26/11 దాడులకి నేటితో ఎనిమిదేళ్ళు | Telugu News
ఈ కథ చదవడం మాత్రం మిస్ అవ్వొద్దు-ఉభయ సభల్లో గందరగోళం మధ్య ఆమోదం పొందిన ఐటీ చట్టసవరణ బిల్లు-మసకబారుతున్న మానవత్వానికి వెలుగు చూపుతున్న మంచి మనసులు-జమ్మూలో ఆర్మీ ఆయుధ కేంద్రంపై ఉగ్రవాదుల అట్టాక్-2000 నోటుని సైతం రద్దు చ్చేయనున్న మోడీ సర్కారు!!-పొట్ట కూటి కోసం నిగ్రహంతో సజీవ విగ్రహంలా 30 ఏళ్ళు నిలబడ్డాడు-జియో యూజర్లు ఈ మాట విన్నారంటే పండుగ చేసుకుంటారు-ఆధునిక తెలుగుకు అడుగుజాడ మన గురజాడ-సూపర్ స్టార్ రోబో2లో నలుగురు స్టార్ హీరోలు ఉన్నారా??-ఒక ప్రభుత్వ డాక్టర్ పేద విద్యార్థి ప్రాణంతో ఆడుకున్న ఆట

26/11 దాడులకి నేటితో ఎనిమిదేళ్ళు

దేశ చర్రిత్రలో ఈ రోజు ఒక చీకటి రోజు..!!
ముంబై వాసులు ఏమి జరిగిందో ఏమి జరుగుతుందో అని నిలువెల్లా వణికిపోయిన రోజు.. అదే 26/11 అని పిలుచుకునే ముంబై దాడులు..!! ఓ నెత్తుటి అధ్యాయం..!!
లష్కర్ ఎ తోయిబా అనే ఉగ్రవాద సంస్థ నుండి వచ్చిన ఒక 10 పిచ్చి కుక్కలు అరేబియా సముద్రం నుండి AK 47 వంటి అత్యాధునిక ఆయుధాలు ధరించి మొదట రైల్వే స్టేషన్ నుండి ప్రజలు కాలుస్తూ చివరకు తాజ్ హోటల్ లో బస చేస్తున్న వారిపై కూడా కాల్పులు జరిపి అక్కడ ప్రజల ప్రాణాలని బలిగొన్నారు..!!
మొత్తం 168 ప్రాణాలకుపైగా చనిపోగా దాదాపు 308 క్షతగాత్రులైనారు..!!
ఆపై NSG Commandos “Operation Black Tornodo” పేరుతో దేశ చరిత్రలో చెయ్యని క్లిష్టమైన Operation చేసి పిచ్చికుక్కలని పాతిపెట్టి Taj Hotel లోని మిగతా దేశ విదేశ ప్రజలని కాపాడారు..!!
వారిలో ఒక్క ఉగ్రవాది సజీవంగా దొరికాడు..వాడే అజ్మల్ కసబ్..!! వాడు దొరికప్పటి నుండి వాడిని నిత్యం 250 కమాండోలు అత్యంత భద్రతతో కాపాడుతూ ప్రభుత్వం వాడికి ముచ్చటైన విందులు వండి వడ్డించింది..!! వాడికి మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెట్టిన ఖర్చు 53 కోట్లు..!! 
దేశంలో ఇప్పటివరకు ఏ ఖైదికి ఇంత ఖర్చు కాలేదు..!! వాడిని న్యాయస్థానం ముందు తీసుకొచ్చి చట్టపరంగా శిక్షించడానికి మనకు నాలుగేళ్ళు పట్టింది..!! అది మన దేశ గొప్పదనమే..!!

ఇక ఈ ఆపరేషన్ లో ఐదుగురు అధికారులు చనిపోయారు..!!

వారిని ఒకసారి గుర్తు చేసుకువాల్సిన అవసరం ఎంతైనా ఉంది..!!
.
1. Hemant Karkare:Chief of Mumbai Anti-Terrorist Squad (ATS)
2. Tukaram Gopal Omble: Asst. Sub-inspector and retired army man
3. Ashok Kamte: Additional Commissioner of Police
4. Vijay Salaskar: Senior Police Inspector and encounter specialist
5. Major Sandeep Unnikrishnan: National Security Guards (NSG) commando
.
ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన దేశవిదేశ పౌరులకి మరియు అత్యంత ధైర్య సాహసాలతో ఎదుర్కొని ప్రాణాలు అర్పించిన
అధికారులకి దేశం యావత్తు నివాళి అర్పిస్తూ మిమ్మల్ని స్మరించుకుంటున్నాం..!

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts