ఓ భారతీయుడి ఆవేదన | Telugu News
ఈ కథ చదవడం మాత్రం మిస్ అవ్వొద్దు-ఉభయ సభల్లో గందరగోళం మధ్య ఆమోదం పొందిన ఐటీ చట్టసవరణ బిల్లు-మసకబారుతున్న మానవత్వానికి వెలుగు చూపుతున్న మంచి మనసులు-జమ్మూలో ఆర్మీ ఆయుధ కేంద్రంపై ఉగ్రవాదుల అట్టాక్-2000 నోటుని సైతం రద్దు చ్చేయనున్న మోడీ సర్కారు!!-పొట్ట కూటి కోసం నిగ్రహంతో సజీవ విగ్రహంలా 30 ఏళ్ళు నిలబడ్డాడు-జియో యూజర్లు ఈ మాట విన్నారంటే పండుగ చేసుకుంటారు-ఆధునిక తెలుగుకు అడుగుజాడ మన గురజాడ-సూపర్ స్టార్ రోబో2లో నలుగురు స్టార్ హీరోలు ఉన్నారా??-ఒక ప్రభుత్వ డాక్టర్ పేద విద్యార్థి ప్రాణంతో ఆడుకున్న ఆట

ఓ భారతీయుడి ఆవేదన

ఓట్లేసి మరి ఎన్నుకున్నాం అందరినీ కలిసిమెలిసి ఉండేలా చేస్తారని.. కానీ స్వలాభాల కోసం కులాలు మతాలు అంటూ చిచ్చు పెట్టి కుళ్లిపోయిన మనసులతో మీరు చేస్తున్న వ్యాపారాన్ని అలాగే చూస్తూ ఉండమంటారా?? మా మనస్సాక్షికి మేము ద్రోహం చేసుకుంటూ బ్రతకలేం.

ఇంకెన్నాళ్ళీ సంకెళ్లు??

మా నోటికి మీరు వేసిన సంకెళ్లు మా మనసుని మౌనంగా ఉంచలేకపోతున్నాయి.
సమాజంలో మంచి జరిగేలా మీరు కొత్తగా మార్పులు తెస్తారనుకున్నాం కానీ మీరు మాత్రం అసలే అంతంత మాత్రంగా ఉన్న బంధాలని మార్చేసి మీకు తోచినట్టు మీరు చేద్దాం అనుకుంటున్నారు.
ఒకడు హిందూ దేశంగా మారుస్తానంటాడు
మరొకడు ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యమంటాడు
ఇంకొకడు క్రిస్టియన్ కంట్రీ చేసేందుకు చూస్తాడు

అసలు వారెవరు మార్చేందుకు ..?
ఎవరిచ్చారు వారికా హక్కు..?

మీకు అధికారం ఇచ్చి కుర్చీలలో కురుకోబెట్టేది మమ్మల్ని కుల మతాలకు అతీతంగా పాలిస్తారనే. కానీ పుశువుల మందలా భావించి మీరు చెప్పిన దాని కల్లా తలాడించేలా చేస్తారని కాదు.


“భిన్నత్వంలో ఏకత్వం..
మత రాహిత్యమే లౌకికత్వం.. ” అదే మన భారత్ గొప్పదనం..
ఈ విషయం మీరు ఇంకెప్పుడు తెలుసుకుంటారు..?

స్వార్థ రాజకీయాల కోసం స్వప్రయోజనాల కోసం ఇంకెన్నాళ్లు చీల్చుతారు ఈ సమాజాన్ని..?

మీలాంటి వారి కన్నా నోరులేని జీవులే నయం అంతా ఒక జాతి అనుకుంటాయి ఒక సమూహంలా జీవిస్తాయి కానీ…ఒకే ఒక అరుదైన మానవ జాతిలో పుట్టి మనుషులంతా ఒక్కటి కాదంటారేంటి ..?

రక్తం లో రకాలుండొచ్చు కానీ రక్తం రంగు మాత్రం ఒకటే.. అలాగే మనుషుల్లో మతాలు ఉండొచ్చు కానీ మానవత్వం మాత్రం ఒక్కటే..

ఇక చాలు.. జరిగిన దారుణాలు చాలు.. సృష్టించిన మారణ హోమం చాలు
ఇక ఆపండి.. ఇప్పుడు దేశానికి కావాల్సింది మతం కాదు సమానత్వం – సర్వమానవ సౌభ్రాతృత్వం
యువతకు నేర్పాల్సింది మూఢత్వం కాదు మానవత్వం – శాస్త్రీయతతో కూడిన అభివృద్ధి మంత్రం
అభివృద్ధి వైపుగా ఈ దేశాన్ని వెళ్లనీయండి. మీకు పాలించడం రాకపోతే మౌనంగా కూర్చోండి కానీ మా బ్రతుకులని శాశించాలని మాత్రం ప్రయత్నం చెయ్యొద్దు.

నాయకుల్లారా మీకు కుల గజ్జి మత పిచ్చి ఉంటే మీ దగ్గరే ఉంచుకోండి. ఈ పవిత్ర భారతావనిలో పుట్టిన యువకులకు మాత్రం దయచేసి మీ గజ్జిని పిచ్చిని అంటించకండి.

ఇంకా నా దేశం బ్రతకడం నేర్చుకుంటూనే ఉంది. అలా బ్రతకనివ్వండి నాయకుల్లారా….
మీ కంటిని కప్పేసిన కరెన్సీ కంచెను కాస్త పక్కకు నెట్టి మసక బారిన మానవత్వాన్ని మీ మనసుతో తట్టి లేపండి.

భారతీయుల్లారా ఈ గజ్జి కుక్కలకు మొరిగే అవకాశం కూడా ఇవ్వకండి. కుల మాత బేధాలకు తావు ఇవ్వకండి వీలైతే అందరం కలిసి కృషి చేద్దాం…

మేరా భరత్ మహాన్…
జై హింద్…

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts