సర్దార్ కూడా ఒక సామాన్యుడేగా అంటున్న కొత్త నోటు
ప్రేమగా దాచుకున్న పాత నోట్లు పనికి రాకుండా పోయాయి. దీనితో కొత్త నోట్లని కోటలోకి ఎప్పుడు చేర్చుకుందామా అని జనం తెగ తాపత్రయ పడుతున్నారు. దీని కోసం ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలో నిలబడి అష్టకష్టాలు పడుతూనే ఉన్నారు. ఎలాగోలా కష్టపడి కొత్త నోట్లు తెచ్చుకుంటున్న వారంతా ఆ కొత్త నోటు సోయగాలను చూడగానే అప్పటివరకు పడిన కష్టాన్ని సైతం మరిచిపోతున్నారు. ఆ నోట్లని చూసి మురిసిపోతున్నారు. నోటు ముందు సామాన్యుడైతేనేం సినిమా సెలెబ్రెటీ అయితేనేం అందరూ సమానమే కదా… తాజాగా సినీ నటుడు, జనసేన అదినేత పవన్ కల్యాణ్ తీక్షణంగా కొత్త నోట్లని చూస్తున్న ఫోటోలు ఇటు మీడియా లోను అటు సోషల్ మీడియాలోనూ తెగ చెక్కర్లు కొట్టేస్తున్నాయి. పవర్ స్టార్ కూడా మనందరి లాగే కొత్తగా అందంగా బయటకి వచ్చిన 2000 నోటును చూసి మురిసిపోతున్నారు.
నోట్ల మార్పిడిపై ఇప్పటికే తన అభిప్రాయాన్ని ప్రకటించారు పవన్. అయితే దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడడంతో బీజేపీ ప్రభుత్వంపై అసంతృప్తి ప్రకటించారు. ఇంత హడావుడిగా ప్రకటించడం అవసరమా? అంటూ తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ కూడా చేశారు. కాటమరాయుడు షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల పాత నోట్లని మార్చడానికి సమయం లేని పవన్ కళ్యాణ్ ఇటీవలే గుట్టు చప్పుడు కాకుండా బ్యాంకు కి వెళ్లారు. పవర్ స్టార్ బ్యాంకు కి వస్తున్నాడన్న విషయం జనానికి తెలిస్తే ఇంకేమైనా ఉందా!! అసలే రద్దీగా ఉంటున్న బ్యాంకులు మరింత రద్దీగా మారే అవకాశం ఉంది. అందుకే కాటమరాయుడు కామ్ గా వచ్చి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. కొత్తహాగా వచ్చిన నోటుని బాగా పరిశీలించారు. కొత్తగా వచ్చిన 2000 నోట్లు మరియు 100నోటుని ఒకదానికొకటి పోల్చి చూస్తున్నారు. రూ. 100 నోటు ఎలా ఉంది? రూ.2 వేల నోటు ఎలా ఉంది? అని చూస్తున్నట్లుగా ఈ ఫోటోని చూస్తే ఈజీగా అర్ధం అవుతుంది. కొత్త నోట్లు చేతిలో పడిన తర్వాత ఆయన వాటిని ఆసక్తిగా చూస్తున్న ఫోటోలు విడుదల అయ్యాయి.
Leave a Reply