జీవితంలో విలాసమే కాదండీ ఉల్లాసం కూడా కావాలి….. | Telugu News

జీవితంలో విలాసమే కాదండీ ఉల్లాసం కూడా కావాలి…..

ఒకసారి పర్వతారోహకుల గుంపొకటి ఉన్నతమైన శిఖరాలను అధి రోహించాలని వెళుతుంది. ఆ దళంలోని సభ్యుడొకడు ఎదురుగా కని పించే ఎత్తైన మార్గాన్ని చూసి వణికిపోతూ నాలో ఇంకా ముందుకు వెళ్ళే శక్తిలేదన్నాడు. సరే క్రిందకి కూడా తొంగి చూడమని తోటివార  న్నారు. అతడు క్రిందికి తొంగిచూడగానే అతనికి భయంతో నోట మాట రాలేదు. అతడు గత్యంతరం లేక ముందుకు వెళ్ళాలని నిశ్చయించుకొని విజయాన్ని సాధించాడు. మీరు సమస్యలనే సముద్రంలో వున్నా, చెరువులో వున్నా కాని సముద్రాన్ని చూసి భయపడటం, చెరువుని చూసి నిర్లక్ష్యం చేయడం పనికిరాదు. ఉల్లాసమనే నావతో సముద్రాన్ని కూడా దాటగలుగుతాం. నిర్లక్ష్యమంటే చెరువులో కూడా మునిగిపోతాం. సమస్యలు వాటికి గలకారణాలు, వాటి జటిలత్వాన్ని చూసి భయపడి దూరంగా పారిపోక పరిష్కార మార్గాన్ని ఆలోచిస్తే ప్రతి విషయంలోనూ సులభంగా నివారణ ఉంటుంది. ఏ ధాన్యమైన పిండిమరలో పిండిచక్రాల మధ్య వచ్చినప్పుడు పిండిగా తయారయి నట్లే సమస్యల మధ్య వున్నప్పటికి తీవ్రప్రయత్నం చేస్తే ఫలితం లభిస్తుంది. అందుచేత సమస్యను శ్రద్ధగా పరిశీలించి ఆత్మవిశ్వాసంతో పరిష్కరించే మీ స్వల్ప ప్రయత్నమే మీ ఉత్సాహాన్ని ద్విగుణీకృతం చేస్తుంది. ప్రతి చిన్న విజయం ఉత్సాహాన్ని ఎన్నో రెట్లు పెంచుతుంది. మీరు ప్రకాశవంతము, శక్తివంతమైన ఆత్మలు ఆత్మను శ్రేష్టమై న శక్తులస్మృతి శక్తివంతంగా వుంచుతుంది. సర్వశక్తి వంతుడైన ఈశ్వ రుని సంతానమగుట వలన నాకీ సద్గుణాలు, శక్తులు, విశేషతలు అలౌకిక వారసత్వంగా లభిస్తాయి. నా ఈ అనంతమైన సంపదను రెండు చేతులా అందరికీ పంచాలనే శ్రేష్ట సంకల్పం ఎన్నో గొప్ప అద్భుతాలు చేస్తుంది. కాని మీరు రాజయోగమనే రాజ మార్గంలో ఠీవిగా నడవండి.

ఈ ప్రపంచంలో ఎన్నో సంఘటనలు క్రమంగా ఒకదాని వెంట ఒకటి జరుగుతూనే వుంటాయి. మనం వాటినైతే మార్చలేంకాని మన దృష్టి కోణాన్నైతే మార్చుకోగలం. మన ఆలోచనలనే అందమైన తోటలో భావనా హృదయమనే నిర్మలమైన సరస్సులో ఆశాజ్యోతియను ప్రతి బింబాన్ని చూడాలి. వినీలాకాశంలో ఉల్లాసం, ఉత్సాహమనే రెక్కల ప్రభావంతో తేలిపోయే ప్రయత్నం చేయాలి. ఒకసారి మీ దృష్టి ఆకా శంలోకి మరల్చి ఆ ఎగిరే పక్షులను చూడండి. నల్లని మేఘాలలో, భూమి, ఆకాశాలు కలిసేచోట ఏర్పడే ఇంద్రధనస్సు అందమైన చిత్రా న్ని హృదయంలో నింపుకోండి. వికసించే పువ్ఞ్వలపై దృష్టి సారించి దేవాలయాలలో చిరునవ్వులు చిందించే ఆ దివ్యమూర్తులను దర్శించండి. వారిలోఎక్కడైనా పశ్నార్ధకాలు కాని, ఉదాసీనం గా, నీరసంగా కాని గట్టిగా ఏడ్చే కళ్ళు కనిపిస్తున్నాయా? మరి మీరెందుకు నిరాశ పడుతున్నారు. మీలోఆశ, విశ్వాసాలనే మొక్కను నాటి పెంచి పెద్ద చేయండి. మీ మనసులో ప్రశ్న ఉదయించినపుడే సమాధానంవుం టుందని గ్రహించాలి. మీరు గత విషయాలను త్రవ్వి తీయకండి. వాటిని మీరు తీసుకొని రాకున్నా అవే భూత, ప్రేతాలై ఆవరించి మీ శ్రేష్ట సంకల్పాల సంపదను దోచుకొనుటయే గాక మీ సమ యాన్ని, ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తాయి. పురుషార్ధంలో వేగం పెంచి ముందుకు వెళ్ళడానికి నిత్యమూ ఉల్లాసంగా వుండాలి.

