నల్లడబ్బు నీడలో నేటి భారతం | Telugu News

నల్లడబ్బు నీడలో నేటి భారతం

పూట గడుస్తున్నోళ్ళు పాఠాలు చెపుతున్నారు..!!
ఎలాగోలా గడుపుకోవాలనుకున్నోడు క్యూ లో నిలబడుతున్నాడు..!!
ఏం చేసినా గడవని వాడు చస్తున్నాడు..!!
ముప్పు తప్పించుకున్నోడు పండగ చేసుకుంటున్నాడు..!!
.
ఉచ్చులో ఇరుక్కున్నోడు బందులంటున్నాడు..!!
మంచి చెడు విశ్లేషిస్తే దేశద్రోహి అంటారని బుర్రున్నోడు భయపడుతున్నాడు..!!
అలవోకగా దేశభక్తులవ్వాలనుకున్న వాళ్ళు
అందొచ్చిన అవకాశాన్ని పిండేసుకుంటున్నారు..!!
.
పాలకులు నిజం చెప్పక..
ప్రతి పక్షాలు నిజం చెప్పక..
పత్రికలు నిజం చెప్పక..
నిజాలు వెతుక్కుంటూ ఎక్కడికెళ్ళాలో..
తెలియక జాగృత జనాలు జుట్టు పీక్కుంటున్నారు..!!
.
పనికిరాని పాతనోట్లు..
అందిరాని కొత్త నోట్లు..
అడ్డదారి పంపకాలు..
అక్రమంగా ఆర్జితాలు..
ఉన్నవాటి విలువ పోతుందని ఒకడి ఏడుపు..
ఉట్టిదిగి తనదాకా వస్తాయని లేనివాడి ఎదురుచూపు…
చివరాఖరికి కథ ఎటో..వేచి చూడండి..!!
.
మెచ్చుకుంటూనో..
నొచ్చుకుంటూనో..
ఓర్చుకుంటూనో..
ఉడుక్కుంటూనో..
.
బాహుబలి 2 కోసం ఎదురు చూడట్లా..
అలాగే ఇదీనూ…
ఆర్థిక సంస్కరణ ఫలితం కోసం..
ఒక 4 పక్షాలు ఆగలేరా..దేశం కోసం..!!
అడపా దడపా ఎవరో చస్తే గోలెందుకు..!!
.
సినిమా క్యూ లలొ చావట్లేదా..!!
కల్తీ సారా తాగి పోవట్లేదా..!!
ఆకలి చావులు మాత్రం తక్కువా..!!
.
ఇప్ఫుడీ చావుల మీద..
చర్చలెందుకు రాజకీయం కాకపోతే…అదీ విషయం..
వాక్ స్వాతంత్య్రం…ఉన్న దేశం కదా తలోటి కూస్తూ ఉందాం..!!
పైగా ఆ చావులు మనవి కావాయే..!!
.
అమ్మల్లారా అయ్యల్లారా..
ఈ ఆర్థిక ప్రక్షాళణా క్రమంలో
మన కళ్ళ ముందే ఎవరయిన
అల్లాడుతుంటే..కాస్త సాయ పడదాం…!!
.
సైనికుడయినా యుద్ధంలో..
చచ్చిపోతాడేమో కాని చావడానికి యుద్ధానికి వెళ్ళడు..!!
చావు ఎవరికీ ప్రియం కాదు ఎవరి బ్రతుకు చౌకా కాదు..
కష్ట కాలం లో కూడా శవాల మీద చిల్లరేరుకుంటూ..
అవినీతి మీద యుద్థం నీడలో మేడలు కట్ట చూస్తున్న..
సంకర జాతిని కుళ్ళబొడవాలనున్నా ఏం చెయ్యలేం కనుక..!!
.
సాటి మనిషిగా ఈ ఆర్థిక తుఫానుకు…
అల్లల్లాడుతున్న బడుగు జీవితాలకు అండగా నిలుద్దాం..!!

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts