500 నోటు కూడా రద్దేనా?? ఇప్పట్లో మనీ ఇక్కట్లు తగ్గవా??
గత నెలరోజులుగా యావత్ భారత్ ప్రజానీకం షాక్స్ మీద షాక్స్ తింటూనే ఉన్నారు.
దేశ ప్రజలకి మరో షాక్ ఇవ్వబోనుంది కేంద్ర ప్రభుత్వం. కరెన్సీ కష్టాలకి ఇప్పట్లో తెర పడే ఛాన్స్ లేదు. వున్న సమస్యలకి తోడు కొత్త కష్టాలు తోడవుతున్నాయి. హడావుడిగా మొదలు పెట్టిన 500 నోట్ల ప్రింటింగ్ ఆపేసారు. చేతిలో నోట్లు లేక… బ్యాంక్‌లోను కొత్త నోట్లు లేక జనం ఇక్కట్లు పడుతూనే ఉన్నారు ఇప్పుడు అరకొరగా అందుబాటులోకి వస్తున్న కొత్త నోట్లని కూడా సరిగా ప్రింట్ చేయలేక పోతున్నారు. మొత్తం చలామణిలో వున్నా 50 శాతం కరెన్సీ ని మోడీ ఒక్క ప్రకటనతో రద్దు చేసి పారేసారు. ఆ ప్రకటన చేసిన తర్వాత కొత్త 500 నోట్ల ముద్రణ తీరిగ్గా ప్రారంభించారు.
మొత్తం రంగం సిద్ధం చేసుకున్న తర్వాత పాత నోట్లని ఆపేస్తే బాగుండేదేమో కానీ అదేం చెయ్యకుండా నోట్ల రద్దు కార్యక్రమాన్ని ముందు తెర మీరు తెచ్చి తర్వాత కొత్త నోట్లని ప్రింట్ చేశారు. ఇప్పుడు అది కూడా ఆపేసారు. ప్రస్తుతం నాసిక్.. దేవాస్ ప్రెస్సులో చేస్తున్న వీటి ప్రింటింగ్‌ని మైసూర్‌లోని ఆధునిక ప్రింటింగ్ యూనిట్‌కి తరలించాలని నిర్ణయించారట. 1660 కోట్ల 500 నోట్లు గతంలో అందుబాటులో ఉండేవి. వాటిని రద్దు చేసిన తర్వాత ఇప్పటి వరకు కొత్త నోట్లు కేవలం కోటి మాత్రమే ప్రింట్ చేయగలిగారు. ఇప్పుడు అదీ ఆపేసారు. మైసూరులో మల్లి ముద్రణ మొదలు పెట్టి… ప్రింట్ చేసి… వాటిని జనంలోకి ఎప్పటికి తెస్తారో ఆ దేవ దేవుడికే తెలియాలి. మీరు మాత్రం మీ దగ్గరున్న వంద నోటుని 10 వేల నోటులా జాగ్రత్తగా వాడుకోండి.
Leave a Reply