సంసారిక లక్ష్యాల పూర్తికై లోభాన్ని, లాభాన్ని కూడా ఉత్సాహ  పూర్వకంగా పెంచుకుంటారు. కాని ఆధ్యాత్మిక సాధనలో అవి పరిపూర్ణంగా వుండాలి. ఇంధనం లేకుండా విమానం ఎగరలేదు. ప్రాణం లేనిదే జీవితంలేనట్లే ఉల్లాసంలేని సాధన కూడా ఉండదు. ఎందుకంటే ప్రపంచంలో సమయం, వాతావరణం, సంస్కారాలు కూడా మన ఆధ్యాత్మిక లక్ష్యాలను సవాలు చేస్తూ మధ్యలోనే భ్రమింపజేస్తాయి.

విశ్వపరివర్తన చేయాలనే సంకల్పంతో వున్న వారికి ప్రపంచంలో లభించే ప్రాప్తులన్నిటిని తిరస్కరించి పట్టుదల తమోగుణ భావనలతో ప్రకృతిని లెక్కచేయని వారికి, మాయతో నిండిన అత్యాశలను త్యజిం చి అందరిని విముక్తులను చేసే నిర్ణయం తీసుకున్న వారికి, ఇది నిజంగా నీటిలోఉన్న మొసలితో వైరంలాంటి విషయం. వారెల్ల ప్పుడూ ఉల్లాసమనే కనులార్పకుండా అప్రమత్తంగా ఉండాలి. పాత్ర సగం ఖాళీగా ఉందనే కంటే సగం పాత్ర నిండుగావుందనే శుభ చింత న వుండాలి. నకారాత్మక దృష్టికోణం ఆధ్యాత్మిక మార్గానికి అన్నిం టిని మించిన పెద్దఆటంం. ప్రతివిషయంలోనూ సంశయం, అపనమ్మకం, తనను తానే విశ్వసించకపోవటం, అలాంటి వారి జీవితం ఎంత ఒత్తిడితో కలతచెంది వుంటుందో ఆలోచించాలి. ఇందులో ఇతరులను దోషులుగా భావిస్తారు కాని నిజానికిది మన యందలి వికృత భావాల పరిణామమే. అలాంటి దృష్టిని పరివర్తన చేసుకుంటే దృశ్యాలు కూడా పరివర్తన చెంది కనిపిస్తాయి. సమస్యలనేవి మీ మనసులో ఉత్పన్నమయ్యేవే. ఇవి వ్యర్థ చింతనా కుతంత్రాలు. వీటికి బానిసలు కాక మంచి ఆలోచనలతో మార్చుకుంటూ ప్రతిదృశ్యాన్ని సాక్షియై చూడండి. ప్రతి విషయంలోను దాగి వున్న కళ్యాణప్రదమైన రహ స్యాన్ని అర్థం చేసుకుంటూ జరిగేదంతా మన మంచికే ఈ సృష్టి నాటకం ఎంతో అందమైనది. దీని సృష్టికర్తయిన శివ పరమాత్మ సత్యశివ సుందరుడు.

ఈ జీవితంలో ప్రతి ఒక్కరికి అత్యంత సన్నిహితంగా వుండే స్నేహి తుడెంతో అవసరం. మరలాంటప్పుడు ఎన్నడు మన తోడు వదలని ఆ ఈశ్వరునే తోడుగా ఎందుకు చేసుకోకూడదు: ఆయన సాంగత్యమే మనల్ని ఉల్లాసంగా ఉంచుతు న్నప్పుడు ఆయనతో యాత్ర ఎంతో ఆనందంగా వుంటుంది. ఆయనపట్లగల విశ్వాసమే మనకు పూర్తిగా సహకరిస్తుంది. కాని అతనిపట్ల ఏమాత్రం విశ్వాస ఘాత కులమైనా జన్మజన్మలకు అలాంటి తోడుమనకు లభించదు. ఆయన తోడు వది లితే కల్ప, కల్పము ఒక ప్రియమిత్రుని కోసం తహతహ లాడవలసి వస్తుంది. అందువలన ఈశ్వరునే సదా మీ తోడుగా వుంచుకోండి. అడుగడుగునా మీ ఉత్సాహాన్ని చల్లబరిచేవారు, చెడు విషయాలనే విషాన్ని గుమ్మరించే వారు మీకు నిజమైన మిత్రులు కాలేరు జాగ్రత్త. ఉల్లాసమనే రెక్కలను వ్యంగ్యమైన మాటలతో తూట్లుపడేలా చేసి మిమ్మల్ని నిరుత్సాహపరిచేవారికి దూరంగా ఉండండి. ఆకాశంలో ఎగిరే ఆశలపైన నిరాశలనే ఉల్లా సంతో తేలిపోతూ ఇతరులను తేలిపోయేలా చేయవచ్చని సమయం పిలుస్తోంది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts