సీఎం బందోబస్తులో కుప్ప కూలిన ఖాకీ | Telugu News
ఈ కథ చదవడం మాత్రం మిస్ అవ్వొద్దు-ఉభయ సభల్లో గందరగోళం మధ్య ఆమోదం పొందిన ఐటీ చట్టసవరణ బిల్లు-మసకబారుతున్న మానవత్వానికి వెలుగు చూపుతున్న మంచి మనసులు-జమ్మూలో ఆర్మీ ఆయుధ కేంద్రంపై ఉగ్రవాదుల అట్టాక్-2000 నోటుని సైతం రద్దు చ్చేయనున్న మోడీ సర్కారు!!-పొట్ట కూటి కోసం నిగ్రహంతో సజీవ విగ్రహంలా 30 ఏళ్ళు నిలబడ్డాడు-జియో యూజర్లు ఈ మాట విన్నారంటే పండుగ చేసుకుంటారు-ఆధునిక తెలుగుకు అడుగుజాడ మన గురజాడ-సూపర్ స్టార్ రోబో2లో నలుగురు స్టార్ హీరోలు ఉన్నారా??-ఒక ప్రభుత్వ డాక్టర్ పేద విద్యార్థి ప్రాణంతో ఆడుకున్న ఆట

సీఎం బందోబస్తులో కుప్ప కూలిన ఖాకీ

సీఎం ప్రాణాలకు రక్షణ ఇవ్వడం కోసం వచ్చిన రక్షకభటుడి హఠాన్మరణం. 
సీఎం బందోబస్తు విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి
మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టిన కర్నూలు రేంజ్‌ డీఐజీ నివాళులర్పించిన డీఎస్పీలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కడప జిల్లా పర్యటన సందర్భంగా బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్‌ నిన్న ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. కర్నూలు జిల్లా నందికొట్కూరు గ్రామానికి చెందిన సి.శాంతకుమార్‌ (41) 1995లో కానిస్టేబుల్‌గా ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం జూపాడుబంగ్లా పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తూ. సీఎం పర్యటన సందర్భంగా కడపలో బందోబస్తు విధుల కోసం శుక్రవారం కడపకు చేరుకున్నారు.

శనివారం కడప మార్కెట్‌యార్డులోని వాహనాల పార్కింగ్‌ వద్ద కానిస్టేబుల్‌ శాంతకుమార్‌కు విధులు కేటాయించారు. ఉదయం 9.30 గం.లకు అల్పాహారం చేసేందుకు వెళుతున్న శాంతకుమార్ గుండెనొప్పితో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో సహచార సిబ్బంది సెవెన్‌రోడ్స్‌ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వైద్యం కోసం తక్షణమే తరలించారు. వైద్యులు కానిస్టేబుల్‌ను పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ మృతుడు శాంతకుమార్‌ కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించారు.

కన్నీటి పర్యంతమైన డీఐజీ రమణకుమార్‌
డ్యూటీలో ఉండి గుండెపోటుతో కానిస్టేబుల్‌ శాంతకుమార్‌ మృతి చెందిన వార్త తెలుసుకున్న కర్నూలు రేంజ్‌ డీఐజీ రమణకుమార్‌, ఓఎ్‌సడీ (ఆపరేషన్‌) సత్యయేసుబాబుతో కలిసి హుటాహుటిన ఆసుపత్రికి వచ్చారు. వృత్తి రీత్యా కఠినాత్ములుగా వ్యవహరిస్తారు కానీ కొన్ని సందర్భాలలో కన్నీటిని వారు ధరించిన ఖాకీ కూడా ఆపలేదు. కానిస్టేబుల్‌ మృతదేహాన్ని చూసిన డీఐజీ ఒక్కసారిగా కంట తడిపెట్టారు. అనంతరం వైద్యులతో చర్చించి మృతుడి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని డీఐజీ చెప్పారు. మృతదేహానికి పూల మాలలు వేసి ఘననివాళులర్పించారు. మృతుడి కుటుంబానికి వెంటనే ఈ సమాచారం ఇవ్వాలంటూ కడప డీఎస్పీ అశోక్‌కుమార్‌ ని డీఐజీ సూచించారు.

కానిస్టేబుల్‌ మృతి విషయం తెలుసుకున్న కడప జిల్లా డీఎస్పీ అశోక్‌కుమార్‌, ఎస్సీ-ఎస్టీ సెల్‌ డీఎస్పీ షౌకత్‌ ఆలి, ట్రాఫిక్‌ డీఎస్పీ భక్తవత్సలం, వన్‌టౌన్‌ సీఐ సత్యనారాయణ, వన్‌టౌన్‌ ఎస్‌ఐలు నాగరాజు,చిన్నచౌకు సీఐ రామక్రిష్ణ, ప్రతా్‌పరెడ్డి, పోలీసు సిబ్బంది ఆసుపత్రికి వచ్చి సంత కుమార్ మృతదేహాన్ని పరిశీలించారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న సహచార సిబ్బందిని జరిగిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఏపీ సీఎం
ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటనలో విధులు నిర్వహిస్తున్న సమయంలో కానిస్టేబుల్‌ శాంతకుమార్‌ మృతి చెందిన విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు కానిస్టేబుల్‌ మృతికి తన సంతాపం తెలియజేశారు. మృతుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు. ఆయన కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. మృతుడి కుటుంబాన్ని అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts