మనిషి జీవితంతో చెడుగుడు ఆడుతున్నా ప్యాకెట్ పాలు… | Telugu News
త్యాగాలు ప్రజలవి - భోగాలు నాయకులవి-500 నోటు కూడా రద్దేనా?? ఇప్పట్లో మనీ ఇక్కట్లు తగ్గవా??-త్వరలో ఏపీ పర్స్‌ తీసుకురాబోతున్న ఎపి సీఎం చంద్రబాబు-నేడు సరిహద్దు భద్రతా దళానిది (బీఎస్‌ఎఫ్‌) ఆవిర్భావ దినం-చంద్రబాబు కన్వీనర్‌గా 13 మందితో నీతి ఆయోగ్‌ కమిటీ-నల్లకుబేరుల మెడకు పూర్తిగా ఉచ్చు బిగించిన కేంద్ర ప్రభుత్వం-ఈ కథ చదవడం మాత్రం మిస్ అవ్వొద్దు-ఉభయ సభల్లో గందరగోళం మధ్య ఆమోదం పొందిన ఐటీ చట్టసవరణ బిల్లు-మసకబారుతున్న మానవత్వానికి వెలుగు చూపుతున్న మంచి మనసులు-జమ్మూలో ఆర్మీ ఆయుధ కేంద్రంపై ఉగ్రవాదుల అట్టాక్

మనిషి జీవితంతో చెడుగుడు ఆడుతున్నా ప్యాకెట్ పాలు…

మనం తాగుతున్న టీ,కాఫీల దగ్గర నుండి నిత్యం తినే పెరుగు వరకు అంతా కలుషితమే..

ఇవన్నీ పాలతోనే తయారవుతున్నాయి కదా మరి కలుషితం ఎలా అవుతున్నాయి అనుకుంటున్నారా?
పాలు మంచి పౌష్టికాహారం అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాని ఇప్పుడు మనం తాగే పాలు, తినే పాల ఉత్పత్తుల్లో 70శాతం ప్రాసెసింగ్ చేసిన మిల్స్ ప్రొడక్ట్సే.. టీ స్టాళ్లు, హోటళ్లలో తాగే టీ, కాఫీల్లో వాడే పాలు నూరు శాతం ప్రాసెస్ చేసినవి.. ఇంతకీ పాలను ఎలా ప్రాసెస్ చేస్తారు, మనం వాడే ప్యాకెట్ పాలకు కారణమయ్యే పాలపొడిని ఏవిధంగా చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే..

* మొదటగా’సెంట్రిఫ్యూజ్’అనే పద్ధతిలో పాలలోని ప్రొటీన్‌ను, కొవ్వును, నీటిని వేరు చేస్తారు. కొవ్వును ఐస్‌క్రీం కంపెనీలకు అమ్మి, మిగిలిన దాంట్లో పాలపొడిని కలిపి దానిని’పాశ్చురైజేషన్’చేస్తారు. అంటే ఎక్కువ వేడి, వెంటనే బాగా చల్లదనాన్ని ఇవ్వడం ద్వారా అందులోని, సూక్ష్మజీవులను చంపేయడమనే ప్రక్రియ.

* ఇక ప్యాకెట్ పాల తయారీకి మూలమైన పాలపొడి కోసం.. ఎక్కువ వత్తిడితో ఒక చిన్న రంధ్రం లోంచి పాలను గాలిలోకి పిచికారీ చేయడం ద్వారా పాలపొడి తయారవుతుంది. అయితే ఈ క్రమంలో అందులో ఉన్న కొవ్వు గాలిలోని నైట్రేట్స్‌ను కలుపుకుని ఆక్సిడైజ్ అవుతుంది. కొలెస్ట్రాల్ శరీరానికి మంచిదే కాని ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ రక్తనాళాలను ఇంకా తొందరగా మూసేస్తుందని, గుండె జబ్బులకి, రక్తనాళాల జబ్బులకు కారణమౌతుందని తాజాగా పరిశోధనలో వెల్లడైంది.

* తక్కువ కొవ్వుండే పాలు గుండె జబ్బులకు మంచిదనే కారణంతో ప్యాకెట్ పాలను వాడుతుంటే నిజానికి వాటివల్లే గుండె జబ్బులు ఎక్కువవుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

* ప్యాకెట్ పాలు కొద్ది రోజులు నిల్వ ఉండేందుకు వీలుగా వాడే పోర్సిలిన్ తరహా రసాయనాలు శరీరానికి తీవ్రస్థాయిలో హాని చేస్తాయి.

భయంకరమైన కృత్రిమ పాలూ తయారు చేస్తున్నారు:

ఇటీవలి కాలంలో వరుస కరువులతో పాడి సంపద భారీగా తగ్గపోయింది. దీంతో కృత్రిమ పాలను తయారు చేస్తున్నారు. పైన పేర్కొన్న ప్యాకెట్ పాలకంటే ఇవి మహా భయంకరమైనవి. విష రసాయనాలతో కూడుకున్న కృత్రిమ పాలు తాగితే మనిషిలోని ప్రతి అవయం మీదా ప్రభావం పడుతుంది. యూరియా, ఇతర రసాయనాలను కలిపి వీటిని తయారు చేస్తున్నారు.చిన్నపిల్లలు తాగడం వల్ల వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది. జీర్ణకోశ వ్యాధులు, క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఎక్కువ.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts