ఇన్నాళ్లు ఈ సమయం కోసమే ఎదురుచూస్తున్నానన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ! | Telugu News
మోడీ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరింది.....-500, 1000రూ లకు గుడ్ బై చెప్పిన మోడీ ప్రభుత్వం !!!-భారత్‌లో కోటీశ్వరులెందరో తెలుసా?-ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టు 'ఉడాన్'పథకం:గంట విమాన జర్నీకి రూ.2,500-ఆన్‌లైన్‌లో హల్‌చల్ భారత రిజర్వు బ్యాంకు త్వరలో తెలుపు,పింక్ రంగు కలయికగా రూ.2 వేల నోట్లు..-ఫెస్టివల్ బొనాంజ కింద మహిళలకు ఓ శుభవార్త.. తక్కువ వడ్డీతో గృహ రుణాలు..-హైదరబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు కళల బండి వచ్చేస్తోంది…!!-టాలీవుడ్ స్టార్ మహేష్ బ్రాండ్ ప్రమోషన్స్ .. క్రెడిట్ ఆమెకే-"న్యూడ్ గా నటించాలంటే మాత్రం నో చెప్పేస్తా" అని అంటోంది.-ఎస్ఎస్ థమన్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ 'పవన్ కళ్యాణ్' సినిమాలో ఛాన్స్ కొట్టేసినాడు

ఇన్నాళ్లు ఈ సమయం కోసమే ఎదురుచూస్తున్నానన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ !

‘సరైనోడు’ సూపర్ సక్సెస్ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ మధ్యే ‘దువ్వాడ జగన్నాథం’ పేరుతో ఓ కొత్త సినిమాకి సైన్ చేశాడు. ఇప్పటికే హైదారాబాద్ లో ఈ చిత్రం యొక్క షూటింగ్ జరుగుతోంది. హరీష్ శంకర్ ఇన్నాళ్లు హీరో హీరోయిన్ల మినహా మిగతా నటీ నటుల పై సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ షూటింగ్లో ఈ రోజు నుండి అల్లు అర్జున్ జాయినయ్యాడు. ఇక సినిమా షూటింగ్ ఫిబ్రవరి వరకూ నిరాటంకంగా కొనసాగనుంది.

ఈ విషయాన్నే అల్లు అర్జున్ తెలుపుతూ ‘లాంగ్ గ్యాప్ తరువాత మొదటిరోజు షూటింగ్ కు వెళుతున్నాను. చాలా రోజులుగా దీనికోసమే ఎదురుచూస్తున్నాను. మళ్ళీ షూట్ కి వచ్చినందుకు హ్యాపీగా ఉంది’ అంటూ ఆనందాన్ని వ్యక్తపరచగా దర్శకుడు హరీష్ శంకర్ కూడా ‘ఆర్య సినిమా చూసినప్పటి నుండి అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇన్నాళ్లకు ఆ కల నెరవేరింది’ అంటూ ట్వీట్ చేశాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నా ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *