క్రికెట్టర్లకి కోట్లు కబడ్డీ కింగ్ లకు వేలా???
మీరు వింటున్నది నిజమే… మన క్రికెట్టర్లు కప్ గెలిచినా ఓడినా వాళ్ళకిచ్చే రుసుము కోట్లలోనే ఉంటుంది.
క్రికెట్ కష్టమే కావొచ్చు కానీ కబడ్డీ అంత కంటే కష్టం కదా…
క్రికెట్ లో కష్టపడి వికెట్స్ తియ్యాలి బౌలింగ్ వెయ్యాలి బాటింగ్ చెయ్యాలి ఫీడ్లింగ్ చెయ్యాలి కానీ కబడ్డీ ఆడే క్రీడాకారుల కష్టం గురించి ఏమని చెప్పగలం ఇంథాని చెప్పగలం. ఒకరు కూతకి వెళ్లి అవుట్ అయితే ఆ జట్టులోని 7గురు వచ్చి మీద పడిపోతారు. ఊపిరి సలపని సిట్యుయేషన్స్ ని సైతం కష్టమైనా ఇష్టం గానే భరిస్తారు వాళ్ళు. దెబ్బలు గాయాలు వారికీ లెక్క కాదు. వారికి గెలుపే ధ్యేయం. ఇటీవల జరిగిన కబడ్డీ వరల్డ్ కప్ లో మన భారత జట్టు ఫైనల్ వరకు వెళ్ళి ఇరాన్‌ను ఓడించి హ్యాట్రిక్ టైటిల్ సాధించిన విషయం అందరికీ తెలిసిందే కదా. దీంతో యావత్ భారతదేశం కబడ్డీ కింగులపై ప్రశంశల వర్షం కురిపించింది. క్రికెటర్లు, ఒలింపిక్ పతకాలు సాధించిన వారి లాగే కబడ్డీ ఆటగాళ్లపై కూడా ప్రశంసలతోపాటు నజరానాల వర్షం కురుస్తుందని క్రీడా అభిమానులు అందరూ భావించారు. ఇది కేవలం ఊహ మాత్రమే. కానీ వాస్తవంలోకి వస్తే వారిని పట్టించుకున్న వారే లేరు.
2011లో జరిగిన ఐసీసీ వరల్డ్‌కప్ సాధించిన భారత క్రికెట్ టీమ్ మెంబర్స్ ఒక్కొక్కరికి కోటిన్నర దాకా అందాయి.అలాగే ఒలింపిక్స్‌లో 2వ స్థానంలో నిలిచి రజత పథకం సాధించిన పీవీ సింధుకు రూ. 15 కోట్ల దాకా నగదు బహుమతి ముట్టాయి.
మరి వరల్డ్‌కప్ నెగ్గిన మన కబడ్డీ టీమ్‌కు ఇచ్చిన ప్రైజ్ మనీ ఎంతో తెలుసా??
ఎంతంటే కేవలం రూ. 10 లక్షలు మాత్రమే..! అంటే ఒక్కో ఆటగాడికి అందేది సుమారు రూ. 67 వేలు..! మాత్రమే. ఇంటెర్నేషన్ కి మన వాళ్ళు వెళ్ళినప్పుడు అసలు పట్టించుకోని నాయకులు కప్ గెలవగానే ఆ ఘనతేదో తమదే అన్నట్టుగా ఓ భుజాలు ఎగర వేశారు. తన వల్లే టీం గెలిచినట్టు ట్వీట్ చేసిన కేంద్ర క్రీడా మంత్రి విజయ్ గోయల్ కనీసం ఒక్క రూపాయి కూడా విదిలించిన పాపాన పోలేదు.
‘దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కినందుకు ఎంతో గర్విస్తున్నా. కానీ జట్టులోని ఏ సభ్యుడికీ రాష్ట్ర ప్రభుత్వాలు నజరానాలు ప్రకటించక పోవడం ఆశ్చర్యంగా ఉంది. టీమ్ మొత్తానికి దక్కింది రూ. 10 లక్షలు మాత్రమే. అందరూ పంచుకుంటే దక్కేది చాలా తక్కువ. నేనేమీ కాసుల వర్షం కురిపించమనడం లేదు. మేం సాధించిన విజయానికి తగిన గుర్తింపు రాలేద’ని వరల్డ్‌కప్ హీరో అజయ్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశాడు.ఒలింపియన్లతో పోల్చితే తమకు తగిన ప్రోత్సాహం కరువైందన్నాడు. కనీసం టర్ఫ్లైనా అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశాడు.
కేంద్ర ప్రభుత్వం దేశం కోసం ఆడిన ఆటగాళ్లపై ఇంత చిన్నచూపు చూడడం సబబు కాదని క్రీడా అభిమానులు మరియు సామాన్యులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .
Leave a Reply