క్యూలో ఉన్న వారిని కొట్టొద్దు అంటున్న మోడీ
సమాజంలో ఏదైనా ఒక కొత్త సంస్కరణ తీసుకురావాలంటే అది మాములు విషయం కాదు. అలాంటిది చెప్పా పెట్టకుండా రాత్రికి రాత్రి 500,1000 నోట్ల రద్దు అని నరేంద్ర మోడీ పేల్చిన బాంబు ఇంకా మనందరికీ గుర్తే ఉంది కదా…
అన్ని విషయాలు ప్రజలకు చెప్పే నిర్ణయం తీసుకోవాలి కానీ కొన్ని విషయాలు జనానికి చెప్పకుండానే చెయ్యాలి. ఈ నోట్ల రద్దు విషయం ముందే బయటకి పొక్కితే బడా బాబులందరు సర్దేసే వారు. ఇంత అప్రమత్తంగా చేసినా కూడా చాలా వరకు నల్ల సొమ్ము భద్రంగా దాటించేశారు.
ముందు నోట్ల రద్దు విషయం జనానికి తెలిసిన వెంటనే సామాన్యులంతా మోడీని సపోర్ట్ చేస్తూ హర్షం వ్యక్తం చేశారు. బడా బాబులకి మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.
మరుసటి రోజు నుండి అసలు రంగు పూర్తిగా మారిపోయింది. సామాన్యులేమోచేతిలో ఉన్న 500,1000 నోటుని మార్చడానికి నానా తంటాలు పడుతున్నారు. నల్ల దొరలూ మాత్రం దొంగతనంగా వారి ఖజానాలో దాచిన దొంగ సొమ్మును తెల్ల ధనంగా మార్చే యత్నాలు మొదలు పెట్టారు. కానీ ఇందులో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది మాత్రం సామాన్యులే.
చదువుకున్న వారి పరిస్థితి చదువుకొని వారి పరిస్థితి రెండూ దారుణమే. కానీ చదువుకున్న వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకి ఈ నెట్ బ్యాంకింగ్ లు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు,డిపాజిట్ మెషీన్లు ఉండటం వల్ల సమస్య తక్కువ గానే ఉంది.
చదువుకోని వారి విషయానికి వస్తే వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న ఒకటి రెండు 500,100 నోట్లను మార్చడానికి పడే బాధ అంతా ఇంతా కాదు. కానీ మోడీ గత రెండేళ్ల ముందు నుండే బ్యాంకు అకౌంట్లు క్రియేట్ చేసుకోండి ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింకప్ చేసుకోండి అని చెప్తూనే ఉన్నారు. మన పిచ్చి జనానికి కష్టపడే వరకు దేని విలువ తెలియదు కదా..
అప్పుడు పెడ చెవిన పెట్టారు ఇప్పుడేమో పడరాని కష్టాలన్నీ పడుతూ క్యూలు కట్టి మరి బ్యాంకు ల్లో డబ్బు జమ చెయ్యడానికి వెళుతున్నారు.
వాళ్ళని చూస్తే జాలి కూడా లేని పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తూ లాఠీలతో కొడుతున్నారు.
దేశ ప్రజల శ్రేయస్సు కోసమే ఇంత కష్ట పడి సామాన్యులతోను నల్ల బాబులతోను మాటలు పడుతూ నిందలు మోస్తున్న మోడీ ఈ సంఘటనలు చూసి చలించి దీనిపై స్పందించారు.
పెద్ద నోట్ల రద్దు దేశం క్షేమం కోసమే చేశామని, ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేట్లు వివరించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని పోలీసు ఉన్నతాధికారులను కోరారు. పటేల్ అకాడమీలో శనివారం జరిగిన డీజీపీల సదస్సులో ఆయన మాట్లాడారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలో నిలుచున్న ప్రజల పైకి పొరపాటున కూడా లాఠీ ఎత్తొద్దని మోడీ చెప్పారు.
ప్రజలను ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవల ఉపయోగాలను తెలిపి వాటి వైపు మళ్లేలా ప్రోత్సహించాలని సూచించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల దేశానికి జరిగే మేలును కూడా సామాన్య ప్రజానీకానికి వివరించేలా కింది స్థాయి పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని ప్రధాని సూచించారు.
Leave a Reply