సింగరేణి కాలరీస్ కంపెనీ నుంచి శుభవార్త అందింది..ఇది కూడా కేసీఆర్ జోరే..!
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.. దక్షిణభారత దేశం లోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కేద్రం ఇది.రెండు దశాబ్దాలుగుగా నానుతోన్న సమస్యకు సింగరేణి బోర్డు సంచలన నిర్ణయంతో తెరదించింది. వారసత్వ ఉద్యోగాల పై రెండుదశాబ్దాల తరువాత నిర్ణయం తీసుకోవడం విశేషం. సింగరేణి బోర్డు డైరెక్టర్స్ శుక్రవారం జరిపిన సమావేశంలో వారసత్వ ఉద్యోగాలకు పచ్చజెండా ఊపారు.
ప్రస్తుతం సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులలో 48 నుంచి 58 సంవత్స రాల మధ్య గలవారు రిటైర్మెంట్ తీసుకున్న పక్షంలో వారి కుటుంబసభ్యులు అయిన కొడుకులు, తమ్ముళ్లు, అల్లుళ్లకు ఉద్యోగం వచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. కానీ వారి వయసు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.బోర్డు ఆఫ్ డైరెక్టర్ ల సమావేశం సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ అధ్యక్షతన జరిగింది. వారసత్వ ఉద్యోగాల పునరుద్ధరణ చట్టం 1981 ని పునరుద్ధించడం ద్వారా న్యాయ పరమైన సమస్యలు తలెత్తవనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీధర్ తెలిపారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకే తాము వారసత్వం ఉద్యోగాలపై నిర్ణయం తీసుకున్నట్లు అయన తెలిపారు. ఈ నిర్ణయం సంస్థలో పనిచేసే కార్మికులకు శుభవార్తే అయినా మిగిలిన వారి అభిప్రాయాలూ బిన్నం గా ఉండే అవకాశం ఉంది.
Leave a Reply