భారత యువ షట్లర్ సిరిల్ వర్మ మరోసారి టాప్‌లో రాణిస్తా !
ప్రపంచ జూనియర్ నంబర్‌వన్ సిరిల్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ ఖేల్ ప్రతినిధి: భారత యువ షట్లర్ సిరిల్ వర్మ మరోసారి సత్తాచాటాడు. ఈ హైదరాబాద్ కుర్రాడు ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో పురుషుల సింగిల్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. తాజాగా ప్రకటించిన బీడబ్ల్యూఎఫ్ జూనియర్ ర్యాంకింగ్స్‌లో సిరిల్ ఓస్థానం ఎగబాకి టాప్‌ర్యాంకులో నిలిచాడు. 16,596 పాయింట్లతో సిరిల్ టాప్‌ర్యాంకర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటిదాకా అగ్రస్థానంలోనున్న థాయ్‌లాండ్ షట్లర్ కాంటాఫోన్ వాంగ్‌చారెన్ 16,252 పాయింట్లతో రెండోర్యాంక్‌కు పడిపోయాడు. టాప్‌ర్యాంక్‌ను నిలబెట్టుకునేందుకు మున్ముందు టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తానని సిరిల్ అన్నాడు. జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గినప్పటినుంచి నాపై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్లే ఇటీవల టోర్నీల్లో మెరుగ్గా ఆడుతున్నాను. మళ్లీ టాప్‌ర్యాంకును దక్కించుకున్నందుకు సంతోషంగా ఉంది. టాప్‌స్థానాన్ని నిలబెట్టుకుంటాను అని సిరిల్ చెప్పుకొచ్చాడు.
Leave a Reply