వైఫై ఫస్ట్….వైఫ్ నెక్స్ట్… | Telugu News

వైఫై ఫస్ట్….వైఫ్ నెక్స్ట్…

ఈరోజుల్లో మనిషి జీవితంలో ప్రతి విషయం టెక్నాలజీతో ముడిపడిపోయింది. ఎంతలా అంటే ఇంటర్ నెట్ అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఓ పది నిమిషాలు ఇంటర్ నెట్ పనిచేయకపోతే జనజీవనం స్తంభించేంతగా పెనవేసుకుపోయింది. మనిషి జీవితంలో భాగంగా మారిపోయిన ఈ టెక్నాలజీ.. అందరిని పూర్తిగా లోబరుచుకుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

ఇంటర్ నెట్ వాడకం పెరిగిపోయిన ఈ రోజుల్లో వైఫై ప్రాధాన్యం సర్వసాధారణం అయిపోయింది మనషులతో పూర్తిగా పెనవేసుకుపోయిన వైఫై వారిని శారీరక, మానసిక అవసరాల నుంచి కూడా దూరం చేస్తుందనేది తాజా అధ్యయనంలో వెల్లడైంది.

ఐపాస్ గ్లోబల్ మీడియా కనెక్టివిటీ సంస్థ 1700 మందిపై ఓ అధ్యయనం నిర్వహించింది. వీరిలో ఎక్కువ మంది శృంగారం కంటే కూడా వైఫైకే ప్రాధాన్యమిస్తున్నట్టు తేలింది. సుమారు 40 శాతం మంది తన జీవితంలో వైఫై అతి ముఖ్యమైనదని.. శృంగారానికన్నా వైఫైకే అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు తెలియచేశారు. 37 శాతం మంది శృంగారం తర్వాతి ఓటు కూడా వైఫైకే వేయడం ఆశ్చర్యమైన విషయం. కేవలం 14 శాతం మంది చాక్లెట్లు, 9 శాతం మంది ఆల్కహాల్ కు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం ఉన్నా రోజుల్లో మనుషుల అవసరాలకి తగ్గట్టు విపరీతంగా ఇంటర్ నెట్ అందించే సంస్థలు ఎక్కువ అయిపోయాయి. ఇంకా వాటి పోటీతత్వంతో మరి తక్కువ ధరకు ఇవ్వడం వేగం ఎక్కువ కావడం, ఎక్కడైనా అభించే అవకాశమే అందరికీ కావాలనుకోవడం అలవాటైందని.. ఇలా ప్రతిదానికి టెక్నాలజీ మీద ఆధారపడడం మనిషికి ఏ అవసరం ఉన్న స్మార్ట్ ఫోన్స్ అందుబాటులోకి రావడం ఇంకా ప్రతిదీ ఆన్ లైన్ లోనే ఉండటం దానికి కావాల్సిన నెట్ అందుబాటులోకి రావడం ఇంకా హై స్పీడ్ తో ఉండే వైఫై ప్యాకేజ్స్ అందుబాటులోకి రావడం వలన ఇంకా అందుకే అందరూ వైఫ్ కంటే వైఫైకే అధిక ప్రాధాన్యమిస్తున్నారని అధ్యయనంలో వెలువడింది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts