జయ కోసం తపించిన శోభన్…!! | Telugu News
కరుణను తట్టుకోవాలంటే మోదీ సాయం తప్పదు...-చలికాలంలో ఇవి తింటే మంచిది...-ముంబాయి టెస్టులో ఇరు జట్లకు తొలిసారిగా....-అన్నగారి పేరిట అవార్డు ఇవ్వనున్న తెలంగాణ రాష్ట్రం...-కేజీ నుంచి పీజీ వరకూ ఒకేచోట ఉండేలా తెలంగాణకు రానున్న విద్యాసంస్థ...-తెలంగాణ సీఎం కెసిఆర్ మీద ఫైర్ అయినా టీడీపీ ఫైర్ బ్రాండ్...-ఈ బీచ్ లో బాగా ఎంజాయ్ చేయొచ్చు అంటా....-అమ్మ రాక కోసం రాత్రి వరకు చూసిన గుడి....-అల్లరోడు ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్ లైట్ తీసుకోమంది అంటా...-జియోకి అడ్డుకట్ట వేసే ప్రయత్నంలో ఉన్నబీఎస్ఎన్ఎల్..

జయ కోసం తపించిన శోభన్…!!

ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు, తమిళుల విప్లవనాయకి (పురట్చితలైవి) జయలలితకు మధ్య గల అనుబంధం ఆ రోజుల్లో హాట్ టాపిక్ గా ఉండేది. ఇద్దరి మధ్య ప్రేమ నడుస్తోందని, వారి ప్రేమ బంధానికి గుర్తుగా ఒక పాప కూడా జన్మించిందని పుకార్ల మీద పుకార్లు నడిచాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు అలనాడు పలు సినీ మ్యాగజీన్లలో హల్ చల్ చేసిన సంగతి నిన్నటి తరం వారికి తెలుసు.

శోభన్ బాబు సినిమాల్లోకి వచ్చేసరికే జయలలితకు తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన ఏ హీరో అయినా జయలలితతో నటించాలని తపించేవారు. శోభన్ బాబు కూడా ఆమెతో నటించేందుకు తెగ తాపత్రయపడేవారు. ఆమెతో నటించే అవకాశం ఒకసారి వచ్చినట్లే వచ్చి చేజారిపోయిన శోభన్ దిగాలుపడిపోయారు. ఆ తరువాత తిరిగి ఎనిమిదేళ్ల తరువాత ఆ అవకాశం డాక్టర్ బాబు చిత్రంతో లభించడంతో శోభన్ ఉబ్బితబ్బిబ్బయిపోయారు.

ఆ సినిమాతో వారిద్దరూ బాగా దగ్గరయ్యారు. తల్లి చనిపోయిన విచారంలో డిప్రెషన్లోకి వెళ్ళిన జయను శోభన్ బాబు తిరిగి కోలుకునేలా చేశారు. అప్పటి నుండి వారిద్దరూ బాగా సన్నిహితమయ్యారు. స్నేహితులుగా అన్ని రకాలుగా క్లోజ్ అయ్యారు. వారి చనువు చూసిన లోకం ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని భావించింది. అందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ పలు సినిమా పత్రికల్లో మాత్రం ఇందుకు సంబంధించిన కథనాలు పుంఖానుపుంఖాలుగా వచ్చేవి. ఈ నేపథ్యంలో వారిద్దరికి ఒక బిడ్డ కూడా పుట్టిందనే ప్రచారం జయ మనసు గాయపడిందని దాంతో తనకు ఇష్టం లేకపోయినప్పటికీ శోభన్ నుండి బలవంతంగా దూరం కావలసి వచ్చిందంటారు. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఆమె ఎంజీఆర్ కు దగ్గరవడం ఆయన సాయంతో ఆమె రాజకీయాల్లో ప్రవేశించడం జరిగిపోయింది.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts