న్యూస్ చానెల్స్ టి ఆర్ పి రేటింగ్స్ కోసం ఎంతకైనా దిగజారుతున్నాయా??? | Telugu News
త్యాగాలు ప్రజలవి - భోగాలు నాయకులవి-500 నోటు కూడా రద్దేనా?? ఇప్పట్లో మనీ ఇక్కట్లు తగ్గవా??-త్వరలో ఏపీ పర్స్‌ తీసుకురాబోతున్న ఎపి సీఎం చంద్రబాబు-నేడు సరిహద్దు భద్రతా దళానిది (బీఎస్‌ఎఫ్‌) ఆవిర్భావ దినం-చంద్రబాబు కన్వీనర్‌గా 13 మందితో నీతి ఆయోగ్‌ కమిటీ-నల్లకుబేరుల మెడకు పూర్తిగా ఉచ్చు బిగించిన కేంద్ర ప్రభుత్వం-ఈ కథ చదవడం మాత్రం మిస్ అవ్వొద్దు-ఉభయ సభల్లో గందరగోళం మధ్య ఆమోదం పొందిన ఐటీ చట్టసవరణ బిల్లు-మసకబారుతున్న మానవత్వానికి వెలుగు చూపుతున్న మంచి మనసులు-జమ్మూలో ఆర్మీ ఆయుధ కేంద్రంపై ఉగ్రవాదుల అట్టాక్

న్యూస్ చానెల్స్ టి ఆర్ పి రేటింగ్స్ కోసం ఎంతకైనా దిగజారుతున్నాయా???

అన్నింటినీ అనలేం కానీ కొన్ని మీడియా సంస్థలు భాద్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని ప్రజల సమస్యలకన్నా ఏదో కొద్ది మంది వినోదానికే పెద్ద పీట వేస్తున్నాయనే మాట వాస్తవం కాదంటారా..

నాకు కొన్ని న్యూస్ చానెల్ ప్రసారాలు చూస్తుంటే “T R P”ల కోసం ఎంతగా దిగజారుతున్నాయో అర్థం అవుతుంది.. మేరుగైన సమాజం కోసం అంటూ మురికి వార్తలు రాసే ముష్టి ఎదవలతో ఈ మీడియా ఎప్పుడో భ్రష్టు పట్టిపోయింది.. ప్రతీ ఓక్కరు బిజినెస్ కోసమే కాదనను ఓప్పుకుంటా కానీ వాటిలో కూడా మార్జిన్ ల కోసం విలువలు తొక్కేస్తారా..

టీ ఆర్ పీ ల కోసం దిగజారుతున్నపుడు మీడియా ఏ సామాజిక భాద్యతను నేరవేరుస్తున్నట్లు? ఎవరి ప్రయోజనాలను నేరవేరుస్తున్నట్టు? మీడియా ప్రస్తుత కాలంలో ఏయే విషయాలపై దృష్టిసారించిందో గమనించినట్లైతే మీడియా ఏ రకపు సామాజిక భాద్యతను నిర్వహిస్తోందో అర్ధమవుతుంది.. నకిలీ విత్తనాలు, నకిలీ మందులు, రేషన్ దందాలు వీటి గురించి వార్తలొస్తున్నాయా.. అంటే అలాంటివేవి మన సమాజంలో లేవు జరగట్లేదంటారా..

వ్యక్తిస్వామ్యమా….. ప్రజాస్వామ్యమా…. మీడియా పయనమెటు….?

ప్రజా గొంతుకై గర్జించాల్సిన స్వయం ప్రకాశిత మీడియా సామాజిక వర్గాల, పార్టీల, పెట్టుబడి దారుల కబంధ హస్తాల పాలబడి పరాన్న భుక్కులుగా మారి స్వార్ధ నిలయాలుగా తయారు అవుతున్నాయ్..

పాత్రికేయులు (కొందరు) పాత్రికేయ వృత్తి మానేసి చాలా రోజులయ్యింది,ఎదో ఒక పార్టీకి అనధికార ప్రచార కర్త గా కొనసాగుతున్నారు,అది జగద్విదితం.ఒక రకంగా PROలు గా మారారు…ఎప్పుడైతే `మీడియా`,కార్పోరేట్ శక్తుల చేతుల్లోకి పోయిందో,అప్పుడే మీ కలాలకు ,మీ భావాలకు,మీ భావ ప్రకటనా స్వేచ్చకు పరిమితులు విధించాబడ్డాయి.ఒకరకంగా మీ భాషలో చెప్పాలంటే సంకెళ్ళు విధించబడ్డాయి.”నిస్పక్షపాతం”,అనేది “నేతి బీరకాయలో “నెయ్యి”,లాంటిది..

అసలు ఇది జర్నలిజమా..వ్యభిచారమా అని సందేహం వేస్తుంది.. వ్యభిచారం అయినా మేలు పొట్ట కోసం చేస్తున్నారు మరి మీ జర్నలిజం ఏ జర్నీ కోసం.. ఒకప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ మేమంటూ ప్రత్యక్షమైన మేధావులు ఎక్కడ ఇప్పుడు వెల్తున్నారు గిట్టుబాటు కోసం గట్టిగా నొక్కడానికి.. ఒకప్పుడు నేను చూసిన కలం యుద్ధంలో ఇప్పుడు ఇంకు అయిపోయిందా.. అంతేలే కోట్లు నొక్కేసే వాల్లే ఛానెల్స్ పెట్టి విలువల గురించి మాట్లాడుతూ ఇలా చేస్తుంటే ఏం చేస్తాం మనది ప్రేక్షక పాత్రే కదా..

పది మందినీ ప్రశ్నించాల్సిన చానెల్‌లు ప్రశ్నించే స్థాయికి ఎందుకు జారుతున్నాయి.. విలువలు పాటించడం మీడియా బాద్యత. కానీ ఆ ధర్మాన్ని తప్పటం కరెక్ట్ కాదు. జనం మీరు పూర్తి నిష్పక్షపాతంగా లేరని తెలిసినా గతి లేక మిమ్మల్ని మీరు చూపించే గ్రాఫిక్స్, మ్యూజిక్ హడావిడి, గోరంతలు కొండంతలు చేసి చూబెట్టే హడావిడి ని చూస్తున్నారు. దాన్ని అలుసుగా తీసుకుని మీ ఇష్టం వచ్చినట్లు మీరు రాస్తున్నారు, నో ప్రాబ్లం. అది మీకు ఆ చూసే జనానికి సంబందించిన సమస్య. కానీ వృతి ధర్మం అని ఒకటి ఉంది కదా, అది పాటించకుండా మీరు విలువల గురించి మాట్లాడితే బాగుంటుందా? ఒక్క క్షణం మీ అంతరాత్మ ని బెడ్ రూమ్ లోనో, బాత్ రూమ్ లో నో కెమెరాలు లేకుండా ఎవరు చూడకుండా అయినా అడిగి చూడండి… ప్రశ్నించుకోండి..

 

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts