బావకు థాంక్స్ చెప్పిన మహేష్ బాబు | Telugu News
మోడీ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది.....-500, 1000రూ లకు గుడ్ బై చెప్పిన మోడీ ప్రభుత్వం !!!-భారత్‌లో కోటీశ్వరులెందరో తెలుసా?-ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టు 'ఉడాన్'పథకం:గంట విమాన జర్నీకి రూ.2,500-ఆన్‌లైన్‌లో హల్‌చల్ భారత రిజర్వు బ్యాంకు త్వరలో తెలుపు,పింక్ రంగు కలయికగా రూ.2 వేల నోట్లు..-ఫెస్టివల్ బొనాంజ కింద మహిళలకు ఓ శుభవార్త.. తక్కువ వడ్డీతో గృహ రుణాలు..-హైదరబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు కళల బండి వచ్చేస్తోంది…!!-టాలీవుడ్ స్టార్ మహేష్ బ్రాండ్ ప్రమోషన్స్ .. క్రెడిట్ ఆమెకే-"న్యూడ్ గా నటించాలంటే మాత్రం నో చెప్పేస్తా" అని అంటోంది.-ఎస్ఎస్ థమన్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ 'పవన్ కళ్యాణ్' సినిమాలో ఛాన్స్ కొట్టేసినాడు

బావకు థాంక్స్ చెప్పిన మహేష్ బాబు

“దత్తత తీసుకోవడం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతా అనుకున్నార్రా  వీడిని వాడిని వాడిని వాడిని వాడ్ని వీళ్లందరినీ నిన్ను కూడా  దత్తత తీసుకున్నా” అంటూ సూపర్ స్టార్ ప్రిన్స్ మాహేష్ చెప్పిన డైలాగ్స్ గుర్తున్నాయి  కదా..ఎలా మరిచిపోగలం బాహుబలి తర్వాత కలెక్షన్ల వర్షం కురిపిస్తూ, ప్రొడ్యూసర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాల పంట తీసుకొచ్చిన రెండో తెలుగు సినిమా కదా అంటారా??

సూపర్ స్టార్ కృష్ణ గారి స్వగ్రామమైన బుర్రెపాలెం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలో ఉంది. అభివృద్ధి కి దూరంగా అంధకారాన్ని దగ్గరగా ఉన్న తన స్వగమాన్ని చూసి చలించిపోయాడు మహేష్. ఆయన స్వగ్రామమైన బుర్రిపాలెం కి ఎదో ఒకటి చెయ్యాలనే  తపన మొదలైంది మహేష్ కి . తన ఊరికి అండగా నిలవాలని అనుకున్నాడు.సినిమాలో డైలాగ్స్ చెప్పడమే కాదు నిజ జీవితంలో కూడా హీరో నే అని నిరూపిస్తూ స్వగ్రామానికి ఎదో ఒకటి చెయ్యాలనే కోరికతో ఒక్క అడుగు ముందుకు వేశాడు ప్రిన్స్.శ్రీమంతుడు సినిమా క్యారెక్టర్ ప్రభావమో లేక సొంత ఊరి మీద ఉన్న మమకారమే తెలీదు గానీ తన సొంత ఊరిని  ‘శ్రీమంతుడు’ సినిమా విడుదల సమయంలో దత్తత తీసుకున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు.అదృష్టవశాత్తు ఒక మంచి వ్యక్తి సూపర్ స్టార్ కి బావ అయిన గల్లా జయదేవ్ గుంటూరు జిల్లాకి ఎంపీ గా బాధ్యతలు స్వీకరించారు. అభివృద్ధికి నోచుకోని గ్రామాలను తీర్చిదిద్దాలనే సంకల్పంతో గుంటూరు జిల్లాలో నియోజక వర్గాల వైస్ గా నిధులని మంజూరు చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులతో బుర్రిపాలెం రోడ్లను, డ్రెయిన్లలను పూర్తిగా మరమ్మత్తులు చేయించారు.

ఒకప్పుడు ఒక సినిమా హీరో తన వ్యక్తిగత విషయాల గురించి గానీ మూవీ ముచ్చట్ల గురించి గానీ అభిమానులకు ప్రేక్షకులకు తెలియ జెయ్యాలంటే రెండు మాధ్యమాలను ఉపయోగించేవారు. ఒకటి వార్తా పత్రిక రెండు టెలివిజన్. ఈ రెండిటిలో ఏది చేయాలన్నా ప్రెస్ మీట్ పెట్టాలి లేదా టీవీ లో ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ తో పాటు సినిమా హీరోలు క్రికెటర్లే కాదు సామాన్య జనాలు సైతం అప్డేట్ అయిపోయారు.ప్రస్తుతం ఉన్న హీరోలు తమ మూవీ వివరాలను గానీ తమ సంతోషాలను గానీ సోషల్ మీడియా ద్వారా వారి అభిమానులకు ప్రేక్షకులకు పంచుకుంటున్నారు.

ఏ వార్తనైనా సంతోషాన్ని అయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులకి నిమిషాల్లో చేరవేస్తున్నారు.ఇప్పుడు బుర్రిపాలెం అభివృద్ధి దిశలో అడుగులు వేస్తోంది.  ఊరిలోని రోడ్డులు, డ్రైనేజీ వ్యవస్థలు మెరుగుపడ్డాయి. ఈ విషయాలను స్వయంగా సూపర్ స్టార్ మహేష్‌ బాబు ఫేస్‌బుక్‌ ద్వారా తెలియజేశారు.

“Pictures of Burripalem main road after drain to drain expansion using MPLAD funds..

Another landmark achieved !!

Thank you Jayadev Galla for ur continuous efforts and support. ” అంటూ తన ఫేస్బుక్ అకౌంట్ ద్వారా బావ గారైన గల్లా జయదేవ్ కి కృతజ్ఞతలు తెలిపాడు మన మిల్క్ బాయ్ మహేష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *