‘మస్తీ గుడి’ సినిమా షూటింగ్లో అపశృతి.. ఇద్దరు నటులు మృతి! | Telugu News
జయహో మోడీ.. ట్రంప్ ను వెనక్కినెట్టి టైమ్స్ 'పర్సన్ ...-ఇక్కడ దైవం అన్నగారు అక్కడ దేవత అమ్మ-మా తాతయ్యే నా దైవం అంటున్న మనవడు..-పార్థివ్ పొట్టిగా ఉండటం కూడా మంచిదే అయింది....-జయలలిత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు...-తిరుగులేని ముఖ్యమంత్రులుగా రాజకీయ పీఠాన్ని అధిష్టించిన ముగ్గురు సినీ నటులు-జయ కోసం తపించిన శోభన్...!!-తమిళనాడు ఉక్కు మనిషి ఇక లేదు-అమ్మకి అశ్రునయనాలతో నివాళులు-కోటి మంది యువతకి కొత్త పథకం

‘మస్తీ గుడి’ సినిమా షూటింగ్లో అపశృతి.. ఇద్దరు నటులు మృతి!

కన్నడ హీరో దునియా విజయ్ నటిస్తోన్న ‘మస్తీ గుడి’ సినిమా షూటింగ్లో అపశృతి చోటుచేసుకుని ఇద్దరు నటులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే ఈ రోజు వెస్ట్ బెంగుళూరుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిప్పగొండనహల్లి సరస్సు వద్ద మస్తీ గుడి చిత్ర షూటింగ్ జరుగుతోంది. షూటింగ్లో భాగంగా ఓ స్టంట్ లో అనిల్ మరియు ఉదయ్ ఇద్దరు హెలికాఫ్టర్ పై నుండి సరస్సులోకి దూకారు. వారితో పాటే చిత్ర హీరో దునియా విజయ్ కూడా సరస్సులోకి దూకాడు.

వారి ముగ్గురిలో అనిల్, ఉదయ్ లు సరస్సులో మునిగిపోయారు. హీరో విజయ్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. విషయాన్ని గమనించిన సిబ్బంది తేరుకుని చర్యలు తీసుకునే లోపే ఆ ఇద్దరు యువ నటులు సరస్సులో గల్లంతైపోయారు. కాసేపటికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా వారు అనిల్, ఉదయ్ చనిపోయినట్లు తెలిసింది. స్టంట్ చేసే సమయంలో కేవలం హీరో విజయ్ కు మాత్రమే భద్రత ఉదని మిగతా ఇద్దరికీ అలాంటివేమీ లేవని అక్కడే ఉన్న ఆ ఇద్దరు నటుల సన్నిహితులు చెబుతున్నారు. ఈ మేరకు స్థానిక పోలీసులు చిత్ర యూనిట్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts