సమాజంలో మార్పుకి అద్దం పట్టే విధంగా భారతీయ రైల్వే శాఖ సరికొత్త నిర్ణయం | Telugu News
ఈ కథ చదవడం మాత్రం మిస్ అవ్వొద్దు-ఉభయ సభల్లో గందరగోళం మధ్య ఆమోదం పొందిన ఐటీ చట్టసవరణ బిల్లు-మసకబారుతున్న మానవత్వానికి వెలుగు చూపుతున్న మంచి మనసులు-జమ్మూలో ఆర్మీ ఆయుధ కేంద్రంపై ఉగ్రవాదుల అట్టాక్-2000 నోటుని సైతం రద్దు చ్చేయనున్న మోడీ సర్కారు!!-పొట్ట కూటి కోసం నిగ్రహంతో సజీవ విగ్రహంలా 30 ఏళ్ళు నిలబడ్డాడు-జియో యూజర్లు ఈ మాట విన్నారంటే పండుగ చేసుకుంటారు-ఆధునిక తెలుగుకు అడుగుజాడ మన గురజాడ-సూపర్ స్టార్ రోబో2లో నలుగురు స్టార్ హీరోలు ఉన్నారా??-ఒక ప్రభుత్వ డాక్టర్ పేద విద్యార్థి ప్రాణంతో ఆడుకున్న ఆట

సమాజంలో మార్పుకి అద్దం పట్టే విధంగా భారతీయ రైల్వే శాఖ సరికొత్త నిర్ణయం

ఆడవాళ్ళూ మగవాళ్ళు అని లింగ విబేధాలు లేకుండా మీరా మేమా అని మగ వాళ్ళతో సైతం పోటీ పడేలా ఆడవాళ్ళు తమ సత్త చాటుకున్న ఈ భవ్య భారతదేశం ఆడవాళ్ళ విషయంలో తల వొంచి వారిని ముందుకి నడిపే సాహసం చేసిందే కానీ ఒక లింగం విషయంలో మాత్రం ఇంకా కొన్ని చోట్ల వివక్షత చూపుతూనే ఉంది.
వారే ట్రాన్స్‌జెండర్స్‌…. వీరు ఆడ కాదు మగా కాదు అలాంటప్పుడు వారికి కూడా ఒక ప్రత్యేకమైన లింగం ఉన్నట్టే కదా..
అసలు అలాంటి వాళ్ళ పుట్టుకకి కారణం కూడా మన స్త్రీ పురుషులే కదా… అలాంటప్పుడు వారికి కూడా ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంటే బాగుంటుంది కదా అని మీలో ఏ ఒక్కరికైనా అనిపించిందా..??
అనిపించదు.. ఒకవేళ అనిపించినా మనకెందుకులే అనుకుంటాం.
మిమ్మల్ని వోట్ వెయ్యమని అడగడానికి వచ్చిన నాయకుల్ని ఏ ఒక్కరైనా అడిగారా ట్రాన్స్‌జెండర్స్‌ కి కూడా ఒక గుర్తింపు రావాలని?

ఈ దిశగా మార్పు తీసుకు రావడంలో మన సమాజం ఇంకా వెనుక బడే ఉంది.
ఇప్పుడు మనం ఈ ట్రాన్స్‌జెండర్స్‌ అనే పదం వింటే చాలు వాళ్ళేమి మనకంటే తక్కువ కాదులే అని టక్కున అనేస్తాం. మాటైతే బాగానే అంటున్నాం మరి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం మానమైన ఇస్తున్నామా?? లేదు కదా….
చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించారు, అన్ని అవమానాలు భరించారు. సమాజంలో వారిని చూసిన చిన్న చూపుకి, వారికి లోపించిన గుర్తింపుకి వారు అనుభవించిన నరక యాతన సామాన్య మనుషులెవరూ అనుభవించి ఉండరేమో.
ఒకప్పుడు మన సమాజం వీరిని చూసిన చిన్న చూపు వేశ్యలని, హంతకులని, కరుడ గట్టిన దుర్మార్గులని కూడా చూడలేదేమో.. ఇప్పటికీ వివక్ష లేకపోలేదు కానీ కొంత వరకు ఆ భావం తగ్గిందనే చెప్పాలి.
నానాటికి వారిపై ఉన్న చులకన భావం తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే దీనికి కారణం వారిలో ఉన్న పట్టుదలే. అన్ని రంగాలలోను సిగ్గుతోనో లోపం ఉందనే బాధతోనో వెనక్కి తిరిగి రాకుండా ముందుకి దూసుకుపోయారు. ఇప్పుడు నలుగురిలో కలిసి తలెత్తుకుని జీవించే స్థాయికి వారు చేరిపోయారు.
వీరికి అరుదైన గౌరవం ఇవ్వాలనుకుంది మన భారతీయ రైల్వే శాఖ. దాని కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు టికెట్స్ రిజర్వేషన్, క్యాన్సిలేషన్‌ ఫామ్స్‌లో ఆడ, మగ కేటగిరీలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్‌ను మూడో కేటగిరిగా చేర్చుతున్నట్లు భారతీయ రైల్వే శాఖ ప్రకటించింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ టికెట్ రిజర్వేషన్, క్యాన్సిలేషన్‌లో ఈ కేటగిరి ఉంటుందని రైల్వేస్, ఐఆర్‌సీటీసీ సంయుక్తంగా తెలిపాయి. రైల్వే శాఖ నిర్ణయం పట్ల ట్రాన్స్‌జెండర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు రైళ్లలో తమపై వివక్ష చూపించారని, ఇకపై తాము కూడా రిజర్వేషన్ చేయించుకునే రైళ్లలో ప్రయాణిస్తామని చెబుతున్నారు.
ఈ మార్పు రైల్వే శాఖలోనే కాదు ఈ ఆటవిక సమాజంలో కూడా మరింత మార్పు తీసుకురావాలని ఆశిద్దాం.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts