోయిన్‌ల‌కు ఆఫ‌ర్‌లు ఎలా వ‌స్తాయో అనేది హాట్ టాపిక్‌గా మారింది. క‌థానాయిక‌ల జీవితాల‌తో బ‌డా హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎలా ఆడుకుంటారో ఆమె వ్యాఖ్య‌లే చెబుతున్నాయి. మ‌రి, కంగ‌న వ్యాఖ్య‌ల‌తో మ‌రికొంత‌మంది హీరోయిన్‌లు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చి ఇలాంటి స్టేట్‌మెంట్‌లు ఇస్తారేమో చూడాలి. అన్ని మాట‌లు చెప్పిన కంగ‌న‌.. ఆ హీరోల పేర్లు ఎందుకు బ‌య‌ట పెట్ట‌లేదో.. ! దానికి కాస్త టైమ్ తీసుకుంటుందా..? లేక‌, మ‌రో ఇంట‌ర్‌వ్యూలో ఆ బాంబ్ కూడా పేలుస్తుందా..? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts