హీరో నాగ చైతన్య నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో మంజిమా మోహన్ హీరోయిన్, మెగా హీరోలంటే ఇష్టమంటున్నది.
మలయాళ హీరోయిన్, తమిళంలో వరుస ఆఫర్లతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న నటి మంజిమ మోహన్. ప్రస్తుతం ఈమె తమిళంలోనే మూడు నాలుగు ప్రాజెక్టులు చేస్తూ త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా రానుంది. అక్కినేని యువ హీరో నాగ చైతన్య నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో మంజిమా మోహన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఈ నెల 11న విడుదలకానుంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో మంజిమా మోహన్ పలు ఆసక్తికర విషయాలను తెలిపింది.
ముందుగా సినిమా గురించి చెబుతూ నాకు తెలుగు రాదు కాబట్టి తెలుగు వర్షెన్ చేయనని చెప్పాను. కానీ గౌతమ్ మీనన్ గారి ప్రోత్సాహం వలన చేశాను అన్నారు. అలాగే తెలుగులో ఇష్టమైన హీరోలు ఎవరనే ప్రస్తావన రాగా మంజిమా మోహన్ ఏమాత్రం ఆలస్యం లేకుండా వెంటనే మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ లు అంటే తనకిష్టమని చెప్పేసింది. అలాగే తన తండ్రికి తాను సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని, అయినా వచ్చానని, భవిష్యత్తులో నటనకు ఆస్కారమున్న మంచి పాత్రలు చేయాలనుందని తెలిపింది.
Leave a Reply