ఆరుట్లలో శ్రీ బుగ్గరామలింగేశ్వర పుణ్యక్షేత్రం
రంగా రెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల సమీపంలో కొన్ని శతాబ్ధాల క్రితం వెలసిన శ్రీ బుగ్గరామలింగేశ్వర పుణ్యక్షేత్రం ఎంతో విశిష్టత గల్గినది. ఈ పుణ్యక్షేత్రంలో శివుడు లింగ రూపంలో కాకుండా భవాని సమేతంగా విగ్రహా రూపంలో దర్శనమిస్తాడు.
ఇక్కడ గంగాజలం తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహించి భవని సమేత శివుని యొక్క పాదాలను తాకుతూ అడవిలోకి ప్రవేశించి అక్కడి నుండి మాయం అవుతుంది. పూర్వకాలంలో ఇక్కడ శ్రీరాముడు శివారాధన చేశడని పురాణాల్లో ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమి నుండి అమవాస్య వరకు 15 రోజుల పాటు జాతర జరుగుతుంది.
ఇక్కడికి రాష్ట్రం నలు మూలల నుండి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి శ్రీ బుగ్గరామలింగేశ్వరుడిని ధర్శంచుకుంటారు. ఇక్కడ భక్తులు కార్తీక స్నానాలను ఆచరించి,కార్తీక దీపారాధన చేస్తారు. వచ్చే భక్తుల యోక్క కోర్కెలను శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి తీర్చుతాడని నమ్మతారు. దీంతో ప్రతి యేట భక్తులు రెట్టింపు అవుతున్నారు.
ఇక్కడకు లక్షల సంఖ్యలో వచ్చే భక్తులకు సౌకర్యల కొరత తీవ్రంగా ఉంటుంది.శతాబ్ధాల చరిత్ర కలిగిన శ్రీ బుగ్గరామలింగేశ్వర పుణ్యక్షేత్రం అభివృద్ది విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్యనికి గురి అవుతుంది. స్థానికంగా ఉన్నప్రజా ప్రతినిధులు తమకు తోచినంత విరాలాలను సేకరించి జాతర ఏర్పాట్లను చూస్తున్నా అవి ఏంత మాత్రం సరిపోవడం లేదు.
ఈ తెలంగాణా రాష్ట్రంలోనైనా శ్రీ బుగ్గరామలింగేశ్వర పుణ్యక్షేత్రం అభివృద్ది దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు
Related Posts
- బాబాయ్ సినిమా కోసం అబ్బాయి ఇంతలా వేచి చూస్తున్నాడా??
- ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ !
- రియో ఒలింపిక్స్ హాకీ పురుషులలో భారత్ పై నెదర్లాండ్ గెలిసింది
- ఏమిటి ఈ సర్జికల్ స్ట్రైక్ అంటే ?
- సర్జికల్ స్ట్రైక్స్ ఇలా జరిగింది…
- చనిపొయిన వారిని చంద్రుని పైకి పంపాలని ఉందా?
Leave a Reply